English | Telugu


వెబ్ సిరీస్ పేరు: LSD 
తారాగణం: శివ కోన, అభిలాష్ బండారి, కునాల్ కౌశల్, రమ్య దినేష్, నేహా దేశ్ పాండే, ప్రాచీ కెథర్, ప్రభాకర్ తదితరులు
సంగీతం: ప్రవీణ్ మణి
సినిమాటోగ్రాఫర్: పవన్ గుంటుకు
ఎడిటర్: బసవా
రచన, దర్శకత్వం: శివ కోన
నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన
బ్యానర్స్: ఏఎమ్ఎఫ్, కోన సినిమా
ఓటీటీ: ఎమ్ఎక్స్ ప్లేయర్


కొన్ని వెబ్ సిరీస్ లు కొత్త కంటెంట్ తో ముందుకొస్తున్నాయి. మరి కొత్త కంటెంట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులని ఆకట్టుకుందా లేదా ఈ కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ:

ఓ పాప కాస్త వింతగా కన్పిస్తుంది. కాసేపటికి కొంతమంది ఓ కోడిని తీసుకొచ్చి పలావ్ చేసుకొని తింటారు. కాసేపటికి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఓ అడవికి ట్రిప్ కి వెళ్తారు. వీరిలో రెండు జంటలు పెళ్ళి అయినవారు. ఒక జంట మాత్రం  త్వరలో పెళ్ళి చేసుకోబోయేవారు. వీళ్ళంతా ట్రిప్ కి వెళ్ళేముందు ఓ పాపకి కల వస్తుంది. ఇదంతా బాగోదని అక్కడ ప్రాణాపాయం పొంచి ఉందని పదే పదే పాప వాళ్ళకి చెప్పిన పట్టించుకోదు. ఇక అందరు కలిసి ట్రిప్ కి వెళ్తారు. కొంతదూరం వరకు సాఫీగా సాగిన వాళ్ళ ప్రయాణం ఆ తర్వాతే అనుకోని మలుపులు తిరుగుతుంది. ఆ మూడు జంటలలలో ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. చివరగా నలుగురు మిగులుతారు. వారందరిలో ప్రాణభయం మొదలవుతుంది. అసలు ఆ అడవిలో ఏం ఉంది? వరుస హత్యల వెనుక అసలు నిజమేంటి తెలియాలంటే పూర్తి వెబ్ సిరీస్ చూడాల్సిందే. 

విశ్లేషణ:

ఓ అమ్మాయి వింతగా ప్రవర్తించడం,  ఓ కోడిని కోసుకొని పలావ్ చేసుకొని తినడంతో మొదటి ఎపిసోడ్ నుండే ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని పెంచాడు డైరెక్టర్ శివ కోన. ఆ తర్వాత ఫ్రెండ్స్ అంతా ట్రిప్ కి వెళ్తుంటే పాప ఎందుకు అలా అంది అనే ఇంటెన్స్ తో సాగే ఎపిసోడ్ బాగుంది. అయితే ఆరుగురు భిన్న మనస్తత్వం గలవారు. ఒక్కొక్కరిది ఒక్కో పంథా ఉంటుంది‌. అడవిలో ఒక్కొక్కరు చనిపోవడం.. మిగిలిన వారిలో భయం కలుగుతుండటంతో వెబ్ సిరీస్ ఆసక్తిని రేకెత్తించింది.

కొన్ని అడల్డ్ సీన్స్, ద్వందార్థ పదాలు ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీతో కలిసి చూడటానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. 'అరవింద్' సినిమాని చూసి దర్శకుడు శివ కోన కథ రాసుకున్నట్టుగా అక్కడ అక్కడ అనిపిస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో క్యారెక్టర్స్ నటన బాగున్నప్పటికి స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా సాగుతుంది.

మొదటి ఎపిసోడ్ లో పాత్రల పరిచయంతో స్లోగా సాగుతుంది. రెండు, మూడు ఎపిసోడ్ లలో కథనం లో వేగం పెరుగుతుంది. చివరి ఎపిసోడ్ లో కొన్ని ట్విస్ట్ లు కథపై ఆసక్తిని రేకెత్తిస్తాయి. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగే కథనాన్ని రాసుకున్న దర్శకుడు స్లోగా సాగే సీన్స్ తో కాస్త వెనకబడ్డాడు. అయితే ఇందులో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు ఎవరూ ఊహించని విధంగా మలిచారు. అది అందరికి ఇట్టే నచ్చేస్తుంది. ఫ్యామిలీతో కాకుండా ఇండివిడ్యువల్ గా చూస్తే ఈ వీకెండ్ కి ఓ థ్రిల్లర్ ని చూసేయొచ్చు. పవన్ గుంటుకు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ మణి మ్యూజిక్ పర్వాలేదు‌. బసవా ఎడిటింగ్ లో‌ కొన్ని సీన్లకి కత్తెర వాడాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

క్యాండీ పాత్రలో ప్రాచీ థాకెర్ ఆకట్టుకుంది. రాజు గారి పాత్రలో ప్రభాకర్ చక్కగా నటించాడు. దర్శకుడు శివ కోన.. డ్యాని అనే ముఖ్య పాత్ర పోషించారు. నటుడిగా ఆయన మంచి మార్కులే కొట్టేశారు. విభిన్న పాత్రలకు మేకర్స్ ఆయన పేరు పరిశీలించవచ్చు. అభిలాష్ బండారి, కునాల్ కౌశల్, రమ్య దినేష్, నేహా దేశ్ పాండే, ప్రాచీ కెథర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. అయితే పలు సన్నివేశాల్లో కొన్ని పాత్రల డబ్బింగ్ కృత్రిమంగా అనిపించింది. ఆ విషయం మీద శ్రద్ధ పెట్టాల్సింది.

ఫైనల్ గా : 

అక్రమ సంబంధాలు హానికరం అనే మెసెజ్ ని కొన్ని థ్రిల్లింగ్ ట్విస్ట్ లతో తీసిన ఈ 'LSD' ఓ సారి చూడొచ్చు. కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్.

రేటింగ్ : 2.75 / 5

✍️. దాసరి  మల్లేశ్