Home

»

Latest News

BB3 వ‌ర్సెస్ ఖిలాడి:  డ్యూయెల్ క్లాష్

Feb 03, 2021


మే 28న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ - మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో రూపొందుతున్న BB3 (వ‌ర్కింగ్ టైటిల్),  మాస్ మ‌హారాజా రవితేజ ఖిలాడి.. బాక్సాఫీస్ వ‌ద్ద బ‌రిలోకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ రెండు సినిమాల‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఉంది. అదేమిటంటే.. రెండు చిత్రాల్లోనూ ఆయా క‌థానాయ‌కులు డ్యూయెల్ రోల్స్ లో సంద‌డి చేయ‌డం.

BB3 విష‌యానికి వ‌స్తే.. ఇందులో అఘోరాగా, ఐఏఎస్ ఆఫీస‌ర్ గా బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఇక ఖిలాడి సంగ‌తే తీసుకుంటే ఇందులో ర‌వితేజ కూడా రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అందులో ఒక‌టి సాఫ్ట్ రోల్ కాగా, మ‌రొక‌టి ర‌ఫ్ అండ్ ట‌ఫ్ క్యారెక్ట‌ర్.

మొత్త‌మ్మీద‌.. మే 28న అటు బాల‌య్య‌, ఇటు ర‌వితేజ ఇద్ద‌రు కూడా డ్యూయెల్ రోల్స్ స్పెష‌ల్ గానే బాక్సాఫీస్ వ‌ద్ద క్లాష్ కి దిగుతున్నార‌న్న‌మాట‌. మ‌రి.. వీరిలో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com