RELATED EVENTS
EVENTS
సౌత్ ఏసియన్ అమెరికన్ యూత్ సింపోజియం ఘనంగా నిర్వహించిన నాట్స్

శ్వేతసౌథం వేదికగా జరిగిన సౌత్ ఏషియన్ యూత్ సింపోజియంను నభూతో న భవిష్యత్ అన్న తరహాలో నాట్స్ నిర్వహించింది. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ-నాట్స్ ను వైట్ హౌస్ స్వయంగా పిలిచి, సౌత్ ఏషియన్ యూత్ సింపోజియం నిర్వహించాలంటూ ఆ బాధ్యతలను నాట్స్ కు అప్పగించింది. దీనిని ఒక గౌరవంగా స్వీకరించిన నాట్స్ లీడర్ షిప్.. వాషింగ్టన్ డీసీ చాప్టర్ కో-ఆర్డినేటర్స్, వాలంటీర్ల సాయంతో దిగ్విజయంగా పూర్తిచేసింది. ఈ సింపోజియంలో పాల్గొనడం అనేది చాలా అరుదుగా వచ్చే ప్రతిష్టాక్మతమైన అవకాశం. సుమారు 200 మంది ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

 

అమెరికా జాతీయగీతంతో యూత్ కాన్ఫరెన్స్ మొదలైంది. తరువాత వైట్ హౌస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఎంగేజ్ మెంట్ ఆఫీస్ అదితి హార్దికర్ ఈ సభకు సంధానకర్తగా వ్యవహరించారు.వచ్చిన అతిధులను సభకు ఆమె పరిచయం చేసింది. స్వామి చిదాత్మానంద యువకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత జరిగిన ప్రధాన చర్చా కార్యక్రమంలో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ముఖ్యంగా ప్రజాసేవ, కెరీర్ & లీడర్ షిప్ డెవలప్ మెంట్, సమాజంలోని వేధింపులు అనే అంశాలతో పాటు మిషెల్ ఒబామా ప్రారంభించిన లెట్స్ మూవ్ ఉద్యమంపై కూడా చర్చ జరిగింది. ఇదే కాన్ఫరెన్స్ కు పానెలిస్ట్ లుగా వ్యవహరించిన జాకీ డావో(ఆఫీస్ ఆఫ్ మిషెల్ ఒబామా), జాయిద్ హుస్సేన్(ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ ఎంగేజ్ మెంట్), అశ్వైన్ జైన్(హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్), వీరమ్ అయ్యర్(ఎన్ఈసీ), పరాగ్ మెహతా(ఆఫీస్ ఆఫ్ సర్జన్ జనరల్),  శారదా పెరి(సీనియర్ ప్రెసిడెన్షియల్ సరూీచ్ రైటర్), జ్యోతి జస్రసారియా(యూ.ఎస్. ట్రేడ్ రిప్రజెంటేటివ్), అలిస్ యావో( యూ.ఎస్. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్), కైల్ కీర్మన్(డబ్ల్యూహెచ్ ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ ఎంగేజ్ మెంట్)  తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. చివరగా వైట్ హౌస్ డిప్యూటీ క్యాబినెట్ సెక్రటరీ గౌరబ్ బన్సాల్ మాట్లాడారు.చారిత్రక ఇండియన్ ట్రీటీ రూమ్ లో మరికొంత మంది ప్రముఖ వ్యక్తులు ప్రసంగించారు. శేఖర్ నరసింహన్(కమిషనర్-WHAAPI), వినయ్ తుమ్మలపల్లి(ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-సెలెక్ట్ యూఎస్ఏ), నాట్స్ అధ్యక్షులు రవి ఆచంట యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా నాట్స్ ప్రెసిడెంట్ రవి ఆచంట ఆస్క్ ఏ యూత్ మెంటార్, యూత్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ ను ప్రకటించారు. ఈ ప్రకటనపై యువత  హర్షం వ్యక్తం చేసింది.. వైట్ హౌస్ లో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించినందుకు జ్నాపకార్ధంగా నాట్ప్ ఒక సావనీర్ ను విడుదల చేసింది. చివరగా నేవీ స్టెప్స్ వద్ద జరిగిన ఫొటో సెషన్ తో  కార్యక్రమం ముగిసింది.ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న యువతీ యువకులు గొప్ప అనుభవాలను తమతో తీసుకెళ్లారనడంలో సందేహం లేదు. అంత దిగ్విజయంగా కాన్ఫరెన్స్ జరిగింది.. సౌత్ ఏషియన్ యూత్ సింపోజియంను బ్రహ్మాండంగా నిర్వహించినందుకు నాట్స్ కమిటీ సభ్యులైన మధు కొర్రపాటి, రవి ఆచంట, శ్రీనివాస్ కోనేరు, మురళీ మేడిచర్ల, బాపయ్య చౌదరి నూతి, రంజిత్ చాగంటి, శివప్రసాద్ బెల్లం, రావు లింగ, పవన్ బెజవాడ, పద్మిని నిడుమోలు, ప్రవీణ్ నిడుమోలు, జయశ్రీ పెద్దిబొట్ల, వాణి శోభన్, ప్రసాద్ యనిగండ్ల, కవిత యనిగండ్ల, మాధవి దొడ్డి, ప్రత్యూష యనిగండ్ల, హారిక పెద్దిబొట్ల, అశోక్ అన్మాల్ శెట్టి, దేశాయ్ సిద్ధబత్తుల, సంజీవ్ నాయుడు, విక్రమ్ లింగ, జ్యోతి బసవరాజు, సందీప్ లింగ, అంబిక సిద్ధబత్తుల, అమిత అన్మాల్ శెట్టి, సంజీవ్ నాయుడు, సాయి తాళ్లూరి, దివ్య ఏలూరి, స్వప్నిక మాధవరం, కృష్ణ బెల్లం, లక్మి లింగ- వీళ్లందరికి వైట్ హౌస్ ప్రత్యేకంగా తన అభినందనలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన స్పాన్సర్స్, మీడియా ప్రతినిధులకు నాట్స్ కృతజ్నతలు తెలిపింది.

TeluguOne For Your Business
About TeluguOne
;