Updated : Aug 5, 2024
ప్రేక్షకుల హృదయాల్లో కొన్ని జోడీలకి ప్రత్యేక స్థానం ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ సైతం ఆ జంట తన ఒడిలో ఆడిపాడాలని కోరుకుంటుంది. ఆ ఇద్దరు ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్, అందాల తార త్రిష. ఈ ఇద్దరు కలిసి ఒక మూవీ లో కనువిందు చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో స్పిరిట్ కూడా ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనే ఇన్ఫర్మేషన్ అధికారకంగా ఇప్పటి వరకు లేదు. కానీ ప్రభాస్ సరసన త్రిష చెయ్యబోతుందనే న్యూస్ ఒక రేంజ్ లోనే వస్తు ఉంది.సందీప్ అండ్ టీం త్రిష కి కథ చెప్పారని, ఆమెకి నచ్చి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని అంటున్నారు.ఇంకో అడుగు ముందుకేసి కొన్నిమీడియా సంస్థల్లో ప్రభాస్, త్రిష కాంబో సెట్ అయ్యిందనే వార్తలు కూడా వస్తున్నాయి.మరి ఇందులో నిజమెంత ఉందో మరికొన్ని రోజులు అయితే గాని తెలియదు.
సోషల్ మీడియాలో ఇంకో చర్చ కూడా నడుస్తుంది. ఎంత లేదన్నా త్రిష ఇప్పుడు యంగ్ హీరోయిన్ కింద రాదు. కాబట్టి స్పిరిట్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనపడతాడేమో అని కూడా అంటున్నారు. అప్పుడు అందులో ఒక ప్రభాస్ కి త్రిష జోడి కడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పోలీసు ఆఫీసర్ గా చేస్తున్న విషయం తెలిసిందే.ప్రభాస్ త్రిష గతంలో వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు లో వర్క్ చేసారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ లో అయితే స్పిరిట్ హంగామా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.యానిమల్ తర్వాత సందీప్ నుంచి వచ్చే మూవీ స్పిరిట్ నే.
