English | Telugu
Podharillu : రిసెప్షన్ వీడియో చూసిన ప్రతాప్.. రూమ్ చూడమని చెప్పిన మహా!
Updated : Feb 12, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -48 లో......ప్రతాప్ తన కూతురు మహా లేచిపోయి పెళ్లి చేసుకుందని అవమానంతో ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. దాంతో వాళ్ళనాన్న దగ్గరికి ఆదిత్య వచ్చి ఆఫీస్ కి రండి నాన్న అందరు మిమ్మల్ని రమ్మని అంటున్నారని చెప్తాడు. ఎందుకు అవమానంతో ఎలా ఉన్నానో చూడడానికా.. వాళ్ళు పైకి ఆలా అంటున్నా.. వాళ్ళ మనసులో నవ్వుకుంటూ ఉంటారని ప్రతాప్ అంటాడు. ఇంట్లో ఒక మనిషి పోతే పనులు ఆగాలా అని ఆదిత్య అంటుంటే ఏం మాటలురా అని లలిత అంటుంది.
నేను ఒక మాట చెప్పాలా మీరు భూషణ్ గురించి ఇబ్బంది పెట్టకపోతే అసలు మహా ఇంట్లో నుండి వెళ్లిపోయేదే కాదు.. తప్పనిసరి పరిస్థితిలో ఆ డ్రైవర్ ని పెళ్లి చేసుకుందని హారిక చెప్తుంది. లేదు తను ఇష్టపడి పెళ్లి చేసుకుందని ఆదిత్య అంటాడు. మహా, చక్రి రిసెప్షన్ వీడియోని ఇంట్లో వాళ్ళకి చూపిస్తాడు. అది చూసి ప్రతాప్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడే మీ నాన్న కోలుకుంటున్నాడు. ఇంతలో మళ్ళీ ఎందుకు చూపించావని లలిత అంటుంది. మహా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని హారిక అంటుందని చూపించాను అని ఆదిత్య అంటాడు. మరొకవైపు మహా, చక్రి ఇద్దరు అన్ని హాస్టల్ లు తిరిగి ఇంటికి వస్తారు. అప్పుడే ఇంటికి పోలీసులు వస్తారు. నారాయణ తనని కొట్టాడని వాళ్ళ అన్న పోలీసులని తీసుకొని వస్తాడు. ఇంకా దెబ్బ సరిపోలేదారా అని నారాయణ పోలీసుల ముందే మాట్లాడుతుంటే పోలీసులు నారాయణని తీసుకొని వెళ్తారు.
ఆ తర్వాత ఇంట్లో అందరు భోజనం చెయ్యడానికి సిద్ధమవుతారు. మహా భోజనం చేస్తూ నలుగురు కొడుకులున్నారు.. మీ నాన్నని పోలీస్ లు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు.. దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదని మహా అంటుంటే అది మాకు అలవాటు పోలీసులకి అలవాటని కేశవ అంటాడు. ఆ తర్వాత మాధవతో నాకు ఒక రూమ్ రెంట్ కి చూడమని మహా చెప్తుంది. మళ్ళీ మొదటికి వచ్చిందని చక్రి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.