ఆంధ్రరాష్ట్రం ఆగమనం
అతనిదీ ఈ రాష్ట్రం
అసత్యం కాజాలని ఛారిత్రిక వాగ్థానం
అతనికోసం ఈ రాష్ట్రం
మన చరిత్రాత్మక నిరంతరాందోళన
పెత్తనం చెయ్యాలని ముందుకొచ్చే
చరితార్థ మయిం దీనాడు
పెద్దలిది గ్రహించాలని హెచ్చరిక.
ఈ రాష్ట్రం ఇదిగో ఇప్పుడే చెబుతున్నా
శుభంగా శోభావహంగా
ఏదో కొందరి సదుపాయానికేర్పడలేదు.
ఆకారం తాల్చుతున్న ఆంధ్రరాష్ట్రం
ఎవరో కొందరుద్యోగులకని వేర్పడలేదు
ఆంధ్రజాతి కంతటికీ విజయం
ఆంధ్ర సంస్కృతిక అఖండ విజయం
ముక్కోటి ఆంధ్రుల అకుంటిత దీక్ష
ముఖ్యంగా అతి ముఖ్యంగా
అజేయ సంకల్పం
ఆంధ్రభాషకిది అపూర్వ విజయం
ఆంధ్రావతరణకి కారణంఇది
వినండి మరి
ఈరోజు ఊరేగింపులు జరుగుతాయ్ నిజమే
విప్లవం మున్ముందు మనుష్యుని మనస్సులో ప్రారంభమవుతుంది
|
ఉత్సవాలు జరుగుతాయ్ నిజమే
మనఃప్రపంచానికి బాహ్య విప్లవం
ఉత్సాహం ఉప్పొంగుతుంది నిజమే
అందుకే ఈ ఆనంద సమయంలో
యథావిథిగా అన్ని లాంఛనాలు సాగుతాయ్ నిజమే
భాషలోనూ భావంలోనూ విప్లవం తెచ్చిన
మహామానవులైన
కాని ఆ లాంఛనాలన్నింటి తర్వాత
మన గిడుగు గురజాడ వీరేశలింగం
వచ్చిన అతిథులు వెళ్ళిపోయిన తర్వాత
మహానీయులను
పాటలూ ప్రసంగాలూ జయ జయధ్వానాలు చల్లబడ్డ తర్వాత
నా మనఃఫలకంముందు సాక్షాత్కరింపజేసుకొని
నమస్కరిస్తున్నాను
సంబరాల తర్వాత
వారిచ్చిన ఆశీర్వాదాలు
సంపాదకీయాల తర్వాత
తీర్చిదిద్దిన ఒరవడులు
సామాన్య మానవుడి భుజస్కంధాల మీద
చిరకాలం మన ఆంధ్రావనికి
సమస్తభారం పడుతుందిశ్రీరామరక్ష
|