English | Telugu
కామ్రేడ్ కళ్యాణ్.. కామెడీ గ్యారంటీ అండి బాబు
Updated : Oct 6, 2025
ఈ ఏడాది 'మే' లో 'సింగిల్'(Single)తో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు శ్రీవిష్ణు(Sree Vishnu). కలెక్షన్స్ ల పరంగా కూడా హయ్యెస్ట్ బెంచ్ మార్క్ ని అందుకోవడంతో, తన తదుపరి చిత్రాలపై ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. ఈ కోవలోనే 'మృత్యుంజయ' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. రీసెంట్ గా దసరా సందర్భంగా 'కామ్రేడ్ కల్యాణ్’ అనే టైటిల్ తో కూడిన మరో కొత్త చిత్రాన్ని ప్రకటించడంతో పాటు, గ్లింప్స్ కూడా విడుదల చేశారు. నక్సలైట్ గా శ్రీ విష్ణు కనిపిస్తున్నాడు.
దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కామ్రేడ్ కళ్యాణ్(Comrade kalyan)సీరియస్ మూవీ అని అనుకుంటున్నారు. కానీ శ్రీవిష్ణు(Srivishnu)తరహాలోనే ఎంటర్ టైన్ మెంట్ ఒక రేంజ్ లో ఉండబోతునట్టుగా తెలుస్తుంది. ఆర్.నారాయణ మూర్తి(R Narayanamurthy)ఫ్యాన్ గా శ్రీ విష్ణు కనిపించబోతున్నాడని, నారాయణ మూర్తి సినిమాలని థియేటర్లో ఆడిస్తూ, చూస్తూ పెరిగిన యువకుడు, నక్సలైట్ గా ఎందుకు మారాడు అనేదే చిత్ర కథ అని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.ఆ ప్రయాణం చాలా హిలేరియస్‌గా సాగబోతున్నట్టుగా కూడా టాక్. ఇప్పుడు ఈ న్యూస్ తో కామ్రేడ్ కళ్యాణ్ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ విష్ణు సరసన మహిష్మా నంబియార్ కథానాయికగా చేస్తుండగా, రాధికా శరత్ కుమార్, టామ్ చాకో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ప్రముఖ రచయిత కోన వెంకట్(Kona Venkat)సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తుండగా,జానకీరామ్ మారెళ్ల(janakiRam Marella)దర్శకుడు. 'బేబీ’ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. 1992 వసంవత్సరంలో ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్‌లో సాగే కథ.