Updated : Jan 31, 2022
'పుష్ప' మూవీలో సమంత చేసిన ఐటమ్ నంబర్ "ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా.." ఎంతటి హిట్టయిందో, గ్లోబల్‌గా ఎంత పాపులర్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు. ఆ పాటను ఇప్పటికే పలువురు టీవీ సెలబ్రిటీలు రీల్స్‌గా ప్రెజెంట్ చేసి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు సెలబ్రిటీలే కాదు, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా "ఊ అంటావా" పాటలో సమంత ఎక్స్‌ప్రెషన్స్, డాన్స్‌కు ఫిదా అయిపోయి, వారు కూడా ఆ పాటకు తమ వెర్షన్‌తో రిక్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే బీచ్‌లో నేహా కక్కర్ ఆ పాటకు చేసిన డాన్సులు అందరినీ అలరించాయి. ఇప్పుడు 'దంగల్' తార సాన్యా మల్హోత్రా వంతు.
Also read: సహనటిపై అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన నటుడు-నిర్మాత
సాన్యా టెర్రిఫిక్ డాన్సర్. "ఊ అంటావా" పాటకు ఆమె చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. సమంత సైతం ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్‌కు మెస్మరైజ్ అయిపోయి, ఆ రీల్‌పై తన ప్రేమను కురిపించేసింది. "ఊ అంటావా" సాంగ్‌కు కాంటెంపరరీ ట్విస్ట్ జోడించి రిక్రియేట్ చేసింది సాన్యా. ఆమె తన వీడియోను షేర్ చేయడం ఆలస్యం.. పలువురు సెలబ్స్, ఫ్యాన్స్ దానిపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. వారిలో సమంత కూడా ఉంది. ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో సాన్యా రీల్‌ను షేర్‌చేసి, "ఉఫ్‌ఫ్‌ఫ్.. సో హాట్" అనే కామెంట్ పెట్టింది.
Also read: బర్త్ డే స్పెషల్ః ఐదేళ్ళు `హిట్స్`తో హవా చాటిన శ్రుతి!
సమంత పర్ఫామ్ చేసిన "ఊ అంటావా మావా" పాట వేరే లెవల్లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ పాటకు తెర వెనుక తను పడిన కష్టం ఎలాంటిదో చూపిస్తూ జనవరి 6న సమంత ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. అది ఆమె ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.
