English | Telugu

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రామ్, బోయపాటి మొదటిసారి చేతులు కలిపిన ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు టీజర్ కి ముహూర్తం ఖరారైంది.

శ్రీనివాస చిట్టూరి నిర్మించిన 'కస్టడీ' చిత్రం ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన రామ్-బోయపాటి సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చారు. రామ్ పుట్టినరోజు కానుకగా మే 15న టీజర్ విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ టీజర్ మాస్ ట్రీట్ లా ఉండబోతుందని ఇన్ సైడ్ టాక్. బోయపాటి అంటే మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఇక రామ్ కూడా 'ఇస్మార్ట్ శంకర్' నుంచి మాస్ జపం చేస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి అందించనున్న మాస్ ట్రీట్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20 న ఈ సినిమా విడుదల కానుంది.