Home

»

Latest News

`మెకానిక్ అల్లుడు`గా చిరు మెస్మ‌రైజ్ చేసి నేటికి 29 ఏళ్ళు!

May 27, 2022

తెలుగు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించిన జంట‌ల్లో మెగాస్టార్ చిరంజీవి - లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి జోడీ ఒక‌టి. అలాంటి ఈ హిట్ పెయిర్ జ‌ట్టుక‌ట్టిన‌ చివ‌రి చిత్రంగా `మెకానిక్ అల్లుడు` ప్ర‌త్యేక గుర్తింపు పొందింది. అంతేకాదు.. న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో క‌లిసి చిరు న‌టించిన మొద‌టి సినిమా కూడా ఇదే కావ‌డం విశేషం. టైటిల్ రోల్ లో చిరు మెస్మ‌రైజ్ చేసిన ఈ చిత్రంలో శార‌ద‌, శుభ‌, స‌త్య‌నారాయ‌ణ‌, బ్ర‌హ్మానందం, కోట శ్రీ‌నివాస‌రావు, సుధాక‌ర్, అలీ, మోహ‌న్ రాజ్, పొన్నాంబ‌ళం, ప్ర‌సాద్ బాబు, జ‌య‌ల‌లిత‌, హేమ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు. డిస్కో శాంతి ఓ ప్ర‌త్యేక‌గీతంలో త‌న చిందుల‌తో క‌నువిందు చేశారు. సత్యానంద్ క‌థ‌, సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చిన ఈ చిత్రాన్ని అగ్ర ద‌ర్శ‌కుడు బి. గోపాల్ తీర్చిదిద్దారు.

రాజ్ - కోటి బాణీల‌కు అనుగుణంగా వేటూరి సుంద‌రామ్మూర్తి, భువ‌న చంద్ర సాహిత్య‌మందించిన ఈ చిత్రంలో.. ``ప్రేమిస్తే ప్రాణ‌మిస్తా``, ``ఝుమ్మ‌నే తుమ్మెద వేట‌``,  ``చెక్కా చెక్కా చెమ్మ చెక్కా``, ``గురువా గురువా``, ``గుంత‌ల‌కిడి గుండ‌మ్మ‌``, ``అంబ ప‌లికింది`` అంటూ మొద‌ల‌య్యే పాట‌ల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మించిన `మెకానిక్ అల్లుడు`.. 1993 మే 27న విడుద‌లైంది. నేటితో ఈ మ్యూజిక‌ల్ హిట్ 29 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com