INTERVIEWS
Jimmy Fund Walk 2011- (TAGB)

సెప్టెంబర్ 18 న జరిగిన బోస్టన్ మారథన్ జిమ్మి ఫండ్ వాక్ లో తమ బంధువుల కోసం, మిత్రుల కోసం ఎంతో మంది సహృదయులు పాల్గొని 26.2 మైళ్ళ దూరాని ఆనందంగా నడిచి తమ ప్రేమని, కాన్సర్ బారిన పడిన వారందరికి మేమున్నము అనే స్థైర్యాన్ని, మనోబలాన్ని అందించారు.

 

ఏటేటా ఈ కార్యక్రమం జరుగుతున్న ఈసారి ప్రత్యేకత మన బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం తీసుకున్న క్రియాశీల పాత్ర, అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కందుకూరి కోటేశ్వరరావు మరియు ప్రధాన కార్యవర్గం తో పాటు ఎంతో మంది కార్యకర్తలు తమ వంతు పాత్రని ఒక సామాజిక కార్యక్రమం కోసం ఉన్నతమైన ఆశయంతో నిర్వహించారు.

 

ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన మన బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం కేవలం కొన్ని వర్గాలకి కుటుంబాలకి సంబంధించిన సంస్థ మాత్రమే కాదు. విశ్వమానవ శాంతికి, ఆరోగ్యానికి మరియు సౌభ్రాత్వత్వానికి మద్దతు పలికే సంఘం అని నిరూపించుకుంది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం త్రికరణశుద్ధిగాకాన్సర్ బాధితుల సహాయార్థం జరుగుతున్నా పరిశోధనలకు నిధులు చేకూర్చడానికి కృషిచేస్తుంది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం సభ్యులందరికి ఈమెయిల్స్, వార్తా సంకలనాల, ఈ పత్రిక మరియు వ్యక్తిగత ప్రచారం ద్వారా సమాచారాన్ని తెలియజేసింది. డెనా ఫార్బెరా కాన్సర్ రీసర్చ్ ఇన్సిట్యూట్ కోసం 15000 డాలర్లు సేకరించే లక్ష్యంతో దిగింది.

 

ఆదివారం సెప్టెంబర్ 18 ఉదయం ఆరు గంటలకు బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం టీం 42 మంది సభ్యులతో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కందుకూరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అనేక వేల మంది పాదాచారులతో కలిసి 66.2 మైళ్ళ నడకని హొప్కింటన్ అనే పట్టణంలో ప్రారంభించారు. ఆరోజు వాతావరణం ఎంతో ఆహ్లోదకరంగా ఉండడం ప్రకృతి కూడా సభ్యులను ఉత్తేజపరచినట్లైంది. వయోబేధం లేకుండా ఎంతో మంది భారతీయులు ముఖ్యంగా బ్లాక్ స్టోన్ వాల్లి ఆఫ్ ఇండియన్ సొసైటి వారు పాదాచారులను దారంతా ఉత్సాహపరిచారు. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం టీంలో చాలామందికి ఇది మొట్టమొదటి మారథాన్ వారందరి కార్యదీక్ష అంకితభావం అందరికి ముగ్దుల్ని చేసింది.

 

మారథాన్ గమ్యమైన బోస్టన్ నగరంలోని కాప్లి స్క్వేర్ కి (సుమారు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో) చేరడం ఒఅ అద్భుతమైన అనుభూతిని పాల్గొన్నవారికి, మద్దతుదారులకు, ప్రసంశకులకు మిగిలించింది ఆనడం అతిశయోక్తి కాదేమో. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం టీం మాత్రమే కాకుండా మరెంతో మందికి స్పూర్తిగా నిలిచింది మన తెలుగు సంఘం యూత్ విభాగంలోని కాన్సర్ బారిన పడిన ఒక యువ మెంబర్. కేవలం 26.2 మైళ్ళు నడవడమే కాక టీంలో అందరికన్నా రెండు గంటలు ముందే గమ్యం చేరాడు - “హాట్స్ ఆఫ్" ఆ చిన్నారి మారథాన్ అనంతరం ఫేస్ బుక్ లో ఈ విధంగా రాసాడు "న్నెఉ ఆ బుల్లి బుల్లి గుండ్లు ఉన్న చిన్నారుల కోసం నడుస్తున్నాను. జిమ్మి ఫండ్ వాక్ కి వచ్చినప్పుడల్లా వాళ్ళని చూస్తాను. జీవితానుభవాలని తెలుసుకోవడానికి వారు చాలా లేత వయసులో ఉన్నారు. బహుశా జీవితం వారికి ఎంత భయానకరమైన మలుపులో నిలిపిందో కూడా వారికి తెలీదేమో. వెల్, వారికి తెలిసిందల్లా నవ్వడం వారికి చూసినప్పుడల్లా నా మోముపై చిరునవ్వు తెప్పించడం! అలానే చేస్తూ వుండండి బాల సైనికులారా! ఇక ఎవరిదగ్గరైనా చక్రాల కుర్చీ వుందా? నేను ఒక 2 వారాలు వాడుకోవాలి? హ హ...”

 

ఆనంతరం అధ్యక్షులు శ్రీ కందుకూరి కోటేశ్వరరావు పాదాచారులను వారి అంకితభావానికి మారథాన్ సగర్వంగా పూర్తిచేసినందుకు అభినందించారు. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం టీం దాతలకు, నిధులు సేకరించిన వారికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మారథాన్ కార్యాచరణకి అడుగడుగునా సహకరించిన బోర్డ్ ఆఫ్ ట్రుస్టీస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేకంగా కాలేజ్ నుండి -3, హై స్కూల్ -4, మిడిల్ స్కూల్ -4, ఎలిమెంటరి నుండి-4 విద్యార్థులు పాల్గొని జిమ్మి ఫండ్ వాక్ ని అందరికి "ఫన్" వాక్ లాగ మార్చేశారు!

 

 

Koteswara Rao Kandukuri

26.2 Mile

 

Manesha Kakileti (8 yrs)

Seshu Kandukuri

26.2 Mile

College

Kevin Asir (5 yrs)

Madhavi Donepudi

 

 

Karen Asir (8 yrs)

Srinivas Kollipara

26.2 Mile

 

Anusha Kakileti (6 yrs)

Mounica Donepudi

--

 

Ramesh Tallam

Surendar Madadi

26.2 Mile

 

Janakiram Gubbala

Babu Tammisetti

26.2 Mile

 

Surya Kodukulla

Venkat Tiruveedi

26.2 Mile

 

Ganga Yerramsetti

Sarat ummethala

26.2 Mile

 

Venkat Bandaru

Teja Magapu

13.1 Mile

High School

Saraswathi Kakilety

Nikhil Pendenti

13.1 Mile

Middle School

Janardhan Sonthi

Ramakrishna Kommareddy

13.1 Mile

 

Venugopal Veeramaneni

Madhu Chalamani

13.1 Mile

Tadepalli Sudhakar

Geetha Chalamani

 

 

Madan Kolla

Shankar Magapu

13.1 Mile

 

Atharva Kasar (BVIS)

Amal Toke

13.1 Mile

 

Siddh Annaldasula (BVIS)    

Tagore Surpaneni

13.1 Mile

 

Suprabhath Gurrala (BVIS)

Bhanu Yenisetti

13.1 Mile

 

Samhita Gurrala (BVIS)

Bhupathi Raju Pendenti

13.1 Mile

 

Anneha Dalal (BVIS)

Prasad Choudary Raavi

13.1 Mile

 

Mitul Dalal (BVIS)

Lakshmi Tammisetti

13.1 Mile

 

Jawahar Annaldasula (BVIS)

Madhavi Chaliki

13.1 Mile

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;