English | Telugu

‘ఆస్కార్‌ 2026’ నామినేషన్‌ పొందిన జాన్వీ కపూర్‌ సినిమా!

భారత్‌ తరఫున ఆస్కార్‌ 2026 నామినేషన్‌ పొందింది జాన్వీ కపూర్‌ నటించిన ‘హోమ్‌ బౌండ్‌’ చిత్రం. నీరజ్‌ ఘేవాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఇషాన్‌ ఖట్టర్‌, విశాల్‌ జెత్వా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఏడాది మే 21న కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రం విడుదలైంది. ఇండియాలో సెప్టెంబర్‌ 26న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా అనేక ప్రశంసలు అందుకుంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు 98వ అకాడమీ అవార్డ్స్‌ 2026 కోసం ఇండియా తరఫున అఫీషియల్‌గా ‘హోమ్‌ బౌండ్‌’ చిత్రాన్ని పంపించనున్నారు. ది బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ విభాగంలో ఈ సినిమా పోటీ పడనుంది.

‘హోమ్‌ బౌండ్‌’ చిత్రం ఆస్కార్‌ ఎంట్రీ సాధించిన విషయాన్ని సెలక్షన్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎన్‌.చంద్ర తెలియజేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఈ సంవత్సరం 24 సినిమాలు ఆస్కార్‌ ఎంట్రీకి పోటీ పడ్డాయని, అన్నీ మంచి సినిమాలేనని, మనసు హత్తుకునే సినిమాలేనని ఆయన తెలిపారు. వాటిలో ‘హోమ్‌ బౌండ్‌’ చిత్రాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌, అదార్‌ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్‌ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఎంట్రీ విషయాన్ని ప్రకటించిన అనంతరం ఈ చిత్ర నిర్మాతలు తమ సంతోషాన్ని వ్యక్తవం చేస్తూ తమ సినిమా భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ పొందడం తమకెంతో గర్వకారణమని అన్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.