User Login |  Sign Up  | Feedback |  Contact 
 
  Home   ::   Special Events-2010   ::   AP Formation
 
Andhra pradesh, AP formation day, November 1, andhra pradesh formation day, celebrations, political, minister, congress, potti sri ramulu, burugula ramakrishna, neelam sanjeeva reddy, nehru, gandhiji, mahatma gandhi, india, british
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన క్రమం....
 
ఈస్టిండియా కంపెనీ మద్రాసు, బొంబాయి, కలకత్తా వంటి ప్రధాన నగరాలను ఆక్రమించుకుని... వాటి పేరిటే రాష్ట్రాలను ఏర్పరిచింది. మద్రాసు రాష్ట్ర పరిధిలో మలయాళీలు, తమిళులు, ఆంధ్రులు, కన్నడిగులు ఇఅలా అనేక భాషలు మాట్లాడేవారుండేవారు. మద్రాసు రాష్ట్రంలోని తెలుగుమాట్లాడే ప్రాంతాలు వెనుకబడి ఉండేవి. సంయుక్తరాష్ట్రంలో ఇమదలేక్ ఆంధ్రులు ప్రత్య్కే రాష్ట్రాన్ని కోరారు. ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం గుంటూరు, కృష్ణ జిల్లాల్లో మొదలైంది.
  • 1903లో గుంటూరులో ఏర్పాటైన యువజన సాహితీ సమితి ఆంధ్రజాతి పురోగతికి అవలంభించాల్సిన సూత్రాలను రూపొందించింది. ప్రత్యేకాంధ్ర ఆవిర్భావంతోనే ఆంధ్రులకు న్యాయం జరుగుతుందనేదే వీటి సారాంశం.1903లో గుంటూరులో ఏర్పాటైన యువజన సాహితీ సమితి ఆంధ్రజాతి పురోగతికి అవలంభించాల్సిన సూత్రాలను రూపొందించింది. ప్రత్యేకాంధ్ర ఆవిర్భావంతోనే ఆంధ్రులకు న్యాయం జరుగుతుందనేదే వీటి సారాంశం.
  • 1907లో మచిలీపట్నంలో ఆంధ్ర మహాసభ జరిగింది. అందులో నిజం రాష్ట్రంలోని తెలంగాణా నేతలు కూడా పాల్గొనారు. ఆంధ్ర మహాసభ్ ఆశయాలను తెలుసుకున్నారు. తర్వాత తెలంగాణలో నిజం రాష్ట్ర ఆంద్ర మహాసభలను నిర్వహించారు.
  • 1911లో ఆంధ్ర రాష్ట్ర స్వరూప స్వభావాలను తెలియ చేసే పటం సిద్ధమైంది. ఇందులో ఉమ్మడి మద్రాసు, మైసూరు, ఒరిస్సా నిజం రాష్ట్రం, మహారాష్ట్రల్లో తెలుగు ప్రాంతాన్నింటినీ మ్యాప్ లో పొందుపరిచారు. ఇది "విశాలాంధ్ర" స్వరూపాన్ని సూచిస్తుంది.
  • 1911 లో భారత గవర్నర్ జనరల హార్డింగ్స్ బెంగాల్ రాష్ట్రంలో హిందీ మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలను విడదీశారు. బీహార్ గా ఏర్పాటు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి ఇది నాంది పలికింది. ఇది ఆంద్ర ఉఅద్యమానికి ఊతమిచ్చింది.
  • 1911లో న్యాయపతి నారాయణరావు మద్రాసు నుంచి ఆంద్ర భూభాగాలను విదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని వ్యాసం రాశారు.
  • 1912లో బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ్ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు పై వేమవరపు రామదాసు తీర్మానం పెట్టారు. భిన్నాభిప్రాయాలు రావడంతో... తర్వాతి సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. కొండ వెంకటప్పయ్య భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరు కృష్ణారావు తదితరులు ప్రత్యేక రాష్ట్రంపై విస్తృతంగా ప్రచారం చేశారు.
  • 1914లో విజయవాడలో ఆంధ్ర మహాసభ్ జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానం చేశారు. ఇదే సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన గ్రంథాలు అనేకం వచ్చాయి.
  • 1915 నుంచి ప్రతి ఆంధ్ర మహాసభ్ సమావేశంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంపై చర్చ జరిగింది.
  • 1917లో మాంటేగ్ చెమ్స్ ఫర్డ్ కు ఆంధ్ర నాయకులకు ఒక వినతి పత్రం సమర్పించారు. ప్రజాభిప్రాయం ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పడవచ్చని మాంటేగ్ చెమ్స్ ఫర్డ్ లు, అభిప్రాయ పడ్డారు.
  • 1917లో కలకటా కాంగ్రెస్ మహాసభలలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ తీర్నానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో మదరాసీలుగా పులుస్తున్న ఆంధ్రులకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. శాసనసభలు ఆమోదిస్తే కేంద్ర కార్యదర్శే ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కల్పిస్తూ 1919లో రాజ్యాంగాన్ని సవరించారు.
  • 1926 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఏర్పాటుకు అమోదం లభించింది. దీనిని వాల్తేరులో ఏర్పాటు చేశారు.
  • 1931 తర్వాత మద్రాసు శాసనసభలో ప్రత్యేకాంధ్రకు అనుకూలంగా రెండు తీర్నానాలు చేశారు.
  • 1938 లో కొండా వెంకటప్పయ్య ప్రతిపాదించిన ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ తీర్మానాన్ని శాసనసభ్ ఆమోదించింది.
  • 1938లో మద్రాసులో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. బ్రిటిష్ ప్రభుత్వ కార్యదర్శితో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చర్చించారు. మరుసటి ఏడాదే రెండో ప్రపంచ యుద్ధం మొదలుకావడంతో ఈ అంశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పక్కన పెట్టింది.
  • 1947 ఆగష్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల్ ఏర్పాటు ఆవశ్యకతపై థార్ కమిషన్ ఏర్పడింది. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ... భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయడం మంచిదని కమిషన్ సూచించింది. థార్ కమిషన్ సూచనతో ఆంద్ర నాయకులు నిరుత్సాహ పడ్డారు. పదే పదే విన్నవించిన తర్వాత... సర్దాల్ పటేల్ , నెహ్రూ, భోగరాజు పట్టాభి సీతారామయ్యలతో ఓ త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది.
  • 1949లో త్రిసభ్య కమిటీ తన నివేదిక సమర్పించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల్ ఏర్పాటుకు సమయం ఆసన్నం కాలేదని తెలిసింది. ఒక వేళ ఆంధ్రులు...మద్రాసు నగరంలోని వివాదాస్పద ప్రాంతాలను వదిలివేస్తే వివాదరహిత ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచవచ్చని పేర్కొంది. కొంత తర్జనభార్జనల్ తర్వాత ఆంధ్ర నాయకులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారు.
  • 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు వీలుగా... మద్రాసు విభజన్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ సంఘం సభ్యుల్లోనే అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ప్రత్యేక రాష్ట్రానికి పరిస్థితులు అనుఅకూలంగా లేకపోవడంతో... 1951లో గొల్లపూడి సీతారామశాస్త్రి (స్వామి సీతారాం) నిరాహారదీక్ష కు కూర్చున్నారు. వినోభాజీ సలహాతో 38 రోజుల తర్వాత విరమించారు. 1952 స్వతంత్ర భారతంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్ హామీల్లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1952 అక్టోబరు 10న పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షకు దిగారు. 58 రోజుల నిరాసన్ తర్వాత... ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మరణించారు.
    పొట్టి శ్రీ రాములు మరణంతో ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. క్విట్ ఇండియా ఉద్యమంకంటే ఉధృతంగా సాగింది. ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. అనేక మంది నాయకులు జైలుపాలయారు. లాఠీ చార్జీలు, కాల్పుల్లో ఎందరో మరణించారు. మరెందరో గాయపడ్డారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భారత ప్రభుత్వం. నిర్వివాద ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక ఆంధ్ర ఆవిర్భావం దిశగా... సూచనలు ఇచ్చేందుకు నిర్ణయించుకునే అధికారాన్ని ఆంధ్ర నాయకులకే వదిలేశారు.
  • 1953 సెప్టెంబరులో ప్రత్యేకాంధ్ర ఏర్పాటుకు పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం లభించిద్న్. 1952 అక్టోబరు 1న కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.
    విశాలాంధ్ర... ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో ఆంధ్రాల చిరకాలవాంఛ నెరవేరింది. ఇక సమగ్రాంధ నిర్మాణమే తదుపరి ఆశయంగా మారింది. నిజం రాష్ట్రంలోని తెలంగాణా, మైసూర్ రాష్ట్రంలోని ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాలలో తెలుగు వారు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాలన్నీ కలిపి సమగ్రాన్దను నిర్మించాలని ఉద్యమం మొదలైంది. తాము మాట్లాడే భాషల ప్రకారం ఆయా భాషా రాష్ట్రాలలో కలిపి వేయాలని హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు భారత ప్రభుత్వాన్ని కోరారు. అయితే... హైదరాబాద్ ప్రత్యేక సంస్కృతి గల రాష్ట్రమని, దీనిని విభజించడం తగదని కొందరు భావించారు.
  • 1953 డిసెంబరు 22న ఫజులాలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘాన్ని ఏర్పాటైంది. ఫజులాలీ కమీషన్ తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించింది. 1955 అక్టోబర్10న సమగ్ర నివేదికను సమర్పించింది. కమిషన్ సిఫారసు ప్రకారం... హైదరాబాద్ స్టేట్ లోని బీదర్, గుల్బర్గా, రాయచూరు జిల్లాలను మైసూర్ రాష్ట్రంలో... ఉస్మానాబాద్, భీడ్, ఫర్భిణి, నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాలను మహారాష్ట్రలో చేర్చాలి. తెలంగాణలోని 8 జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పక్షంలో... ఆ రాష్ట్ర అసెంబ్లీలో మూడింట రెండొంతుల మది తీర్మానిస్తే విశాలాంధ్రను ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొంసాగానివ్వాలి. ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఏడాదిపాటు బలంగా జరిగింది. అటు విశాలాంధ్ర, ఇటు ప్రత్యేక తెలంగానల్కు అనుఅకూలంగా పలువురు ప్రముఅఖుఅలు ప్రచారం చేశారు. ఆందోళనలు, లాఠీచార్జీలు, కాల్పులు జరిగాయి. అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, వల్లూరి బసవరాజు, సురవరం ప్రతాపరెడ్డి, ఇతర కమ్యూనిస్టు పార్టీ నేతలు సమగ్రాంధ్ర వాదనను బలపరిచారు.
 
 
 
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity       SocialTwist Tell-a-Friend  
Share |
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne