నైవేద్యం ... దద్ద్యోదనం

 

Details of Naivedyam to The Second day of the Dasara festival dedicated to Sri MahaLakshmi Devi

 

కావాల్సినవి:

ఒక గ్లాస్ బియ్యం (nearly 150gms)
రెండు గ్లాసుల కమ్మటి పెరుగు
(పెరుగు పాలు కాచి తోడుపెట్టినదైనా నీళ్ళు కలపకుండా ఉంటే బాగుంటుంది.)
ఒక చెంచా నెయ్యి లేదా నూనె
తురిమిన లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న అంగుళం అల్లం
తగినంత ఉప్పు
గుప్పెడు దానిమ్మ గింజలు
పోపుకి: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కర్వేపాకు, చిటికెడు పసుపు, రెండు పచ్చి మిరపకాయలు, ఒక ఎండు మిర్చి,

చేసే విధానం:

గ్లాసు బియ్యానికి రెండున్నర లేదా మూడు గ్లాసుల నీళ్ళు పోసి కాస్త మెత్తని అన్నం వండాలి. పెరుగన్నం కదా అన్నం గట్టిగా ఉంటే బావుండదు. చెంచా నెయ్యి/నూనెలో పైన చెప్పిన పోపు పదార్ధాలతో పోపు వేయించాలి. చివరన అల్లం ముక్కలు వేసి స్టౌ ఆపేయాలి. అల్లం ముక్కలకి ఆ వేడి చాలు. పెరుగు నీళ్లు పొయ్యకుండా చిలికి తగినంత ఉప్పు కలపాలి. అన్నం చల్లారాక అందులో  వేయించిన పోపు కలపాలి. తరువాత చిలికిన పెరుగు కలపాలి. కొత్తిమీర ఇష్టం ఉంటే సర్వ్ చేసే ముందర కాసిని ఆకులు దద్ద్యోదనంపైన  చల్లచ్చు. అన్నం, పెరుగు, ఉప్పు బాగా కలిసాకా సర్వ్ చేసే ముందు గుప్పెడు దానిమ్మకాయ గింజలు పైన చల్లితే రుచి బాగుంటుంది, దానిమ్మకాయ అరుగుదలకి చాలా మంచిది కూడా.