English | Telugu

Shambhala Review: శంబాల మూవీ రివ్యూ

Publish Date:Dec 24, 2025

  తారాగణం: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవివర్మ, స్వాసిక విజయ్, మధునందన్, లక్ష్మణ్ మీసాల, షిజు మీనన్, శివకార్తీక్ తదితరులు సంగీతం: శ్రీ చరణ్ పాకాల డీఓపీ: ప్రవీణ్ కె బంగారి ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని రచన, దర్శకత్వం: యుగంధర్ ముని నిర్మాతలు: రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి బ్యానర్: షైనింగ్ పిక్చర్స్ విడుదల తేదీ: డిసెంబర్ 25, 2025   ప్రేమ కావాలి, లవ్‌లీ వంటి విజయవంతమైన సినిమాలతో కెరీర్ ని ప్రారంభించిన ఆది సాయికుమార్.. సరైన విజయం కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఆ ఎదురుచూపులకు తెర దించే సినిమా 'శంబాల' అవుతుందని నమ్మకం పెట్టుకున్నాడు. ప్రచార చిత్రాలు ప్రామిసింగ్ గా అనిపించడంతో.. ప్రేక్షకుల దృష్టి కూడా ఈ సినిమాపై పడింది. మరి 'శంబాల' ఎలా ఉంది? ఆది ఖాతాలో హిట్ పడేలా ఉందా? (Shambhala Movie Review)   కథ: శంబాల అనే మారుమూల గ్రామంలో ఆకాశం నుండి ఒక ఉల్క వచ్చి పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊరిలో అన్నీ అనర్ధాలు జరుగుతుంటాయి. దీంతో ఊరి ప్రజలు.. ఆ ఉల్కని బండ భూతంగా భావిస్తూ.. భయంతో వణికిపోతుంటారు. స్వామీజీల సహాయంతో దీని నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించే పనిలో పడతారు. స్వామిజీ సూచనతో.. పాలకు బదులుగా రక్తాన్ని ఇస్తున్న ఆవుని చంపేయడానికి కూడా సిద్ధపడతారు. మరోవైపు యువ శాస్త్రవేత్త అయిన విక్రమ్(ఆది) ఆ ఉల్కపై పరిశోధన చేయడం ప్రభుత్వం తరపున అక్కడికి వస్తాడు. శాస్త్రాలు అబద్ధం, సైన్స్ మాత్రమే నిజమని నమ్మే నాస్తికుడైన విక్రమ్.. ఆ ఊరి వాళ్ళ నమ్మకాన్ని, భయాన్ని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తాడు. స్వామీజీల పూజలను కూడా అడ్డుకుంటాడు. ఈ క్రమంలోనే ఊరి వాళ్ళ ఆగ్రహానికి గురవుతాడు. ఓ వైపు విక్రమ్ పరిశోధన జరుగుతుండగా.. మరోవైపు ఊరిలో వరుస హత్యలు, ఆత్మహత్యలు సంభవిస్తూ ఉంటాయి. దీంతో ఊరి ప్రజలంతా కలిసి విక్రమ్ ని చంపడానికి కూడా సిద్ధపడతారు. అప్పుడు విక్రమ్ ఏం చేశాడు? శంబాల గురించి అతను తెలుసుకున్న నిజం ఏంటి? ఈ కథలో దేవి(అర్చన అయ్యర్) పాత్ర ఏంటి? వరుస మరణాల వెనకున్న శక్తి ఏంటి? దాని నుంచి విక్రమ్, ఊరిని ఎలా కాపాడగలిగాడు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: శంబాల టీజర్, ట్రైలర్ చూసినప్పుడే.. మంచి కంటెంట్ ఉన్న హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. శివుడు అంధకాసురుడిని సంహరించే సన్నివేశాలతో సినిమాని ప్రారంభించి.. అసలు ఈ కథకి పురాణాలతో సంబంధం ఏంటనే క్యూరియాసిటీని కలుగజేయడంలో సక్సెస్ అయ్యారు.  శంబాల ఊరిలో ఉల్క పడటం, ఒక ఆవు పాలకు బదులుగా రక్తం ఇవ్వడం, ఆ ఆవు యజమాని రాములు(రవి వర్మ) వింతగా ప్రవర్తించడం వంటి సన్నివేశాలతో.. ప్రేక్షకులను మొదటి నుంచే కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయగలిగారు. ఈ క్రమంలో వచ్చే హారర్ ఎపిసోడ్ కూడా బాగుంది. అయితే కెమెరా, ఎడిటింగ్ విభాగాల పనితీరు ఇంకా మెరుగ్గా ఉంటే.. ఆ ఎపిసోడ్ మరింత ఎఫెక్టివ్ గా ఉండేది.  ఉల్క గురించి పరిశోధన చేయడానికి నాస్తికుడైన విక్రమ్ గా ఆది ఎంట్రీ ఇవ్వడం బాగుంది. గ్రామ ప్రజలకు, ఆదికి మధ్య సన్నివేశాలను కూడా బాగానే రాసుకున్నారు. అయితే దేవి ట్రాక్ ని మాత్రం ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. నిజానికి ఆ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మాటల్లో తెలుస్తుంది కానీ, సన్నివేశాల్లో అది కనిపించదు. ముఖ్యంగా కీలకమైన సెకండ్ హాఫ్ లో ఆ పాత్ర ప్రేక్షక పాత్ర వహించినట్టుగానే అనిపిస్తుంది.  ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే అదృశ్య శక్తి కారణంగా రాములు(రవి వర్మ), కృష్ణ(లక్ష్మణ్ మీసాల) వింతగా ప్రవర్తించడం, ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మెప్పించాయి. దాంతో కథనం ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంది.  ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ త్వరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కథనంలో కూడా కాస్త వేగం కనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. అలాగే, పతాక సన్నివేశాలను కూడా ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. ఆది-పాప మధ్య బాండింగ్ ని మరింత ఎఫెక్టివ్ గా చూపించినట్లైతే.. క్లైమాక్స్ కి ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యుండేవారు.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: శాస్త్రవేత్త విక్రమ్ పాత్రలో ఆది చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో బాగా రాణించాడు. ఈ కథను నమ్మి, ఒక నటుడిగా తాను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. దేవి పాత్రకు తగ్గట్టుగా అర్చన అయ్యర్ కనిపించిన తీరు మెప్పించింది. అయితే రచన ప్రభావవంతంగా లేకపోవడంతో.. ఆ పాత్ర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తన సీనియారిటీతో రాములు పాత్రకు న్యాయం చేశాడు రవివర్మ. ఇక కృష్ణగా లక్ష్మణ్ మీసాల మరోసారి సర్ ప్రైజ్ చేశాడు. అతను ఇచ్చిన కొన్ని కొన్ని ఎక్స్ ప్రెషన్స్ థియేటర్స్ లో విజిల్స్ పడేలా ఉన్నాయి. కానిస్టేబుల్ హనుమంతుగా మధునందన్ ఆకట్టుకున్నాడు. హనుమంతు కూతురిగా నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. స్వాసిక విజయ్, శివకార్తీక్, అన్నపూర్ణ, షిజు మీనన్, శైలజ ప్రియ, హర్ష వర్ధన్, ఇంద్రనీల్ తదితరులు పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. శ్రీ చరణ్ పాకాల నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. చాలా సీన్స్ ని తన మ్యూజిక్ తో బాగానే ఎలివేట్ చేశాడు. హారర్ థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టుగా ప్రవీణ్ కె బంగారి కెమెరా పనితనం మెప్పించింది. అయితే కొన్ని కొన్ని షాట్స్ మాత్రం ఇంకా ఎఫెక్టివ్ గా తీయొచ్చు అనిపించింది. ఎడిటింగ్ లోపం కూడా కొన్ని చోట్ల ఆ ఫీలింగ్ కలగడానికి కారణమైంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయవచ్చు. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.   ఫైనల్ గా... రైటింగ్ పరంగా, టెక్నికల్ గా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పిస్తుంది. ముఖ్యంగా ఆదికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. గత కొన్నేళ్లలో ఆది నుంచి వచ్చిన బెస్ట్ ఫిల్మ్ ఇది అనడంలో డౌట్ లేదు. ఈ సినిమా భయపెడుతుంది, థ్రిల్ ని పంచుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగిస్తుంది. హారర్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి 'శంబాల' నచ్చుతుంది.    రేటింగ్: 2.75/5    Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  

Shambhala Movie Review

Publish Date:Dec 24, 2025

Cast: Aadi Saikumar, Archana Iyer, Ravi Varma, Swasika Vijay, Shiju, Harshavardhan, Madhunandan, Laxman Meesala, Chaitra, Annapoorna Crew:  Written by Ugandhar Muni, Suresh Kothapalli Music by Sricharan Pakala Cinematography by Praveen K. Bangarri Edited by Shravan Katikaneni  Directed by Ugandhar Muni Aadi Saikumar has been trying his level best with different scripts to entertain audiences and establish himself as a leading hero. Now, his new film, Shambhala, with huge expectations and good buzz released on Christmas Eve. The movie teasers and trailers have created positive buzz prior to the release and the theme interested many. Let's discuss about the film in detail.  Plot:  Scientist Vikram (Aadi Saikumar) is appointed by central government to check the areas and research about the meteorite that fell in the village Shambhala. The locals believe that the celestial object is going to create bad omens in the village and will destroy them. Vikram starts to live alone near the "Banda Bhootham" - as the villagers give it the name - ignoring threats of villagers and Swamiji. He states that it is just a stone and he needs to investigate it. Only a Police Constable (Madhunandan) starts to mingle with him and his child Chitra, who has autism, only befriends Virkam.  On contrary, in the village, a demonic force starts to create hovoc as it enters into Ramulu (Ravi Varma). Villagers do not understand its effects and decides to kill Ramulu's cow as it gives blood instead of milk. Vikram stops it and Devi (Archana Iyer) starts to help him. Ramulu kills six people in a rage of anger and then he too kills himself. Similarly, people who have extreme evil traits are targeted by this demonic force. Can Vikram use sciene to stop it or will he change from an atheist? Will Swamiji allow Vikram to take over? Who is Devi? What is demonic forces connection with Lord Shiva's Devasura Sangrama? Watch the movie to know more.  Analysis:  Aadi Saikumar has decided to give script more priority than showcasing him and his skills. This works like a magic for him as he fits the character perfectly. His performance is measured and he is able to handle varied emotions with ease. His performance is the key to this high-content film and he delivers big time. This is a very good film after a long time, we have to mention that.  Archana Iyer doesn't really have much to do and she is okay. Ravi Varma, young actress, Swasika Vijay, Madhunandan, Laxman Meesala are good in their performances. They handle the portions given to them very aptly. But some portions seem to have been over-dragged at places while they are still engaging, the makers could have trimmed them down for better impact.  Technically, movie is good as the production values shine in this limited budget film. VFX at places seems to have been under done and such things could have been improved. The film core strength lies in maintaining believability of 1980's. Costume, make-up and location recce have helped it to achieve such finesse. Ugandar Muni showcases that he has skill in engaging audiences with his execution.  But writing wise, he depends on the cliches to engage audiences and feels like he followed some of the previous films that came in this genre. Few scenes seem to have been dragged a lot while some seem to have been winded up to cut things short. His victory lies in engaging audiences throughout while there is a too much a wow factor there is no cringe or headache portions that make this film a good watch.  Bottomline:  A Good Film that engages throughout and could've been better with even sharper writing.  Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

ఎవరికీ తలొగ్గని భానుమతి.. ఓ సంగీత దర్శకుడికి పాదాభివందనం చేశారు.. ఎందుకో తెలుసా?

Publish Date:Dec 23, 2025

(డిసెంబర్ 24 భానుమతి వర్థంతి సందర్భంగా..) పాతతరం నటీమణుల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న భానుమతి గురించి అందరికీ తెలిసిందే. వివిధ శాఖల్లో విశేషమైన ఖ్యాతిని సంపాదించుకున్న ఆమె.. చిన్నతనంలో తండ్రి దగ్గర సంగీతాభ్యాసం చేశారు. ఆమె స్వరం చాలా విభిన్నంగా ఉంటుంది. సినిమా రంగంలో స్థిరపడిన తర్వాత ఎన్నో పాటలు పాటలు పాడారు. ఆమె పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. అంతేకాదు, కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.   తిరుగులేని ఆత్మవిశ్వాసం, తనకు నచ్చని ఏ విషయాన్నయినా ఖండించడం అనేది భానుమతికి చిన్నతనం నుంచీ అబ్బిన లక్షణం. అందుకే అనవసర విషయాల గురించి ఆమె దగ్గర ప్రస్తావించేవారు కాదు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి స్టార్‌ హీరోలు కూడా ఆమెతో కలిసి నటించేందుకు భయపడేవారు. సినిమా రంగంలో ఇలాంటి లక్షణాలు ఉన్నవారు రాణించడం చాలా కష్టం. కానీ, భానుమతి మాత్రం దానికి అతీతంగా అద్భుతమైన విజయాలు సాధించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.    ఎన్టీఆర్‌, భానుమతి జంటగా నటించిన మల్లీశ్వరి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు. అప్పటి సంగీత దర్శకుల్లో రాజేశ్వరరావు ఓ విభిన్న వ్యక్తిత్వంతో ఉండేవారు. తను చేసే సంగీతం గురించి ఎవరైనా విమర్శించినా, సలహాలు ఇవ్వాలని చూసినా, తను చెప్పిన విధంగా గాయనీగాయకులు పాడకపోయినా ఆయనకు వెంటనే కోపం వచ్చేది. మారు మాట్లాడకుండా తన హార్మోనియం పెట్టెను తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసేవారు. ఎంత పెద్ద హీరో, దర్శకనిర్మాతలైనా ఆయన ధోరణి అలాగే ఉండేది.    తనకు అసౌకర్యంగా ఉన్న వాతావరణంలో రాజేశ్వరరావు సంగీతం చేసేవారు కాదు. అలా సినిమా మధ్యలోనే వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాయాబజార్‌ వంటి సినిమాలో నాలుగు పాటలు కంపోజ్‌ చేసిన తర్వాత నిర్మాతల ధోరణి నచ్చక ఆ సినిమా నుంచి బయటికి వచ్చేశారు. 'శ్రీకరులు దేవతలు..', 'లాహిరి లాహిరి లాహిరిలో..', 'నీ కోసమే నే జీవించునది..', 'చూపులు కలిసిన శుభవేళ..' పాటలు ఎస్‌.రాజేశ్వరరావు కంపోజ్‌ చేసినవే. మిగతా పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను ఘంటసాలతో చేయించారు. టైటిల్స్‌లో తన పేరు వేయకపోయినా రాజేశ్వరరావు బాధపడలేదు.    ఎన్టీఆర్‌ దర్శత్వంలో వచ్చిన దానవీరశూర కర్ణ చిత్రానికి మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు. అందులో ఒక పాట చేసిన తర్వాత ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు పాటలు ఎలా ఉండాలి అనే విషయంలో రాజేశ్వరరావుకు సలహా ఇవ్వాలని చూశారు. ఆ క్షణమే ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లి 'మీ తమ్ముడికి సంగీత జ్ఞానం బాగా ఉంది. అతనితోనే మ్యూజిక్‌ చేయించుకోండి' అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ సినిమాలో ఎంతో పెద్ద హిట్‌ సాంగ్‌ అయిన 'ఏ తల్లి నిను కన్నదో..' పాట రాజేశ్వరరావు కంపోజ్‌ చేసిందే. ఆ తర్వాత పెండ్యాల నాగేశ్వరరావుతో మిగతా పాటలు చేయించుకున్నారు ఎన్టీఆర్‌.    ఇక 'మల్లీశ్వరి' సినిమాకి సంబంధించి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నప్పుడు 'మనసున మల్లెల మాలలూగెనే..' పాటను ఎలా పాడాలో భానుమతికి చెబుతున్నారు రాజేశ్వరరావు. కానీ, కొన్ని సంగతులు ఆయన చెప్పినట్టు కాకుండా తనదైన ధోరణిలో పాడుతున్నారు భానుమతి. తను చెప్పినట్టుగా పాడితేనే పాట బాగా వస్తుందని, తేకపోతే పాట చెడిపోతుందని ఆయన చెప్పారు. కానీ, భానుమతి మాత్రం తను అనుకున్న విధంగానే పాడారు. పైగా తనకు కూడా సంగీత జ్ఞానం ఉంది అంటూ గుర్తు చేశారు. ఆమె అలా అనడంతో వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని బ్రతిమాలి తీసుకొచ్చారు. చివరికి రాజేశ్వరరావు ఎలా పాడమన్నారో అలాగే పాడారు భానుమతి.    రికార్డింగ్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌ సభ్యులతో కూర్చొని ఆ పాటను విన్నారు భానుమతి. ఆ పాటను రాజేశ్వరరావుగారు అలా ఎందుకు పాడమన్నారో ఆమెకు అప్పుడు అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆయన దగ్గరకు వెళ్లి పాదాభివందనం చెయ్యబోయారు. కానీ, రాజేశ్వరరావు వారించారు. 'మీరు పాటను అలా ఎందుకు పాడమన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి' అని రాజేశ్వరరావుకు నమస్కారం చేశారు భానుమతి.

దృశ్యం3కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది

Publish Date:Dec 22, 2025

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సిరీస్ వ‌చ్చాయి. వాటిలో దృశ్యం సిరీస్‌కి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటూనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు భాగాలు రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రానికి సంబంధించిన రెండు పార్టులు మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన మూడో భాగం మాత్రం మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. ఇటీవ‌లికాలంలో హిందీలో మంచి విజ‌యాన్ని సాధించిన సిరీస్ ఇదే కావ‌డం విశేషం. ప్రస్తుతం మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్ల‌కు సంబంధించిన షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, హిందీ వెర్ష‌న్‌ను అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్నారు.    ఇదిలా ఉంటే.. దృశ్యం3 హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో న‌డిచే ఈ వీడియోలో దృశ్యం 3 ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మూడో భాగంతో దృశ్యం క‌థ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని బాలీవుడ్ ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

Publish Date:Dec 24, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు. ఇందులో దాచడం ఏముంది దాని మామ, అమ్మ కలిసి కావాలనే చెడగొడుతున్నారని నారాయణ అంటాడు. బావ ఇలా ప్రతీది క్యాన్సిల్ అవుతుందంటే మనిద్దరికే రాసి పెట్టి ఉన్నట్టుందని మాధవతో గాయత్రి అనగానే ముందు వెళ్లి మీ వాళ్ళని ఒప్పించమని గాయత్రిని నారాయణ కోప్పడతాడు. మరొకవైపు ప్రతాప్, భూషణ్ ఇంటికి వస్తాడు. మహా ఎలా వుంది అని ఆదిని అడుగుతాడు భూషణ్. మహా పెళ్ళి అంటే ఇష్టం లేదంటుందని అతను చెప్తాడు. ఆ తర్వాత ప్రతాప్ తన కూతురు మహా దగ్గరికి వెళ్తాడు. ఎప్పటిలాగానే నాకు పెళ్లి ఇష్టం లేదు నాన్న అని చెప్తుంది కానీ అతను వినిపించుకోడు. మరుసటి రోజు అంకుల్ పెళ్లి అయ్యాక వీసా అప్లై చేస్తే ఎక్కువ టైమ్ పడుతుంది. ముందే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని వీసా అప్లై చేసుకోవాలనుకుంటున్నా.. పెళ్లి మీరు అన్న టైమ్ కి చేసుకుంటానని భూషణ్ అనగానే ప్రతాప్ మొదట వద్దని అన్నా తర్వాత ఒప్పుకుంటాడు. నేను ప్రిపేర్ గా లేనని మహా అంటుంది. అయిన ఎవరు వినరు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో కావాలని భూషణ్ అడుగుతాడు. షాపింగ్ కీ వచ్చాను అవన్నీ వెంట తీసుకొని వస్తానా అని మహా కోపంగా మాట్లాడుతుంది. కూల్ మహా ఇక్కడ కూడా ఫోటో తీసుకోవచ్చని హారిక అంటుంది. నాకు తెలిసిన ఫోన్ షాప్ ఉందని చక్రి ఎంట్రీ ఇస్తాడు. తనని తీసుకొని వెళ్ళమని హారిక చెప్తుంది. మహాని తీసుకొని చక్రి వెళ్తాడు. దారిలో తన మాటలతో మహాని చక్రి ఇర్రిటేట్ చేస్తాడు. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా మేడమ్ అని అడుగుతాడు. అదంతా నీకు ఎందుకని మహా అంటుంది. వాళ్ళు అయిన అర్థం చేసుకోలేదు వీడు అర్థం చేసుకున్నాడని మహా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Balakrishna: మళ్ళీ సింగర్ గా మారిన బాలయ్య.. ఏ సినిమా కోసమో తెలుసా..?

Publish Date:Dec 23, 2025

  నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అప్పుడప్పుడు సినిమా వేడుకల్లో పాటలు పాడి అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. అలాగే 'పైసా వసూల్' సినిమాలో 'మామ ఏక్ పెగ్ లా' అనే సాంగ్ పాడి మెప్పించారు. ఇక ఇప్పుడు ఆయన మరోసారి ఓ సినిమా కోసం గాయకుడిగా మారుతున్నట్లు తెలుస్తోంది.   అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ-2 .. ఇలా వరుసగా ఐదు 100 కోట్ల గ్రాస్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు బాలకృష్ణ. తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'NBK111' అనేది వర్కింగ్ టైటిల్. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్.   అనౌన్స్ మెంట్ తోనే 'NBK111'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే న్యూస్ వినిపిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం బాలకృష్ణ సింగర్ గా మారుతున్నట్లు సమాచారం. ఈ సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ సాంగ్ కి బాలయ్య వాయిస్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మూవీ టీం అడగగా.. ఆయన ఓకే చెప్పినట్లు వినికిడి.   Also Read: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చిరంజీవి.. నిజమేనా..?   అసలే బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో తెలిసిందే. అలాంటిది స్వయంగా బాలయ్యనే సింగర్ గా మారితే.. ఇక తమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.  

Is Suriya's Karuppu looking to compete with Dhurandhar 2?

Publish Date:Dec 20, 2025

Suriya starrer Karuppu being directed by RJ Balaji has been struggling with financial issues even though movie is 95% complete. A song and few scenes needs to be shot and the makers are planning to complete the shoot in January. Now, the makers are planning to release on 19th March 2026.  Already, the movie has been facing huge troubles with low asking price from OTT platforms which makers are not happy with. Suriya has been facing huge downtime in his career, so he is expecting Karuppu to be his major comeback at the box office. Meanwhile, he moved on to his next Suriya46 with Venky Atluri.  Sithara Entertainments is producing the film and Mamitha Baiju is playing a leading role in it. The makers have wrapped up shoot completely and they have started post-production works locking May date. Hence, Karuppu cannot go for a further date than Atluri's film.  Meanwhile, Jithu Madhavan's cop film with Suriya will complete shoot by May and the actor, who is producing it himself, doesn't want to take it to 2027, unless works are pending or slowed down it seems.   So, Karuppu makers need to lock March date and so, despite competition with Dhurandhar and Yash's Toxic, they might for the date, say sources. With Dhurandhar being such a massive hit, Part-2 will shatter all box office records in opening weekend for sure. Going against it would be a suicide but makers have no choice, it seems. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969