Home » Articles » నరకచతుర్దశి - భామావిజయం

 

 

శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చి హిరణ్యాక్షుని సంహరించి భూదేవికి ఆనందం కలిగించాడు. వరాహమూర్తి వీర, విక్రమాలకు మురిసి భూదేవి శ్రీహరిని మోహించి తన కోర్కెను తీర్చమని అర్థించింది. శ్రీహరి భూదేవి కోర్కెను తీర్చాడు. అప్పుడు వారికి కలిగిన వాడే ‘నరకాసురుడు’. ‘నేను హిరణ్యాక్ష సంహార సమయంలో తామసగుణంతో ఉన్న సమయంలో నీవు నన్ను కలిసిన కారణంగా.. నీకు రాక్షస ప్రవృత్తి గల కుమారుడు జన్మిస్తాడు’ అన్నాడు శ్రీహరి. భూదేవి తన కుమారుడైన నరకాసురుని సదా రక్షించమని శ్రీహరిని కోరింది. ‘ధర్మం’ తప్పనంతవరకూ నావల్ల నీ కుమారుకు ఎటువంటి హానీ జరుగదు. ‘ధర్మం తప్పి చరిస్తే మాత్రం నీ కుమారుడు నా చేతిలోనే మరణిస్తాడు’ అన్నాడు శ్రీహరి. ఆ తర్వాత భూదేవి కోరిక మేరకు నరకాసురునకు వైష్ణవాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ అస్త్రగర్వంతో నరకుడు దేవలోకాలన్నీ ఆక్రమించాడు. దేవమాత అదితి కర్ణకుండలాలు, వరుణఛత్రాన్ని అపహరించాడు. తర్వాత ప్రాగ్జ్యోతిషనగరాన్ని రాజధానిగా.....

More...