
తెలుగునాట చాన్నాళ్ళ తరువాత ఓ సిసలైన మల్టిస్టారర్ వస్తోంది. ఆ చిత్రమే.. `ఆర్ ఆర్ ఆర్`. పాన్ - ఇండియా మూవీగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ పిరియడ్ డ్రామాలో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. చరిత్ర పురుషులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల్లో చరణ్, తారక్ దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం పది రోజుల ప్యాచ్ వర్క్, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉందని బజ్. వాటిలో ఓ పాటని తారక్ - చరణ్ పై, మరో గీతాన్ని చరణ్ - ఆలియా భట్ పై షూట్ చేయనున్నారట. కాగా, ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చే పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని.. నెల రోజుల పాటు ఈ గీతాన్ని చిత్రీకరించేందుకు జక్కన్న అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందని వినికిడి. అంతేకాదు.. సిల్వర్ స్క్రీన్ పై ఈ సాంగ్ విజువల్ ట్రీట్ లా ఉంటుందని అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గాక.. బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ ని శరవేగంగా పూర్తిచేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందట.
`ఆర్ ఆర్ ఆర్`కి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తుండగా.. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.






