Updated : Jun 11, 2023
'కార్తికేయ 2' వంటి బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన నిఖిల్ సిద్ధార్థ్.. వరుస క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గ్యారీ పిహెచ్ దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా 'స్పై'. ఈడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది.
'జూమ్ జూమ్' అంటూ సాగే ఈ పాట నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్ మధ్య వచ్చే లవ్ రొమాంటిక్ సాంగ్. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా.. 'జూమ్ జూమ్' పాటకు మాత్రం విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచారు. 'సీతారామం'తో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్.. ఈ సాంగ్ తో మరో బ్యూటిఫుల్ మెలోడీని అందించారు. అనురాగ్ కులకర్ణి, రమ్య బేహారా పాడిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. తూటాలే పేలుస్తుంటే నీ చిరు నగవే, అందాల గాయం తగిలే నా ఎదకే వంటి లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. కమ్మని పదాలతో సాగేఈ మెలోడీ సాంగ్ శ్రోతల మనసు దోచేలా ఉంది.
ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ, మళయాళం, కన్నడ భాషల్లో జూన్ 29న విడుదలకు ముస్తాబు అవుతుంది.