English | Telugu

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి 'SSMB28' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈరోజు నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు ఈ మూవీలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుందో తెలిపేలా ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంవత్సరాలు పెరిగేకొద్దీ వయస్సు తగ్గించుకునే హీరోగా మహేష్ కి పేరుంది. 47 ఏళ్ళ వయస్సులోనూ 25 ఏళ్ళ కుర్రాడిలా కనిపించడం ఆయనకే సొంతం. సినిమా సినిమాకి అందాన్ని పెంచుకునే మహేష్ 'SSMB28' కోసం మరింత హ్యాండ్సమ్ గా, మరింత స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన లుక్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కను బొమ్మలను తాకేలా హెయిర్ స్టైల్, లైట్ గా ట్రిమ్ చేసిన మీసాలు, గడ్డంతో చాలా యంగ్ గా, స్టైలిష్ గా మహేష్ కనిపిస్తున్నాడు. ఆ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

 

 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.