Home » Articles » హీరోయిన్ల ప్రేమ కబుర్లు

ప్రేమంటే అదొక అనుభూతి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనకు మనం తెలుసుకుంటే మరింత కొత్త ప్రపంచం కనిపిస్తుంది. అలాంటి గొప్ప ప్రేమ మనుషుల మధ్య దూరాలను తగ్గించి ఒక్కటిని చేస్తుంది. రెండు హృదయాలను కలుపుతుంది. ప్రేమ ఎంత గొప్పదో చాలా సినిమాలు, పాటలు వచ్చాయి. ఎందరో తారలు సినిమాల్లో ప్రేమ గురించి చెప్పారు. మరి ఈతరం హీరోయిన్లు వారి నిజ జీవితంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో. వారికి కాబోయే వరుడు ఎలాంటివాడై ఉండాలో వారి మాటల్లో తెలుసుకుందాం.



అనుష్క : లవ్ అనేది ఇద్దరు మనసులు కలిపేది. పెళ్లి అనేది రెండు కుటుంబాలను కలిపేది. నేను కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. కానీ మంచి వ్యక్తిత్వం, నన్ను బాగా అర్థం చేసుకొని, సంతోషంగా ఉంచే మిస్టర్ పర్ ఫెక్ట్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. ఇప్పటివరకు అలాంటివారు నాకు కనిపించలేదు. అలా ఎవరైనా కనిపిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ అది ఎప్పుడో అనేది నేను ఇపుడే చెప్పలేను.



సమంత :
ఇంకా ఎవరితో ప్రేమలో పడలేదు కానీ.. స్కూల్ డేస్ లో ఒకబ్బాయి నా వెంటపడేవాడు. కానీ అతను చెప్పడానికి ధైర్యం చేయలేదు. చివరికి నా సైడ్ నుంచి పాసిటివ్ సిగ్నల్స్ ఇచ్చిన కూడా లాభం లేకుండా పోయింది. అక్కడితో ఆ కథ ఆగిపోయింది. ప్రస్తుతమైతే అలాంటిది ఏం లేదు కానీ.. నన్ను మంచిగా చూసుకునేవాడు, కొంచెం ధైర్యం ఉన్నవాడు, ముఖ్యంగా సేవాభావం ఉన్నవాడైతే ఆలోచిస్తాను.


 



శృతిహాసన్ :
ప్రేమ, పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతం నా కెరీర్ పైనే దృష్టి పెట్టాను. ఎఫైర్లకు దూరంగా ఉండటమే మంచిది. ముందు నటిగా నేను నిరూపించుకోవాలి. అదే నా తొలి ప్రాధాన్యం. ఆ తరువాతే ఇతర విషయాల గురించి ఆలోచించాలి.

 




తాప్సీ :
నేను కనిపించేంత రొమాంటిక్ కాదు. క్యాండిల్ లైట్ డిన్నర్స్, ఆరుబయట కబుర్లు...ఇలాంటివి నాకు నచ్చవు. ప్రియుడితో కలిసి విహారాలు లాంటివి నచ్చదు. జీవితమంటే సహజంగా, సామాన్యంగా అందరిలా ఉండాలి. కానీ కాబోయే మిస్టర్ పర్ ఫెక్ట్ ఎలా ఉండాలో మాత్రం ఇప్పుడే చెప్పలేను. అతడు ఎదురైనపుడే ఇతడే నాకు రైట్ అనిపించాలి.


కాజల్ అగర్వాల్ :
నిషా పెళ్లి అయ్యిన క్షణం నుండి "నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్" అంటూ అందరూ అడుగుతున్నారు. కానీ నేను ఇప్పటివరకు ప్రేమలో పడలేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. సరైన వ్యక్తి దొరికితే తప్పకుండ పెళ్లి చేసుకుంటాను.



త్రిష : నేను ఎవరిని లవ్ చేయలేదు.అలాగే నేను ఎవరికీ ప్రపోస్ చేయను. ఎవరైనా ప్రపోస్ చేస్తే ఎదురుచూస్తాను. కానీ నాకు నేనుగా ఎవరికీ ప్రపోస్ చేయను. కానీ కాబోయేవాడి గురించి ఇపుడే నేనేం చెప్పలేను.