నువ్వైనా మాట్లాడు లేదా నన్నైనా మాట్లాడనివ్వు!
`స్టార్ మా`లో ఓంకార్ కొత్తగా మొదలుపెట్టిన డ్యాన్స్ షో `డ్యాన్స్ ప్లస్`. డ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ అనే ట్యాగ్ లైన్‌తో మొదలుపెట్టిన ఈ షోలో బాబా భాస్కర్, రఘు మాస్టర్, యష్, యానీ, ముమైత్‌ఖాన్, మోనాల్ గజ్జర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఓంకార్ ఈ కార్యక్రమానికి హోస్ట్. గత కొన్ని వారాలుగా శని ఆదివారాలు ప్రసారం అవుతూ విశేషంగా ఆకట్టుకుంటోంది.