Updated : Jul 31, 2023
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన 'చంద్రముఖి' సినిమా 2005 లో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తోంది. అయితే 'చంద్రముఖి-2'లో రాఘవ లారెన్స్ నటిస్తుండటంతో.. సూపర్ స్టార్ మ్యాజిక్ రిపీట్ చేయగలడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా విడుదలైన 'చంద్రముఖి-2' ఫస్ట్ లుక్ చూస్తే ఆ అనుమానాలు నిజమయ్యేలా ఉన్నాయి.
తాజాగా 'చంద్రముఖి-2' ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. 'చంద్రముఖి'లో రజినీకాంత్ వేంకటపతి రాజాగా కనిపించిన లుక్ లో, ఈ పోస్టర్ లో లారెన్స్ కనిపిస్తున్నాడు. పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ, పోస్టర్ చూడగానే మాత్రం.. బాడీకి తల అతికించినట్లుగా ఉంది. ఇటీవల 'ప్రాజెక్ట్ కె'(కల్కి 2989 ఏడీ) ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినప్పుడు కూడా మొదట ఇలాంటి అభిప్రాయమే కలిగింది. ఆ తర్వాత మేకర్స్ ఎడిటింగ్ లోపాన్ని గుర్తించి కొత్త పోస్టర్ ని వదిలారు. ఆ తర్వాత వచ్చిన గ్లింప్స్ మాత్రం ప్రేక్షకులను ఫిదా చేసింది. మరి ఇప్పుడు 'చంద్రముఖి-2' విషయంలో కూడా ఆ అభిప్రాయం మారుతుందేమో చూడాలి.
లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15న తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.