Home

»

Tv News

Illu illalu pillalu : కొత్త కోడలి ఆలోచనకి ఇంప్రెస్ అయిన మామయ్య.. విశ్వని కొట్టిన రామరాజు!

Apr 22, 2025

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -138 లో...... శ్రీవల్లి మొదటిసారిగా అతింట్లో అడుగుపెట్టడానికి గుమ్మం ముందు నిల్చొని ఉంటారు. ఇక ఆడపడుచులు పేరు చెప్పి లోపలికి రండి అని ఆటపట్టిస్తారు. నర్మద, ప్రేమ మాత్రం తాము ఇలా  కాకుండా గొడవల్లో అత్తారింట్లో అడుగుపెట్టిన సిచువేషన్ గుర్తుచేసుకొని బాధపడతారు. చందు, శ్రీవల్లి తమ పేర్లు చెప్పి లోపలికి వస్తారు.‌ శ్రీవల్లి లోపలికి వెళ్లి దీపం పెడుతుంది. ముగ్గురు కోడళ్ళలో ఈ కోడలే సంప్రదాయంగా ఇంట్లో అడుగుపెట్టింది. మిగతా ఇద్దరు ఏదో హాస్టల్ కి వచ్చినట్లు వచ్చారని కామాక్షి అంటుంది. దాంతో ప్రేమ, నర్మద బాధపడుతుంది.

ప్రేమ, నర్మద బాధపడుతుంటే వేదవతి వాళ్ళ దగ్గరికి వెళ్లి తీసుకొని వస్తుంది. ఆ తర్వాత విశ్వ చేసిన పనికి రామరాజు కోపంతో విశ్వ దగ్గరికి వెళ్లి బయటకు లాక్కొని వచ్చి కొడుతాడు. నా కొడుకు జీవితం అన్యాయం చెయ్యాలని చూస్తావా అని విశ్వని రామరాజు కొడుతుంటే ప్రేమ వచ్చి.. మావయ్య నా మొహం చూసి ఆగండి అని ఆపుతుంది. 

ఆ తర్వాత అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. అమూల్య వెళ్లి శ్రీవల్లిని తీసుకొని వస్తుంది. దాంతో శ్రీవల్లి వస్తుంది. ఇలా పైన కూర్చొని కాకుండా కింద కూర్చొని తింటే బాగుంటుందని శ్రీవల్లి అనగానే మంచి ఆలోచన అని రామరాజు సరే అంటాడు. అందరు కింద కూర్చొని భోజనం చేస్తారు. చందుకి శ్రీవల్లి తినిపిస్తుంది. దాంతో చందు సిగ్గుపడతాడు. తరువాయి భాగంలో ప్రేమ వాళ్ళ కుటుంబాన్ని శ్రీవల్లి తిడుతుంది. దాంతో ప్రేమ ఏడుస్తూ బయటకు వస్తుంది. తన వాళ్ళు తప్పు చేస్తే ప్రేమని ఎందుకు తిడుతున్నావని శ్రీవల్లితో నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com