Home » Articles » దీప ప్రజ్వలనం - విశేషాలు

 

 

అంధకారం..... అఙ్ఙానానికి.,నిరాశకు గుర్తు.
కాంతి.....ఙ్ఞానానికి.,ఆనందానికి గుర్తు.
అఙ్ఞానమనే చీకటి నుంచి...ఙ్ఞానమనే వెలుగులోకి ప్రయాణించడమే ‘దీపావళి’ పండుగలోని అంతరార్ధం.

‘దీప’ అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. దీప + ఆవళి అంటే..దీపాల వరుస అని అర్ధం. దీపం ఐశ్వర్యం అయితే.., అంధకారం దారిద్ర్యం. దరిద్రాన్ని పారద్రోలి,ఐశ్వర్య మార్గంలోకి ప్రయాణిచడమే ‘దీపావళి’ పండుగ ముఖ్యోద్దేశ్యం.

‘దీపం’ త్రిమూర్తిస్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. దీపంలోని ‘ఎర్రని’ కాంతి బ్రహ్మదేవునికి.., ‘నీలి’ కాంతి శ్రీమహావిష్ణువుకి.., ‘తెల్లని’ కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు.

                 సాజ్యం త్రివర్తి సంయుక్తం - వహ్నినా యోజితం ప్రియం
                  గృహాణ మంగళం దీపం - త్రైలోక్య తిమిరాపహం
                  భక్త్యా దీపం ప్రయచ్ఛామి - దేవాయ పరమాత్మనే
                  త్రాహిమాన్నరకాద్ఘోరాత్ - దివ్య జ్యోతిర్నమోస్తుతే

 ఏ దీపమైనా మూడువత్తులు వేసి వెలిగించాలిగానీ.. ఒంటి దీపం.,రెండు వత్తుల దీపాలు
వెలిగించరాదు. ‘మూడు వత్తుల దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది. ముల్లోకాలలోని అంథకారాన్ని పారద్రోలి లక్ష్మీనిలయంలా చేస్తుంది. నరకం నుంచి రక్షిస్తుంది. దీపం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. అటువంటి దీపాన్ని భక్తిగా వెలిగించాలి. మరెంతో భక్తిగా నమస్కరించాలి’ అని పై శ్లోకం అర్థం.

More...