Updated : Jan 19, 2016
హాట్ హాట్ యాంకరమ్మగా అనసూయకు దక్కాల్సిన పేరు కంటే కాస్త ఎక్కువే దక్కింది. చిట్టి పొట్టి డ్రస్సులతో టీవీ షో కాస్త... మిడ్ నైట్ మసాలా పోగ్రాంగా మార్చేసింది అనసూయ. దాంతో.. సినిమావాళ్ల చూపు ఈ హాట్ భామపై పడింది. ఆఫర్లంటూ వెంటపడ్డారు. అయితే.. 'ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తా..' అంటూ బెట్టు చేసింది అనసూయ. దాంతో.. ఆఫర్లతో వచ్చిన వాళ్లు.. వెనక్కివెళ్లిపోయారు. చూసీ చూసీ, వెదికీ వెదికీ... సోగ్గాడే చిన్నినాయన సినిమా ఒప్పుకొంది. ఈ సినిమాతో అనసూయ మరింత పాపులర్ అయిపోతుందనుకొన్నారంతా. అనసూయ కూడా 'నేను కూడా ఈ సినిమాలో హీరోయిన్నే' అన్నంత బిల్డప్ ఇచ్చింది. తీరా చూస్తే.. ఓ పాటలో చిన్న బిట్‌లో కనిపించి మాయమైంది.
అసలు అనసూయ ఈ సినిమాలో ఉందన్న విషయమే ఆడియన్స్ లో రిజిస్టర్ కాలేదు. జూనియర్ ఆర్టిస్టుకు ఎక్కువా.. క్యారెక్టర్ ఆర్టిస్టుకు తక్కువా.. అన్నట్టు కనిపించింది. ఆ కాసేపూ.. అనసూయలో గ్లామర్ ఏమాత్రం కనిపించలేదు. మొహం ముడతలు పడిపోయి.. వయసు బయటపడిపోయింది. అసూయకు అంత సీన్ లేదనే.. నాగ్.. అనసూయ పాత్రని కట్ చేశాడన్న ఊహాగానాలూ వ్యక్తం అవుతున్నాయి. సో... ఈ సోగ్గాడు వల్ల అనసూయ వెంట 'అవకాశం ఇస్తాం..' అంటూ తిప్పే శ్రమ నిర్మాతలకు బాగా తగ్గిపోయిందన్నమాట.
