English | Telugu

సంక్రాంతికి `పొన్నియ‌న్ సెల్వ‌న్`

లెజండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. `పొన్నియ‌న్ సెల్వ‌న్`. విక్రమ్, కార్తి, ఐశ్వ‌ర్య రాయ్, త్రిష‌.. ఇలా భారీ తారాగ‌ణ‌మే న‌టిస్తున్న ఈ చారిత్ర‌క చిత్రానికి సంబంధించి.. ఇప్ప‌టివ‌ర‌కు 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మధ్య‌ప్ర‌దేశ్ లో జ‌ర‌గాల్సిన షూటింగ్ కి క‌రోనా కార‌ణంగా అనుమ‌తులు రాక‌పోవ‌డంతో.. చెన్నై, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మిగిలిన భాగాన్ని పూర్తిచేయ‌నున్నారు. కాగా, అన్నీ కుదిరితే 2022 సంక్రాంతికి `పొన్నియ‌న్ సెల్వ‌న్`ని థియేట‌ర్స్ లోకి తీసుకురావ‌డానికి మ‌ణిర‌త్నం అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

క‌ల్కి కృష్ణ‌మూర్తి ర‌చించిన చారిత్రాత్మ‌క త‌మిళ న‌వ‌ల `పొన్నియ‌న్ సెల్వ‌న్` ఆధారంగా అదే పేరుతో మ‌ణిర‌త్నం `పొన్నియ‌న్ సెల్వ‌న్`ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ఐశ్వ‌ర్యారాయ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. అందులో ఒక‌టి నెగ‌టివ్ రోల్ అని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. స్వ‌ర‌మాంత్రికుడు ఎ.ఆర్. రెహ‌మాన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందిస్తున్నారు. మ‌రి.. ఈ హిస్టారిక‌ల్ డ్రామాతో మ‌ణిర‌త్నం ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.