.jpg)
'ఆర్య', 'ఆర్య-2' తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'పుష్ప'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ, శ్రీవల్లి పాత్రలో రష్మిక కనువిందు చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన బన్నీ ఇంట్రడక్షన్ టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీపావళి కానుకగా పుష్ప మూవీ నుంచి మరో సర్ ప్రైజ్ రానుందని తెలుస్తోంది.
'పుష్ప' మూవీలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నెగటివ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను పరిచయం చేస్తూ దీపావళి కానుకగా ఓ టీజర్ ను విడుదల చేయనున్నారని న్యూస్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో నటిస్తున్న మరో నటుడు సునీల్ పాత్రను కూడా టీజర్ లో రివీల్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే దీపావళికి పుష్ప నుంచి డబుల్ ధమాకా వచ్చినట్లే అని చెప్పాలి.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప : ది రైజ్' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.






