English | Telugu

సర్దార్ జీ 3 లో పాకిస్థాన్ నటిని ఏ విధంగా తీసుకున్నారు..సిద్దు సమాధానం ఏంటో తెలుసా!

సర్దార్ జీ 3 లో పాకిస్థాన్ నటిని ఏ విధంగా తీసుకున్నారు..సిద్దు సమాధానం ఏంటో తెలుసా!

ఏప్రిల్ నెలలో 'పాకిస్థాన్' కి చెందిన తీవ్రవాదులు కాశ్మీర్ లోని  మన భూమండలంలోకి చొరబడి 28 మందిని చంపడంతో పాటు మరికొంత మందిని గాయపరిచారు. అందుకు ప్రతీకారకంగా మన సైన్యం పాకిస్థాన్ లో  'ఆపరేషన్ సిందూర్' ని నిర్వహించి తీవ్రవాదులని మట్టుపెట్టింది. ఈ మొత్తం సంఘటనతో పాకిస్థాన్ కి చెందిన సినీనటుల్ని మన సినిమాల్లోకి తీసుకోకూడదనే అల్టిమేటం జారీ అయ్యింది. పాకిస్థాన్ నటులు    నటించిన మన సినిమాలని కూడా ఇండియాలో రిలీజ్  కాకుండా బ్యాన్ చేసారు. ఈ కోవలోనే పాకిస్థాన్ నటులు నటించిన కొన్ని హిందీ సినిమాలు రిలీజ్ కాలేదు.