Home » Articles » దీపం ఉన్న ఇంట లక్ష్మీ ప్రవేశిస్తుంది....

 


అన్ని పండుగలకి, మనం తలంట్లు పోసుకోటం, కొత్త బట్టలు కట్టుకోవటం, పిండివంటలు చేసుకోవటం, బంధు మిత్రులతో సరదాగా సమయాన్ని గడపటం ఉంటుంది కాని, ఈ పండుగకి వీటన్నిటితో పాటు ఇంకో ప్రత్యేకత ఉంది. అది `దీపాలు వెలిగించటం, టపాకాయలు కాల్చటం దీనికి సంబంధించి విష్ణుపురాణంలో ఒక కథ కనపడుతుంది` దీపావళి నాడు మహాలక్ష్మి విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయటానికి బయలుదేరిన లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట మరి, ఇంకెం? మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు అప్పటి నుంచి దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించటం ప్రారంభించారు. లక్ష్మీదేవి తనవాహనమైన గుడ్ల గూబనెక్కి సూర్యా స్తమయసమయం, అనగా  సాయం సంధ్య లేక ప్రదోషళ వేళ నుండి అర్థ రాత్రి వరకు సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణుపురాణంలో ఉంది.

'దీపం పరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు అట్టి సంధ్యా దీపమా నీకు నమస్కారము''

''సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళిరాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు అజ్ఞానము, పాపము, శోకము, మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే, ప్రగతి నిరోధకమైన అంశాలు.


వాటినన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్జ్వలనంతో. మామూలు చీకట్లనే కాదు, అజ్ఞానం, దు:ఖం, శోకం, అలసత, రోగము, మాంద్యము, మృత్యువు మొదలైన వానినన్నింటిని పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది  సంధ్యాదీపం. పగలు భగవంతుడిచ్చిన 'వెలుగు' (సూర్యుడు) తన సహస్ర కరాలతో అందరికీ వెలుగును పంచుతాడు...

More...