మా తెలుగుతల్లికి మల్లెపూదండ అన్న చరనంతో సుప్ర్రసిద్ధకవి శంకరంబాడి సుందరాచారి తెలుగుదేశ ప్రశస్తిని కొనియాడుతూ రచన చేసిన విజయగీతికకు సుప్రసిద్ధ
రూపశిల్పి గణపతి స్థపతి 'తెలుగుతల్లి'ని 1986లో ఒక స్త్రీ మూర్తిగా సాధికారిక రూపకల్పన చేశారు. ఆ గిఇతికలోని భావాలు స్ఫురించేలాగున తెలుగుతల్లి మూర్తికి
రూపురేఖలు దిద్దేరు . పెన్నిధులు, జివనదులూ అయిన కృష్ణా , గోదావరి, పెన్నా నదుల జలాలకు ప్రతీకగా నిండుకుండ పూర్ణకుంభం ఆంధ్రప్రదేశ్ లాంఛన
చిహ్నం ఆ స్త్రీ మూర్తి కుడిచేతిలో ధరింపచేశారు స్థపతి . పూర్ణకుంభం మీది మామిడి ఆకులు, టెంకాయ శుభాన్ని పలుకుతూ అందరాప్రదేశ్ 'అన్నపూర్ణ' అని
స్పురింపచేస్తున్నాయి.వామహస్తమున వరికంకి తెలుగు నేల నాలుగు చెరుగులా పండుతున్న బంగారు పంటలను స్పురింపచేస్తున్నాయి. మల్లెపూదండ
కంఠాభరణము ముఖమున మందహాసం చిరునవ్వులు తొణికిసలాడుతున్నాయి. ఈ తెలుగుతల్లి శిల్ప విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బుద్ధపూర్ణిమ
ప్రాంగణానికి సమీపంలో ప్రతిష్టించారు. |