RELATED ARTICLES
ARTICLES
నాట్స్ ప్రస్థానంలో మరో ముందడుగు.. హారిస్ బర్గ్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్


నాట్స్  ప్రస్థానంలో మరో ముందడుగు.. హారిస్ బర్గ్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్


హారిస్బర్గ్ : మార్చ్-28: అమెరికా లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రస్థానంలో మరో కీలక మైన ముందడుగు పడింది. అమెరికాలోని, పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హారిస్బర్గ్  లో నాట్స్ కొత్త ఛాప్టర్ ప్రారంభమైంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సాహించే నాట్స్ హారిస్ బర్గ్  లో నాట్స్ చాప్టర్ నాయకత్వాన్ని నరేంద్ర పాములపాటి కి అప్పగించింది. తొలుత, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ , సెక్రటరీ శ్రీధర్ అప్పసాని నాట్స్  ఆవిర్భాభం, ప్రస్థానం గురించి వివరించారు. అనంతరం, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి తన జోనల్ పరిధి లో ప్రారంభం కానున్న నూతన చాప్టర్ మరెన్నో నూతన చాఫ్టర్ల ఆవిర్భావానికి నాంది కావాలని, తెలుగు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించటానికి ముందుండాలని  ఆశాభావం వ్యక్తం చేశారు.
 


అమెరికాలో తెలుగుజాతికి నాట్స్ అండగా నిలబడుతుందని నాట్స్ హారిస్ బర్గ్ చాప్టర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన  నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ అన్నారు. అమెరికాలో ఇప్పుడు తెలుగువారు తమకు ఏ కష్టమోచ్చినా నాట్స్ హెల్ఫ్ లైన్ (1-888-4-Telugu) కు సంప్రదించడం  తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. నాట్స్ పట్ల తెలుగువారికి ఉన్న నమ్మకానికి ఇది నిదర్శమని  మోహన కృష్ణ మన్నవ అన్నారు. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఉద్దానంలో ఆర్వో ప్లాంట్లు, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో చేపట్టిన నాట్స్ బడి దత్తత, గ్రంథాలయాల అభివృద్ధి కార్యక్రమాలను మోహన కృష్ణ మన్నవ వివరించారు. సమిష్టి నాయకత్వంతోనే నాట్స్ కు ఇంత ఆదరణ వస్తోందని తెలిపారు.. నాట్స్ సభ్యుల నుంచి వస్తున్న సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టగలిగామని వివరించారు. హారిస్ బర్గ్ లో కూడా నాట్స్ నరేంద్ర పాములపాటి నాయత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి.. తెలుగువారి ఆదరాభిమానాలు పొందుతుందని మోహన కృష్ణ మన్నవ విశ్వాసం వ్యక్తం చేశారు. నాట్స్ హారిస్ బర్గ్ నాయకులను అభినందించారు.


ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగుసంబరాలు ఈ సారి చికాగో వేదికగా జరగనున్నాయని ఈ సంబరాలకు అందరూ తరలిరావాలని నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్  మురళీ కృష్ణ మేడిచెర్ల ఆహ్వానించారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో నాట్స్  ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతుందన్నారు.యువతను ప్రోత్సాహించడంతో ఎప్పుడూ నాట్స్ ముందుంటుందని... నాట్స్ న్యూ జెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ వంశీకృష్ణ వెనిగళ్ల  మాట్లాడుతూ యువత కు నాట్స్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అని చెప్పటానికి తానే ఒక ఉదాహరణ అని అంటూ, నూతన యువ కార్యవర్గానికి అభినందనలు తెలియచేసారు. హరీస్ బర్గ్ లో యువ నాయకత్వానికి ప్రోత్సాహామిచ్చి నాట్స్ ను  తెలుగువారికి మరింత చేరువ చేస్తానని కొత్తగా బాధ్యతలు చేపట్టిన హారిస్ బర్గ్ కోఆర్డినేటర్ నరేంద్ర పాములపాటి అన్నారు. ఫణికుమార్ గుడిపాటి, భావిక్ ఉప్పలపాటి, వంశీ ముప్పాళ్ల, వినోద్ అడుసుమిల్లి, రాజేష్ యంత్రపాటి, శాంతిభాస్కర్  తదిరులు హారిస్బర్గ్ లో నాట్స్ చాప్టర్ లో కీలక పాత్ర పోషించనున్నారని తెలిపారు. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ నాట్స్ చాప్టర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.నాట్స్ శ్రేయోభిలాషి, సప్పోర్టర్ ఏ.వి.ఆర్.చౌదరి , రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనేక అంశాల గురించి వివరిస్తూ , పెట్టుబడులు ఎలా పెట్టాలి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అవకాశాలను వివరిస్తూ , ఇంతకుముందు తమ జి & సి సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టినవారి లాభాలు ఎలా ఉన్నాయో తదితర విషయాలు తెలియచేశారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;