Home

»

Latest News

రౌడీ బయోపిక్ లో అల్లరి నరేష్!

Dec 01, 2023

కామెడీ హీరోగా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్ కొంతకాలంగా రూట్ మార్చి విభిన్న చిత్రాలు చేస్తున్నాడు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి సినిమాల తర్వాత మరో వైవిధ్యమైన చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నరేష్ కెరీర్ లో 63వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'బచ్చలమల్లి' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు.

హాస్య మూవీస్ నిర్మిస్తున్న 'బచ్చలమల్లి' చిత్రానికి 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకుడు. శుక్రవారం ఉదయం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. బస్తాల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైనట్లుగా మనం పోస్టర్ లో గమనించవచ్చు. అలాగే ట్రాక్టర్ ట్రక్ డోర్ మీద 'బచ్చలమల్లి' అని టైటిల్ రాయడం క్రియేటివ్ గా ఉంది.

ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమని తెలుస్తోంది. కాకినాడ జిల్లాలోని తుని ప్రాంతానికి చెందిన ఒక లోకల్ రౌడీ షీటర్ జీవితం ఆధారంగా ఈ చిత్ర కథను రాసుకున్నట్లు సమాచారం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com