
అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్(Allu Sirish) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గతేడాది అక్టోబర్ లో నయనిక రెడ్డితో శిరీష్ నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది మార్చి 6న వీరి వివాహ వేడుక జరగనుంది.
అల్లు వారి పెళ్లి పిలుపులు మొదలయ్యాయి. తెలుగు సంప్రదాయం ప్రకారం మొదటి శుభలేఖను మేనత్త కుటుంబానికి అందించారు. శిరీష్ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి.. చిరంజీవి-సురేఖ దంపతులకు శుభలేఖ ఇచ్చి వివాహానికి ఆహ్వానించాడు. (Chiranjeevi)

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న శిరీష్.. ఒక ఫొటోను కూడా షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోలో చిరంజీవి చేతికి సపోర్ట్ బ్యాండ్ ఉంది. దీంతో చిరంజీవికి ఏమైంది? షూటింగ్ లో ఏమైనా గాయమైందా? అనే చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే, అల్లు కుటుంబంలో మార్చి 6 తేదీకి ప్రత్యేకత ఉంది. అల్లు అర్జున్ వివాహం 2011 లో మార్చి 6 నే జరగడం విశేషం.







