|
Andhra pradesh, AP formation day, November 1, andhra pradesh formation day, celebrations, political, minister, congress, potti sri ramulu, burugula ramakrishna, neelam sanjeeva reddy, nehru, gandhiji, mahatma gandhi, india, british
| ఆంధ్ర రాష్ట్రానికి మూల పురుషులు |
| |
| రాష్ట్రావతరణ దినోత్సవం అంటే వెంటే గుర్తువచ్చేది పొట్టి శ్రీరాములు. ప్రత్యేక రాష్ట్రం కోసం పాటుపడిన నాయకుఅలలో ముఖ్యులు మరికొందరున్నారు. వారి గురించి తెలుసుకుందాం. |
 |
నీలం సంజీవ రెడ్డి:1953 అక్టోబరులో ఆంధ్ర రాష్ట్ర అవతరించింది. ముఖ్యమంత్రి పదవికోసం నాయకంటి శంకరరెడ్డి, నీలం సంజీవ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. "పోటీ ఉంటే మరొకర్ని నిలబెడదాం. ఏకగ్రీవం అయితేనే అధిష్టానం అంగీకరిస్తుంది" అని ఓ స్నేహితుడు సంజీవరెడ్డికి తెలిపారు. దీనికి సమాధానంగా సంజీవరెడ్డి నెహ్రూ బొమ్మను చూపారు. "ధైర్యసాహసాలతో కర్యోస్ముఖులైన వారికే వ్యాజ్యం లభిస్తుంది. పిరికివారికి లభించదు అని ఆ ఫోటో కింద వాక్యాలను చదివారు. భయంలేదని స్నేహితుడికి దయర్యం చెపారు చివరికి.... పోతీలేకుండానే ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యారు. ఇది నీలం సంజీవరెడ్డి ధైర్యాన్ని సూచించే సంఘటన. |
| 1951 లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నీలం సంజీవరెడ్డి. రంగాతో పోటీపడ్డారు. ప్రకాశం, కాళేశ్వరరావు వంటి అతిరథ మహారథులు రంగా పక్కన నిఅలబడ్డారు. అయ్యానా... సంజీవరెడ్డి వెనక్కు తగ్గలేదు. చివరికి ఆయనే నెగ్గారు. సంజీవరీడిది మొండి ధైర్యం... బండ సాహసం కాదు ఎప్పుడూ ముందుకు దూసుకుపోవాలో. ఎప్పుడూ పక్కకు తప్పుకోవాల్లో ఆయనకు తెలుసు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నెగ్గినా ... ఆ పదవిని మాత్రం టంగుటూరి ప్రకాశం పంతులుకు వదిలిపెట్టారు. తానూ ఉఅప ముఖ్యమంత్రిగానే ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి రాష్ట్ర రాజకీయాలకు మించి ఆయనకు వేరే వ్యాపకాలేమీ లేవు. లేని పాండిత్యం ఉన్న్దనీ, లేని పాండిత్యం ఉంనదనీ, రానీ కవిత్వం రాయగాలనేనీ అనేరు. ఉపన్యాసాలు సూటిగా, గట్టిగా, కుండబద్దలు కొట్టినట్లుగా ఉంటాయి. "పడికట్టు రాళ్ళు" ఉండవు. దానికి తోడూ శంఖధ్వని లాంటి కంఠ౦. అడ్డు సవాళ్లకు ఆయన జవాబులు బాంబులా ఉంటాయి. చిరాకుగా లేనప్పుడు కలుసుకుంటే ఆయనలోని ఆర్థ్రత, ఆప్యాయత కనిపిస్తాయి. ఆయన గురించి ఆయనకు అనవసర భ్రమలు లేవు. ఇతరుఅలకూ ఉందనక్కర్లేదంటారు. అసాధారణ కార్యసాధన శక్తి, నిజాయితీ ఉన్న వ్యక్తి... నీలం సంజీవ రెడ్డి. |
మాడపాటి హనుమంతరావు:
అంటు వేసినవాడు పండు తినేవరకూ ఉండడం అరుదు. పండు తినేవాడు అంటు వేసయానవాదిఅని గుర్తుకు తెచ్చుకుని కృతజ్ఞత తెలపడం కూడా అరుదే. ఆంద్ర పితామహుఅదు మాడపాటి హనుమంతరావును ఇప్పుడు మొదటిసారిగా చూసినవారు. 1948 సెప్టెంబరు ముందు ఆయన వహించిన పాత్రను ఊహించుకోలేరు.
"నాయకత్వం నాకు రావడానికి తగిన పని నేనేమీ చేయలేదు. నేనేమీ త్యాగాలు చేయలేదు. నేను దీనికి అనర్హుడిని" అంటారు మాడపాటి. సమావిష్ణులైన వారికి తెలంగాణలో ఆంధ్రోద్యమ జ్యోతిని తొలుత వెలిగించింది ఆయనే అణి తెలుసు. ఆ దీపమే నానాటికీ పెరిగి పెద్దది నేడు ఎంతో వెలుగును ప్రసరింపచేస్తోంది.
పోలీసు చర్య అనంతరం హైదరాబాద్ నగర పాలక సంఘానికి మేయరుగా ఎన్నికైన మాడపాటి హనుమంతరావు కొండా వెంకట రంగారెడ్డి ఒక విందు చేశారు. అప్పుడు మేయర్ పదవి వారికి మొదటి గురుకట్నం అన్నారు రంగారెడ్డి ఎందరో తెలుగువారిని రాజకీయాల్లో ఆనాడు ప్రవేశపెట్టింది మాడపాటి అందులో ప్రధానులు రంగారెడ్డి.
మూడు నాలుగు దశాబ్దాల క్రితం వివేకవర్ధని సంస్థ యాజమాన్యంలో ఉన్న నిషాత్ టాకీసులో ఒక బహిరంగ సభ జరిగింది. వామన్ నాయక్ ప్రభ్రుతులు ప్రసంగించారు. ఉర్దూలో, ఇంగ్లీషులో ఒకరిద్దరు మాట్లాడారు. మాడపాటి లేచి తెలుగులో ప్రారంభించారు. ఉర్దూ ఆయనకు రాక కాదు. తెలుగులో మాట్లాడటం ఆంధ్రుల భావి రాజధానిలో ఆ విధంగా ఆనాడు ఆయన ప్రాంభించాగానే... ప్రేక్షకులు అల్లరి ప్రారంభించారు. తెలుగులో మాట్లాడటం భారింపరానిడైంది ఆనాటి ప్రేక్షకులకి.
తెలంగాణలో ఆంధ్రోద్యమ ప్రారంభానికి అంకురార్పణ ఆ క్షణంలోనే జరిగింది. ఆనతి కాలంలో ఆంధ్ర మహాసభ్ వెలిసింది.
సంస్థానాధీశుల కింద బాధ్యతాయుత పరిపాలన - ఇది ఆనాటి దేశంలో సంస్థాన ప్రజలందరి ధ్యేయం. ఇదే ధ్యేయంగా ప్రకటించాలని ఒక వర్గం ఆంధ్ర మహాసభలో మొదటి వేదన ప్రారంభించింది. మిత వాడుఅల వర్గం దీనికి అంగీకరించలేదు. ఏది దారి? దానినే "ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధి" అనే పేరుతొ లక్ష్యంగా ప్రకటించామన్నారు. మాడపాటి.
అప్పటి పరిస్థితులు దృష్ట్యా ఇది చాలా విజ్ఞత తో కూడిన సలహా. ఆ విధంగా గ్రంథాలయోధ్యమంగా ప్రారంభమై, రాజకీయోద్యమంగా విలసిల్లింది తెలంగాణలో ఆంధ్రోద్యమం.
మొదటి కట్నంగా మేయరు పదవిని సూచించిన రంగారెడ్డి... తర్వాటిది ఏదో సూచించలేదు. కానీ... రెండో కట్నం ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా 1958లో మాదపాటికి అందింది. నారాయణ గూడ బాలికల పాఠశాల, వెంకత్రామిరీది మహిఅలా కళాశాల, ఆంధ్ర విద్యాలయం, శ్రీకృష్ణవేదరాయాంధ్ర భాషా నిలయం... ఇవి మాడపాటి వారి కృషికి, దీక్షకు చిహ్నాలు. అక్కడ ఏ రాయిని తట్టినా, మాడపాటివారి ప్రతిభాపాటను వినిపిస్తుంది. |
 |
టంగుటూరి ప్రకాశం:
టంగుటూరి ప్రకాశం పంతులు "ఆంద్ర కేసరి"గా తెల్లవాడికి "రారా దమ్ముంటే కాల్చు" అంటూ గుండెలు చూపిన ధైర్యశాలి. స్వరాజ్యం కోసం పరితపించిన మహా మనీషి. భారతావనిలో స్వేచ్చా స్వాతంత్ర్యం పవనాలు వీయాలని తపించిన వ్యక్తి. అది సిద్ధిన్చాదాన్ని కనులారా తిఅలకించడమే కాక... అనంతరం స్వరాష్ట్రం కోసం కూడా కలలు కన్నారు. ఈ కలకుడా నిజమవడంతో ... మొదటి ముఖ్యమంత్రిగా కొంతకాలం పాటు బాధ్యతలు నిర్వర్తించి ఆ ఆనందాన్ని రెట్టింపు చేసుకునారు. ప్రకాశం ఒక విభిన్నమైన వ్యక్తిత్వం గల మనిషియా ఇఅప్పతియా నాయకుఅలవలె ఆయనెప్పుడూ తన బలహీనతల్ని కప్పిపుచ్చుకోలేదు. కుర్రతనంలో తాను చేసిన పోకిరీ చేష్టల్ని కూడా దాచుకోకుండా, నిర్భయంగా తన ఆత్మకథలో రాసుకునారు. ఎవరినైనా "అరె", "ఒరే" అనడం ఆయనకే చెల్లింది . |
కోపం వస్తే... నోటికి వచ్చినట్లు తిట్టేవారు. అదే విచారం కలిగితే... చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టేవారు. అవసరమనుకుంటే... బెదిరించేవారు. ఇవాళ తిట్టిన వ్యక్తినే... రేపు మనసారా కౌగిలించుకోవడం కూడా ఆయనకు తప్ప మరోకరికి చేతకాదు. రేపటి గురించి ఆలోచించకుండా ఎవరు సహాయం అడిగినా "తీసుకుపో" అంటూ ఇవ్వగలిగిన గొప్ప మనిషి. అలాగే చేతిలో చిల్లిగవ్వ లేకపోతే... తనకు ఇంతకావాలని ఎవరికైనా కబురుచేయడం ఆయనకే చెల్లు. తీర్చలేనని తెలిసి కూడా
చేబడుల్లు చేసేవారు. చేతిలో కాసు లేకపోయినా. కాశీకి ప్రయాణం కట్టేవారు. ఇలా ఎలా చూసినా... ఆయనో విలక్షణ వ్యక్తీ. అప్పట్లో ఆయన బలాబలాలే కాక, ఆయనకున్న దౌర్బల్యాలు కూడా ప్రజలందరికీ తెలుసు. కానీ వేరెవరికీ ప్రజాభిఅమానం ఆయనకు ఉండేది. |
ప్రకాశం గురించి నార్ల వెంకటేశ్వర రావు ఇలా అంటారు.
"సమస్థా౦ధల దోష గుణాల్ని తనలో మూర్తిభావింప జేసుకున్న ఆంధ్రుడు ప్రకాశం పంతులు. ఆంధ్రుడికి మేధాసంపత్తి తక్కువేం కాదు. అయితే వారిపై ఆ మేధ కన్నా, హృదయమే ఎక్కువగా అజమాయిషీ చేస్తుంది. అందుకే ఆలోచన చేయగలిగిన అతడే.. వెంటనే ఆవేశానికీ లోనవుతాడు. ఒక్కసారి ఆవేశమొచ్సిందంటే... ఇఅక ముండువేనకలు చూసుకోడు. అసాధ్యమియన్ విషయాలకైనా... నేనున్నానంటూ ఉద్యుక్తుడౌతాడు. అగ్నిగుండంలోనైనా దూకుతాడు. ఆహుతికీ వేనుదీయడు. అయితే "ఆరంభశూరత్వం" అనే నిడ కష్టనష్టాల వల్లగాని, లేక వెరపువల్ల గానీ వచ్చింది కాదు. పాలవలె ఎంత త్వరగా పొంగుతుందో అంటే త్వరగా చల్లారిపోవడం అతడి ఆవేశాలక్షణం. ఆంధ్రజాతిలోని ఈ గునదోశాలన్నీ ప్రకశంగారిలో తొణికిసలాడుతుండేవి . అందుకే ఆంధ్రులు ఆయన్ను ప్రేమించినంతగా మరెవ్వరినీ ప్రేమించారు అనడం అతిశాయోఅక్తి కాదు. గాంధీ పట్ల ఆంధ్రులకు ఉంనది భక్తీ. అదే నెహ్రూ పట్ల గౌరవం. కానీ ప్రేమ మాత్రం ప్రకాశం పంతులుకే' నిజమే... ప్రకాశం పంతులు పట్ల ఆంధ్రుఅలకుంనది స్వచ్చమైన ప్రేమే కాబట్టీ... అయన ఎన్ని పొరపాట్లు చేసినా... ఆయన్ను ఆంధ్రులు అంటే ప్రేమగా చూశారు. "ప్రకాశం చేసిఅన తప్ప్పుల్లో నూరోవంతు తప్ప్పులు మా రాష్ట్రంలో ఎవరన్నా చేసి ఉంటే... ఈ పాటికి వారికి మా రాష్ట్రంలో పుట్టగతులు ఉండకపోయేవి. కానీ ఇన్ని తప్పులు చేస్తున్నా... ప్రకాశం మీ రాష్ట్రంలో ఎలా అగ్రనేతగా చెలామణి కాగాలుగుతున్నారో అర్థం కావడం లేదు". అని అప్పట్లో ఇతర రాష్ట్రాల వారు వ్యాఖ్యానిస్తుండేవారుట.
అది వేరొకరి విషయంలో అయితే అనుకోవచ్చు. కానీ వారికి మన ఆంధ్రులకు ప్రకాశం పట్ల ఉన్న స్వచ్చమైన ప్రేమ సంగతి తెలీదు. " ప్రకాశం గురించి రాయాలంటే... గడిచిన అర్థ శతాబ్దపు ఆంధ్రజాతి చరిత్రను గురించే రాయాల్సి ఉంటుంది" ఇది... ప్రకాశం గురించి ఆయన మరణించినప్పుడు నార్లగారు రాసిన సంపాదకీయంలో చిరస్మరణీయమైన వాక్యం. సమస్థ ఆంధ్ర జాతికీ ప్రతీకగా నిలిచిన ఆయన ఆంధ్రకేసరిగా చిరస్థాయిగా మన మనస్సులో ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచే ఉంటారు. |
పుచ్చలపల్లి సుందరయ్య:
సాటి పార్లమెంటు సభ్యులు కొందరు కొత్తరకం కార్లు ఎక్కి రాయంచ నడకతో, మాట్టేభాయానంతో, ఠీవిగా ఒలుకుతూ, నాయకత్వపు నయగారం తొణికిసలాడుతూ పార్లమెంటు భవనానికి వెళ్తుండగా... సైకిలెక్కి పార్లమెంటు భవనం ముందు డిగి, స్టాండులో సైకిలు పెట్టి, బీగం బిగిసిందో లేదో లాగి చూసుకుని, క్యారియర్ కూ కట్టిన కాగితాల ఫైలు పుచ్చుకుని, లోపల ప్రవేశించి, తన స్థానంలో
కూర్చుని, నిష్ఠతో తన పనులలో లీనమయ్యే వ్యక్తి... పుచ్చలపల్లి సుందరయ్య.
ఒకసారి ఆయనకోక సన్మానం ఏర్పాటు చేశారట. ఆయన ఏ ఫస్ట్ క్లాస్ పెట్టేనుంచో అత్తహాసంతో దిగుతారని పూలదండలతో ప్లాట్ ఫాం పై వేచి ఉన్న జనం... నిక్కరు, పొట్టి చేతుల చొక్కా ధరించి, మరొక జత అవే ఉడుపులు, ఒక సబ్బు ,ముక్క, ఉన్న జంబుఖానా చుట్ట చంకలో పెట్టుకుని దిగి, తన దారిన పోతున్న ఆయనను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఆయన నిరాడంబరత్వాన్ని తెలిసినవారు కొంతసేపటికి తెప్పరిల్లి... ఆయనను గుర్తుపట్టి మర్యాదలతో పిలుచుకుని వెళ్లారట. సుందరయ్య బాగా కలవారింట పుట్టినా, ఈ నిరాడంబరత్వం, తానూ నమ్మిన విషయాలను నిష్ఠగా, భల్లూకప్పట్టుతో అనుసరించడం చిన్ననాడే అలవడ్డాయి. ఈ రెండింటిలో పై చేయి నిష్ఠదే, తపస్తీవ్రతగా చేయడం ఆయనకు అలవాటైపోయింది. ఈ గుణం పద్నాలుగవ ఏట రాజకీయాలలో ప్రవేశించి "సోదర సమితి" స్థాపించినప్పుడు పాతమరించి, అన్నవరం ఆశ్రమలో చిగురించి, సైమన్ కమిషన్ వ్యతిరేక
ప్రదర్శనలో విరసి, బోర్ స్టల్ స్కూలు శిక్షానుభావంతో మరింత విస్తరించి, ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభునిగాను, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగాను, రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ కార్యదర్శిగాను తీర్చిదిద్దింది.
అయితే నిష్టలోను, కఠోర నియమపాలనలోను ఒక ప్రమాదం ఉంది. కొచ్న్హెం గాడి తప్పితే తేవ్రమార్గాని౮కి పడదోస్తుంది. అలాంటిదే ఆయన విషయంలోనూ సంభవించింది. ఆయన అతివాదులవైపు, వామపక్షంవైపు మొగ్గి, కమ్యూనిస్టుగా మారి 1934లో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు అయ్యాడు. ఈ నిష్ఠ వల్ల కఠోరత వాళ్ళ ఆయన స్వభావం కొంత కతినంగాను, స్వరూపం కరకుగాను కావడం వింతేమీ కాదు. ఇతీవాల్ కొద్దిగా నాజూకుతనం నేర్చుకున్నాడు.
ఆయనలోని వేరొక విశేషం పరిశ్రమశీలత- దీనిని నిష్ఠలో ఒక కళగాను చెప్పవచ్చు. ఈ విషయమైనా వివిద్ దృక్పథాలతో క్షుణ్ణంగా చదివి, ఆకళించుకుని ప్రతివాడులతో పోరుకు తలపడతాడు. ఒకమారెవరో నీకు ఆంధ్ర సాహిత్యం సంగతి ఏమి తెలుసోయ్?" అని అధిక్షేపించారట. ఆనాటి నుంచే ఆయన రాత్రిన్దినన్ నన్నయ మొదలు సిన్నయదకా ఉన్న ప్రధాన గ్రంథాలను పుక్కితపత్తి, అర్థంకాని వాటిని పండితుల వద్ద ఆరసి "ఇక భయం లేదు" అని గుండె మీద చేయి వేసుకున్నాదట.
తన పార్టీలో తనపైనే పితూరీ చెలరేగినా ఆయన జంకలేదు. గాంధీజీకి తన పార్టీ చిఠా అవర్ణ ఉన్నదున్నట్లుగా చూపడానికి వేనుదీయలేదు. ఎవరో ఆయనను హతి చేసినట్లు వదంతులు వ్యాపించాయి. ఇది సుందోపసుందుల సమరంలే, ముసలం పుట్టిన్దిలే అనీ జనం అనుకుంది. కొందరు అవకాశవాదులు అభిప్రాయభేదాల్ సాకుతో సరిహద్దు దాటి, "నోమ్యాన్స్ ల్యాండ్" లో తిరుగాడి, కొంతకాలానికి దక్షిణ పక్షాలలో చేరారు. కానీ, ఆయన నాటినుంచి వామపక్ష ప్రతీకగా, ఆశయానిఅకీ ఆచరణకూ తెదాలేని అతివాదపక్ష ప్రతినిదిఅగా ఉన్నాడు. ఆయన పెక్కు పుస్తకాలు రచించినా- అవనీ ప్రచార ధోరణివే కనుక- గొప్ప రచయితగా పేరు పొందలేదు కానీ , "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" మాత్రం నేటి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మూలబంధం వేసిందనే అనాలి. |
 |
బూర్గుల రామకృష్ణారావు:
హైదరాబాద్ రాష్ట్రంలో ఖద్దరంటేనే అధికారులకు నిద్దురపట్టని కాలమది. ఆయన పాతికేళ్ళ ప్రాయంలోనే బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయవాది పట్టా(ఎల్.ఎల్. బి)పుచ్చుకుని, హైదరాబాద్ నగరంలో వకాలత్ ప్రారంభించాబోయారు. రెసిడెన్సీ కోర్టు వారికి ఆయన ఖద్దరు దుస్తులు బద్ధశాత్రువులయ్యారు. "నీకు కోర్టులో అడుగుపెట్టడానికి అనుమతి లేదు". |
| అన్నారు. ఏడాదిన్నర తర్వాత గాని ఆ ఆంక్ష తొలగలేదు.
పది సంవత్సరాలు గడిచాయి. మహా మేధావిగా, న్యాయశాస్త్ర నిష్ణాతుడుగా, ప్రతివాది భయంకరుడుగా, ప్రజాహితంకరుడుగా, జాతీయవాదిగా, బహుభాషావేదిగా రాష్ట్రమంతటా ఆయన కీర్తి చంద్రికలు విస్తరించాయి. ఇఅలాంటి వాడిని ఉపెక్షిన్చారాడు. ఆపేక్ష చూపించి లొంగదీసుకోవడం అవసరం అని నిజం ప్రభుత్వం పాచిక వేసింది- కార్యనిర్వాహక సభ్యత్వం (మత్రిత్వము) ఎర చూపింది. కానీ పాచిక పారలేదు. " నాకెందుకు మీ కొలువు? ప్రజలను మరింత నిలువు దోపిడీ చేయడానికా?" అన్నారు ఆయన. ప్రభుత్వం విస్తుపోయింది. దగాపద్దానని నిఘావేసి పగబట్టింది.
పది సంవత్సరాలు గడిచాయి. రాష్ట్రంలో రాజకీయోధ్యమం పరోక్షంగా వేయి రూపాలలో వ్యాపించింది. ఆయన పెక్కు సార్లు అరెస్టయ్యారు. శంకర్ రావ్ దేవ్ అధ్యక్షతన రాజకీయ మహాసభ నడిపించారు. దానితో ఆయన గుండెలు తీసిఅన బంతని స్థిరమయినది. ప్రజల హృదయాలు ఉప్పొంగాయి.
సర్ మీర్జా ఇస్మాయిల్ ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన ప్రతిభను వెంటనే పసిగట్టారు. న్యాయమూర్తి పదవినో, న్యాయశాఖామాత్యత్వాన్నో స్వీకరించమని అభ్యర్థించారు. "నేను కాంగ్రెస్ వాణ్ని. కాంగ్రెసు పెద్దల హుకుమయితే, అన్నిటికీ తయ్యార్!" అని సమాధానమిచ్చారు ఆయన. మనస్వి అయిన మీర్జా మనసులోనే మెచ్చుకున్నారు.
భారతదేశం స్వతంత్రమైంది. దేశం నాలుగంచులా విజయఘోశాలు వినిపిస్తుండగా, హైదరాబాద్ రాష్ట్రంలో "ఆజాద్ హైదరాబాద్" అపశ్రుతితో కొందరు దేశద్రోహులు దురంతాలు ప్రారంభించారు. మహా మహా నాయకమ్మన్యులే, పరిసర ర ాష్ట్రాలకు పదివేల సాకుఅలతో పరారీ చిత్తగించారు. ఆయన మాత్రం చెక్కు చెదరని మొక్కవోని తనంతో ప్రజలకు పెట్టని కోటలా అయి, గుండెదిటవు కల్పించారు. "పొట్టివాడు గట్టివాడు" అని కొట్లనోళ్ళ కోనియాదబదిఅనారు. కనుఅకనే, ఆయన స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్ర తీర్థతో భేదించి పోటీ కాంగ్రెస్ పెట్టించి నడిపినా, ప్రజలు ఆయనను ఈసడించుకోలేదు. సరికదా, తమ ప్రథమ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
ఆయనే బూర్గుల రామకృష్ణారావు. ఆయన ఆంద్ర రాజకీయ కురువ్రుద్ధులలో ఒకరు. ధౌరంధర్యంలో యుగంధరుని, వ్రాతలలో అన్నయ మంత్రిని, చతురతలో తిమ్మరుసును తలపిస్తారు. పరిపాలన్ దక్షతలో రాయల వంటి వారికి దీతవుతారు.
ఆయన భాషా పాండిత్యం మనదేశ రాజనీతిజ్ఞులలో అరుదంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో ఎవరు ఏ భాషలో ప్రశ్నిస్తే, ఆ భాషలో సమాధానం చెబుతూ "ఇంతింతై వటుడింతయై" లాగ చూస్తూ, చూస్తూ ఉండగానే, త్రివిక్రము లయేవారు. ఆయనది కీచుగొంతుకయినా వాగ్ధాటి, అంత ఆకర్షణీయం కాకపోయినా తొణకని, బెనకని గాంభీర్యం, హేతుబద్ధమైన విషయోపన్యాసం ప్రత్యర్థులను పరాస్తం చేసేవి.
ప్రజలతో, ప్రజల పోరాటాలతో ఇంత సన్నిహితత్వం ఉన్నా, ఆయన ఎప్పుడూ అతివాది కాదు, మితవాడే. ఈ మితవాదిత్వమే ఆయనకు సహ్రుదయస్తుత్యమైన సరసతను సంతరించింది. ఆ సరసత నిర్మల దృష్టిని కలిగించింది. ఏ రంగానికి ఆ రంగన వింగడించుకుని రాజకీయ రంగంలో ప్రత్యర్థులైన సాహితి రంగంలో చేసిన కృషిని నిష్పక్షపాతతతో తూచి చెప్పే ఔదార్యం అలవడింది.
ఆయన "దున్నరా మాయన్న దున్నారా బాబు! దున్నపోతులు గట్టి దున్నారా బాబూ!" అని కర్షకకోటి ప్రబోద్ గేయాలు పాడి, ఆంధ్ర సరస్వతికి "సారస్వత ముక్తావళి" సమర్పించి, "పంచామృతం" నివేదించారు. పెక్కేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవమూ ఆయనకే దక్కింది. "కథాకళీ కవి మరాళ, కమ్యూనిస్టు ప్రభు కేరళు"లయి, ఉత్తర ప్రదేశ్ కూ పెత్తందారయ్యారు.
కానీ, పెక్కు భాషల పుక్కిట బట్టిన బూర్గుల వారు, తామోకప్పుడు ఉద్యమించిన ఉర్దూ, పారసీ, అరబ్బీ సారస్వత చరిత్రలను పూర్తి చేసి, ఆంధ్రావళికి అర్పించావలసి ఉంది. షష్ట్యబ్దాల అనుభవం పండి, వివేకం నిన్దారిన తమ జీవితంలో ముందు తరాల వారికి పాలు రంగాలలో వేలుగుబాతలు తీర్చవలసి ఉంది. |
|
|
|
|
| |
|
|
|