
హీరో నిఖిల్ సిద్ధార్థ(Nikhil Siddhartha) నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ 'స్వయంభు'(Swayambhu). భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది.
టెక్నికల్ గ్లిచ్ కారణంగా 'స్వయంభు' టీజర్ ను యూట్యూబ్ లో మళ్ళీ అప్లోడ్ చేశారు. ఈ విషయంలో నిఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
"యూట్యూబ్.. ఎందుకు భయ్యా ఇలా గ్లిచ్ చేశావ్.
రీఅప్లోడ్ చేసిన స్వయంభు టీజర్ ను చూడండి.
గమనిక: ఇటీవల విడుదలైన ఇతర సినిమాల్లా మా సినిమాలో ఎలాంటి AI ఉపయోగించలేదు." అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు.
మా మా సినిమాలో AI ఉపయోగించలేదు అని చెప్పడం వరకు ఓకే కానీ.. ఇటీవల విడుదలైన ఇతర సినిమాల్లా అని అనడం చర్చకు దారితీసింది.
తాజాగా 'నాగబంధం'(Nagabandham) టీజర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆ టీజర్ ను ఉద్దేశించే నిఖిల్ ఈ కామెంట్స్ చేశాడా? అనే చర్చ జరుగుతోంది.
?s=20






