LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం (17-6-24) ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్ట్ దగ్గరకి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గరకి వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్ వే సహా వివిధ ప్రాంతాలను ఆయన చూశారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు తన పోలవరం సందర్శనలో భాగంగా స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో  జగన్ సర్కార్ తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసింది. లేని స్కాం ఉందంటూ ఎటువంటి ఆధారాలూ లేకుండా గాలిలో ఆరోపణలను చేస్తూ చంద్రబాబును వేధించింది. 50 రోజులకు పైగా జైలులో నిర్బంధించింది. ఇంత చేసినా జగన్ సర్కార్ స్కిల్ కేసులో అవినీతిని నిరూపించడంలో ఘోరంగా విఫలమైంది. తాజా ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాభవానికి ప్రధానమైన కారణాలలో చంద్రబాబు అరెస్టు కూడా ఒకటి అనడంలో సందేహం లేదు. జగన్ సర్కార్ దమనకాండకు కూడా వెరవకుండా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ నినదించారు.  యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ అనే సంస్థలతో గత చంద్రబాబు ప్రభుత్వం  3 వేల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది.  3 వేల కోట్ల రూపాయల్లో 10 శాతం  ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ పది శాతం సొమ్ము ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది ప్రభుత్వ అభియోగం. దీనిపై సీమెన్స్ కంపెనీ అప్పట్లోనే స్పందించింది. జగన్ సర్కార్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, అసత్యం అని కుండబద్దలు కొట్టింది. అంతే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలో  అవినీతికి ఆస్కారమే లేదని అప్పట్లోనే సిమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ విస్పష్టంగా చెప్పారు.   ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడం తనకు ఆశ్చర్యంగా ఉందని.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని అప్పుడే తేటతెల్లం చేశారు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించిన ఆయన.. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200కు పైగా ల్యాబ్‌లను ప్రారంభించినట్లు వివరించారు. సిమెన్స్ కంపెనీతో అసలు అగ్రిమెంట్ జరగలేదని సీఐడీ చేస్తున్న ఆరోపణలను ఆయన అభూత కల్పనలుగా అభివర్ణించారు.  ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం సులభమే కానీ, నిరూపించడం అసాధ్యమని చంద్రబాబు అరెస్టు సమయంలోనే ఆయన స్పష్టంగా చెప్పారు.    ఆయన మాటల్లో చెప్పాలంటే.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో వ్యవసాయ రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ముందుకు వచ్చింది. 2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.. వారిలో   చాలామంది మంచి ఉద్యోగాలలో కూడా స్థిరపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును గతంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ కూడా మెచ్చుకుకున్నారు. అలాంటిది ఇప్పుడు అదే ఏపీఎస్ఎస్డీసీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తోందనేది   అర్థం కావడం లేదు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినపుడు సరైన విచారణ జరిపి కేసు పెట్టాల్సి ఉండగా.. కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లుగా ప్రభుత్వం తీరు ఉంది. ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని తేల్చేశారు. ప్రభుత్వం మోపిన అవినీతి ఆరోపణల కేసు ఎలా ఉందంటే.. 'విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు. ఆ వ్యక్తి బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు.  స్కిల్ డెవలప్‍మెంట్ చాలా విజయవంతమైన ప్రాజెక్టు.. 2016లో కేంద్రం ఈ ప్రాజెక్టును విజయవంతమైన నమూనాగా కూడా ప్రకటించింది. ఇదే తరహా ప్రాజెక్టులు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం.. ఇప్పుడు కూడా చేస్తున్నాం.  ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం పలువురి జీవితాలపై ప్రభావం చూపుతుంది. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారు. రెండున్నరేళ్లుగా రకరకాలుగా తమను ఇబ్బంది పెట్టారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో ఏర్పాటు చేసిన 200కు పైగా ల్యాబ్‌లు కనిపిస్తున్నా.. అగ్రిమెంట్ జరగలేదని ఆరోపించడం దారుణం. ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇది స్కాంగా ప్రభుత్వం చెబుతుండటం విస్మయం కలిగిస్తోంది.   చంద్రబాబు అరెస్టు సమయంలో సీమెన్స్ మాజీ ఎండీ చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలని జగన్ ఘోర పరాజయం సందేహాలకు అతీతంగా తేల్చేసింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని సీమెన్స్ మాజీ ఎండీ సుమన్  న్యాయం గెలుస్తుందన్న తన విశ్వాసాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం చేశారని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.  ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలని ఆకాంక్షించారు. ఆనసీమెన్స్ ప్రాజెక్టుపై వైకాపా ప్రభుత్వం బురద చల్లిన తీరుపై గతంలో లోకేశ్, బ్రాహ్మణులు చేసిన పోస్టులను ట్యాగ్ చేశారు. 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. గత ఐదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగింది. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడారు. సీఆర్డయే చట్టాన్ని మార్చడానికి ప్యయత్నించారు. మాస్టర్ ప్లాన్ ను పక్కన పెట్టేసి ఇష్టారీతిగా భూముల పందేరానికి కూడా తెగబడ్డారు. అయితే అన్ని విషయాలలోనూ జగన్ ఫెయిలయ్యారు. ఆయన చేయగలిగిందేమిటంటే గత ఐదేళ్లుగా అమరావతి పురుగతిని స్తంభింపచేయడమే. పనులను అర్ధంతరంగా ఆపివేయడం. అమరావతి కేంద్రంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వారిని వెనక్కు పంపేయడమే.  దీంతో అమరావతి భవిష్యత్ పై అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లోనే కాదు.. ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రుల సొంతం అవుతుందని ఆశించిన వారిలో కూడా ఆందోళన నెలకొంది. ఈ ఐదేళ్లలో అమరావతి విధ్వంసాన్ని కళ్లారా చూసిన జనం మళ్లీ అమరావతి పూర్వవైభవం ఎప్పటికి సంతరించుకునేను అన్న ఆందోళన కూడా వ్యక్తం చేశారు.  అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనమైంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో అమరావతి పురోగతి పరుగులు పడుతుందనడంలో సందేహం లేదు. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఆ సందర్భంగా  నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం ఉంటుందని  విస్పష్టంగా చెప్పేశారు.    2014-19 మధ్య ఆయన అమరావతి పనులను పర్యవేక్షించారు.  ఇప్పుడు కూడా ఆయనకు అమరావతి పనుల కొనసాగింపునకు సంబంధించి బాధ్యతలు ఉన్న మంత్రిత్వ శాఖనే చంద్రబాబు కట్టబెట్టారు.  అమరావతి పునర్మిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరలో చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్నది తన లక్ష్యమని చెప్పిన ఆయన  దీనిపై పూర్తిగా అవహాన చేసుకుని నిర్దిష్టమైన కాల పరిమితిని నిర్ణయిస్తామని చెప్పారు.  అమరావతి ఫస్ట్ ఫేజ్ నిర్మాణానికి 48 వేల కోట్ల రూపాయలు అవుతుందని, మొత్తం మూడు ఫేజ్ లూ పూర్తి చేయడానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమౌతుందని చెప్పారు.   అమరావతి రోడ్ల ధ్వంసం, సామగ్రి చోరీలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధ్వంసం, చోరీలపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.  ఇక అమరావతి లో పేరుకుపోయిన చత్త, ఇష్టారీతిగా పెరిగగిపోయిన ముళ్ల కంపల తొలగింపు వేగవంతంగా జరుగుతోందని వివరించారు.  2019 నాటికే దాదాపుగా పూర్తి అయిపోయిన భవనాలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ,  ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారనీ, అటువంటి వాటిని త్వరిత గతిన పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని నారయణ చెప్పారు.  మొత్తం మీద ఆంధ్రుల రాజధాని అమరావతి, ప్రపంచ స్థాయి నగరంలో త్వరలోనే రూపుదాల్చనుందని నారాయణ ఉద్ఘాటించారు. 
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అన్నది సామెత. కానీ జగన్ హయాంలో కొందరు అధికారులు అడుసు తొక్కడం కాదు.. అందులోనే నిలువునా కూరుకుపోయారు. ఇప్పుడు వారికి కాళ్లు, ఒళ్లు కడుక్కున్నా కసువు వదిలే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ హయాంలో అలా నిలువెల్లా అవినీతి, అక్రమాల మరకలు అంటించుకున్న సీనియర్ అధికారుల్లో ఐఎఎస్ శ్రీలక్ష్మి ఒకరు.  ఆమె కనుక నిబంధనల మేరకు పని చేసి ఉంటే చాలా ఉన్నత స్థానానికి ఎదిగి ఉండే వారు. అయితే ఆమె అవినీతి పంచన చేరి అడ్డగోలుగా ఏలిన వారి అక్రమాలకు అండదండలు అందించడానికే మొగ్గు చూపారు.   శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై విచారణను ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సరే అది పక్కన పెడితే.. ఆ తరువాత కూడా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ అంటే 2019 ఎన్నికల తరువాత నుంచీ తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి వచ్చేందుకు చేయని ప్రయత్నం లేదు. అప్పటికి వైసీపీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలుగుతున్న జగన్ అక్రమ కేసుల్లో ఏ2 అయిన విజయసాయి రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేసి మరీ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.  సరే ఆ ప్రయత్నాలు ఫలించి ఆమె తెలంగాణ నుంచి ఏపీకి మారారు. ఇక ఆమె ఏపీకి వచ్చిన తరువాత జగన్ అడ్డదిడ్డ, అవకతవక నిర్ణయాలన్నిటికీ వత్తాసుగా నిలిచారు. మునిసిపల్ శాఖ ప్రిన్నిపల్ సెక్రటరీ హోదాలో   నిబంధనలను తుంగలో తొక్కి జగన్ ఏం చేయమంటే అది చేశారు. ఇప్పుడు జగన్ అధికారం పోయింది. మరి శ్రీలక్ష్మి ఏం చేస్తున్నారు. ప్లేటు ఫియాయించి ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు, మునిసిపల్ మంత్రి నారాయణ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. అయితే శ్రీలక్ష్మి పప్పులు వారి వద్ద ఉడుకుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును అందరు ఐఏఎస్ అధికారులతో పాటు అభినందించేందుకు వెళ్లిన శ్రీలక్ష్మి ఇచ్చిన బొకేను చేతితో  తాకడానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. దీంతో ఆమె జీవం లేని నవ్వుతో తాను తీసుకువచ్చిన బొకేతోనే వెనుదిరగాల్సివచ్చింది. అక్కడితో ఆమె ఆగలేదు. మునిసిపల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ వద్దకు మునిసిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో వెళ్లారు. అయితే ఆమె తీసుకువచ్చిన ఫైలును పరిశీలించడానికి కూడా మంత్రి నారాయణ ఇష్టపడలేదు. ఇప్పటికే శ్రీలక్ష్మికి దస్త్రాలేవీ పంపవద్దని స్పష్టమైన ఆదేశాలు సీఎస్ నుంచి జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాలలో ఓ టాక్ నడుస్తోంది. మరి రానున్న రోజులలో శ్రీలక్ష్మికి స్థాన చలనం తప్పదనీ, జగన్ హయాంలో జరిగిన అవకతవకలకు సహకరించినందుకు విచారణను ఎదుర్కోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ అరాచకపాలనకు చరమగీతం పాడారు. ఐదేళ్ల పాటు వేధింపులు, దాడులు, దౌర్జన్యాలూ, కక్షసాధింపు వినా ప్రభుత్వానికి మరో పనే లేదన్నట్లుగా జగన్ సాగించిన అధ్వాన, అరాచక పాలనకు ఓటు ద్వారా అంతం పిలికారు ఏపీ జనం.  ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలుంటే వాటిలో 164 స్థానాలు తెలుగుదేశం కూటమి చేజిక్కించుకుంది. 151 స్థానాలతో గత ఎన్నికలలో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 స్ధానాలకు గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకండా మిగిలిపోయింది. అయితే ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి వస్తామంటూ విర్రవీగి, సవాళ్ల మీద సవాళ్లు చేసిన వైసీపీ తోపులు ఇప్పుడు జనాలకు ముఖం చూపించలేక  అజ్ణాతంలోకి జారుకున్నారు.  అలాంటి వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు.   అయితే  పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని చెప్పారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడా సవాళ్లను గుర్తు చేస్తే.. తాను సవాలైతే చేశాను కానీ తన సవాలును ఎవరూ స్వీకరించలేదుగా అంటే తప్పించుకుంటున్నారు.  అలాగే బూతుల నాని అదేనండి కొడాలి నాని కూడా చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే తానాయన పాదాల  దగ్గర కూర్చుంటానని సవాల్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే కొడాలి నాని మాత్రం తన సవాలును మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిబద్ధత, మాటకు కట్టుబడే తనం వైసీపీ నేతల్లో కాగడా పెట్టి వెతికినా కనిపించవు. అసలా పార్టీ అధినేతే అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి మాట తప్పడం, మడమ తిప్పటమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఆయన పార్టీ నేతలు మాట మీద నిలబడతారని ఎలా అనుకుంటాం. అయితే అందుకు భిన్నంగా 2019 ఎన్నికలకు ముందు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీయే మరోసారి అధికారంలోకి వస్తుందని సవాల్ చేసి, అలా జరగకపోతే మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యేవరకూ గ్రామంలోకి అడుగుపెట్టను అని సవాల్ చేసిన ఒక తెలుగుదేశం మహిళా కార్యకర్త అన్న మాట మీద నిలబడి గత ఐదేళ్లూ సొంతూరులో అడుగుపెట్టలేదు. మళ్లీ 2024 ఎన్నికలలో విజయం సాధించిన తరువాతే సొంత గ్రామంలో అడుగు పెట్టారు.  ఈ సంఘటన కుసుమంచి మండలం కేశవాపురం గ్రామంలో జరిగింది. కేశవాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏపీ సీఎం అవుతారని కుటుంబ సభ్యులతో సవాల్ చేశారు. అలా జగరకపోతే  మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యే వరకూ గ్రామంలో అడుగుపెట్టనని ప్రతిజ్ణ చేశారు.  2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలవ్వడంతో ఆమె అన్న మాట ప్రకారం అప్పటి నుంచీ మళ్లీ కేశవాపురంలో అడుగుపెట్టలేదు. 2024 ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధించిన తరువాత ఆమె తన శపథం నెరవేర్చుకున్నారు. ఐదేళ్ల తరువాత స్వగ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని  ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు కేశవాపురం గ్రామస్తులు విజయలక్ష్మికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈమెను చూసి  మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి   వైసీపీ నాయకులు మాట విలువ ఏమిటో తెలుసుకుంటే మంచిది. 
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో ప్రతిభగల గీత రచయితలలో అనంత శ్రీరామ్ ఒకరు. ఆయన కలం నుంచి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. అర్థవంతమైన పాటలు రాయడంలోనే కాదు.. అల్లరి చేయడంలోనూ అనంత శ్రీరామ్ ముందుంటారు. టీవీలో వచ్చే పాటల కార్యక్రమాలలో తనదైన మాటలు, స్టెప్పులతో వినోదాన్ని పంచుతారు. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఇక తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా లడఖ్ వెళ్లిన అనంత శ్రీరామ్.. "లడఖ్ లో ఈ మాత్రం సరిపోదా" అంటూ అక్కడ జంప్ చేసిన ఒక వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. లోయ పక్కన చేసిన ఈ జంప్.. చూడటానికి రిస్కీగానే కనిపిస్తోంది. అనంత శ్రీరామ్ గట్స్ ని, ఎనర్జీని మెచ్చుకోవాల్సిందే.  
Following massive anticipation, the much-awaited trailer of the upcoming sci-fi epic ‘Kalki 2898 AD’ has finally been unveiled on June 10th. Offering an extraordinary introduction to the ‘Kalki 2898 AD’ cinematic universe, the trailer, draws audiences into a world of Indian mythology, complemented by top-notch sci-fi and VFX.  Featuring an ensemble star cast including Amitabh Bachchan, Kamal Haasan, Prabhas, Deepika Padukone and Disha Patani in key roles, ‘Kalki 2898 AD’ is directed by Nag Ashwin and produced by Vyjayanthi Movies. A multilingual, mythology-inspired sci-fi spectacle set in the future, the film hits the screens on 27th June 2024. The makers are currently busy planning for the musical promotions. India's biggest song named Bhairava anthem only mp3 version released yesterday. Diljit Dosanjh and Prabhas will be grooving for the kuthu number scored Santosh Narayanan in the full video song releasing today. We've exclusively learnt that Kalki 2898AD film has four banger songs. The songs will be part of the story and every song is distinctive to one another.
  యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వివాహం రీసెంట్ గా జరిగిన సంగతి విషయం అందరికీ తెలిసిందే. కాగా జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ, రాజకీయ అతిరధ మహారధుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్  శంకర్,  ప్రభుదేవా, డైరెక్టర్  లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నామలై, స్నేహ రోజా తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.    
నిలువవే వాలు కనుల దాన వయ్యారి హంస నడక దాన అని  ప్రియుడు తన ప్రేయసి ని ఉద్దేశించి పాడాడంటే ఖచ్చితంగా ఆమె కురులు కూడా అందుకు ఒక  కారణం. అందుకు తగ్గట్టే  ఆడవారు కూడా తమ  కురులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఒక హీరోయిన్ దైవం ముందు నేనెంత అని తన కురులని త్యాగం చేసింది. శరణ్య నాగ్ (saranya nag)1998 లో ప్రశాంత్, ఇషా కొప్పికర్ హీరో హీరోయిన్లుగా  తమిళంలో తెరకెక్కిన కాదల్ కవితాయ్ చిత్రం ద్వారా బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సోలో హీరోయిన్ గా ఎన్నో హిట్ సినిమాల్లో చేసింది. వాటిల్లో ఒక హిట్ సినిమా 10th క్లాస్‌. 2006 లో వచ్చిన ఆ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని సాధించింది. అంజలి క్యారక్టర్ లో శరణ్య ప్రదర్శించిన పెర్ ఫార్మెన్స్ కి యూత్ మొత్తం ఫిదా అయ్యింది. చాలా మంది శరణ్య ఫోటోని తమ    పర్సుల్లో కూడా ఉంచుకున్నారంటే ఆమె ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా శరణ్య  తమిళనాడు లో పేరెన్నిక గన్న తిరుత్తణి  సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని  స్వామివారికి తలనీలాలు  సమర్పించింది. అంతటితో ఆగకుండా  నాలుకపై శూలాన్ని కూడా పొడిపించుకుంది.  ఇప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. కొంత మంది అయితే శరణ్యని అసలు గుర్తుపట్టలేదు. ఆ తర్వాత  విషయం  తెలుసుకొని శరణ్య  భక్తి ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  ఇక శరణ్య కి  తిరుత్తణి సుబ్రమణ్య స్వామి అంటే చాలా భక్తి. తన కోరికలని స్వామి  నెరవేర్చినందుకే  మొక్కులు చెల్లించింది. 10 th  క్లాస్ తర్వాత  తెలుగులో  ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా చిత్రాల్లో చేసింది. 2013 లో అవి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక   సోలో హీరోయిన్  గా ఆమె   చివరి చిత్రం తమిళంలో తెరకెక్కిన  ఈరా వెయ్యిల్.. 2014 లో ఆ మూవీ వచ్చింది. తెలుగు హీరో ఆర్యన్ రాజేష్  హీరో.  
National Award Winner Allu Arjun is currently involved in the Pushpa 2: The Rule shooting directed by Sukumar. The film shoot progressing at decent pace. The actor has Trivikram waiting for him with a socio fantasy story after this project. But we've reported that Allu Arjun next after Pushpa 2 will be directed by Atlee. Anirudh Ravichander will be scoring the music for this exciting combo. The latest we hear is that makers shelving this project. Sun Pictures and Geetha Arts planned to bankroll the film. Allu Arjun has other projects lined up with Trivikram Srinivas and Sandeep Reddy Vanga.
  తమ అభిమాన హీరో ఎక్కువ సినిమాలు చెయ్యాలని, ప్రేక్షకులకు చక్కని వినోదం అందించాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. పాతతరం టాప్‌ హీరోలందరూ ఒక సంవత్సరంలో లెక్కకు మించిన సినిమాలు చేసేవారు. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో కొందరు హీరోల సినిమాలు నెలకి ఒకటి చొప్పున రిలీజ్‌ అయ్యేవి.  రాను రాను ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. సంవత్సరానికి ఒక్క సినిమా చెయ్యడమే గగనంగా మారిపోయింది. ఇప్పుడు టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరి పరిస్థితి అలాగే ఉంది. అయితే ఈ విషయంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ని ఉదాహరణగా తీసుకోవచ్చు. 2018లో ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలైంది. 2022లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ అయింది. ప్రస్తుతం ‘దేవర’ చిత్రం చేస్తున్నారు ఎన్టీఆర్‌. మూడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పైనే ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న ‘దేవర’ చిత్రం విడుదల కానుంది. 2018 నుంచి 2024 వరకు అంటే 6 సంవత్సరాల్లో ఎన్టీఆర్‌ నటించిన ఒక్క సినిమా మాత్రమే విడుదలైంది. ఈ విషయంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతితో ఎన్టీఆర్‌ను కంపేర్‌ చేస్తున్నారు అభిమానులు.  తమిళ్‌, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్‌ సేతుపతి కెరీర్‌ ఎన్టీఆర్‌కి భిన్నంగా సాగుతోంది.  2018లో విజయ్‌ సేతుపతి 25వ సినిమా ‘సీతాకత్తి’ రిలీజ్‌ అయింది. ఆ తర్వాత ఈ ఆరేళ్ళ కాలంలో 25 సినిమాలు పూర్తి చేసారు విజయ్‌. ఇటీవల అతను నటించిన 50వ సినిమా ‘మహరాజ’ రిలీజ్‌ అయింది. అంటే అంత వేగంగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. సినిమాలోని తన క్యారెక్టర్‌ నచ్చితే చాలు.. అది చిన్న క్యారెక్టరా, పెద్ద క్యారెక్టరా అనేది ఆలోచించరు. విలన్‌గా నటించడానికి కూడా వెనుకాడరు. అందుకే శరవేగంగా 50 సినిమాలు పూర్తి చేయగలిగారు విజయ్‌. ఒక విధంగా విజయ్‌ సేతుపతి కంటే ఎన్టీఆర్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. ఎన్టీఆర్‌ ఇమేజ్‌ వేరు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బిజినెస్‌ స్పాన్‌ కూడా బాగా పెరిగింది. అందుకే ఇప్పుడు బాలీవుడ్‌ మూవీ ‘వార్‌2’లో నటిస్తున్నారు. విజయ్‌ సేతుపతిలా సంవత్సరానికి ఐదారు సినిమాలు చేయలేకపోయినా కనీసం రెండు సినిమాలైనా చేస్తే బాగుంటుందనేది అభిమానుల ఒపీనియన్‌.  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ చర్చ బాగానే జరుగుతోంది. విజయ్‌ సేతుపతితో ఎన్టీఆర్‌ని కంపేర్‌ చెయ్యడమేంటి అని కొందరు కామెంట్‌ చేస్తుంటే.. అతను పాత తరం హీరోల మాదిరిగానే ఏడాదికి ఎక్కువ సినిమాలు చేస్తున్నాడని, అతనిలా మన హీరో ఉండాలని ఎన్టీఆర్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చెయ్యడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా ఫర్వాలేదు గానీ, ‘దేవర’ చిత్రానికి కూడా మూడేళ్ళు కేటాయించడం యంగ్‌ టైగర్‌ అభిమానుల్ని తీవ్రంగా బాధిస్తోందట.   
Mass Ka Das Vishwak Sen, known for his dynamic performances, recently faced a setback with the box office disappointment of "Gangs Of Godavari." Despite this, the resilient actor is busy working on his next project, "Mechanic Rocky," and is determined to make a strong solo comeback. His dedication to his craft and his fans remains unwavering. In addition to his professional pursuits, Vishwak Sen recently made headlines for his noble gesture at the METRO RETRO event, a gathering aimed at promoting organ donation. Attending as the Chief Guest, he not only supported the cause but also took a significant step by pledging to donate his own organs. This act of generosity highlights his commitment to saving lives and sets a powerful example for his admirers and the broader public. Vishwak Sen's pledge to donate his organs is a testament to his altruistic spirit and dedication to making a positive impact beyond the silver screen. By using his platform to advocate for organ donation, he inspires others to consider the life-saving potential of this cause. As he continues to prepare for his comeback with "Mechanic Rocky," Vishwak Sen's actions off-screen continue to earn him respect and admiration, solidifying his reputation as not only a talented actor but also a compassionate and responsible individual.
The Hindi version of THE Vijay Deverakonda's starrer Dear Comrade is creating records on YouTube, reaching more than 400 million views. The Goldmines YouTube Channel uploaded the Hindi version of Dear Comrade on January 19, 2020. This movie is available in 150 language subtitles. The views of this movie on YouTube highlight the pan-India popularity of Vijay Deverakonda's movies and his immense craze as a hero. Dear Comrade is jointly produced by Big Ben Cinemas and Mythri Movie Makers and directed by Bharat Kamma. Rashmika Mandanna stars as the heroine. Dear Comrade has secured a special place in the minds of the audience as an emotional love story.
వేణు స్వామి (Venu Swamy) సతీమణి శ్రీవాణి గురించి తెలిసిందే. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్నారు. వీణ వాయించడంలో ఆమె దిట్ట. ఆమె పేరు మీద వరల్డ్ రికార్డు కూడా ఉంది. అందుకే ఆమెని 'వీణ శ్రీవాణి' (Veena Srivani) అని అంటుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఆమె.. ఇటీవల జరిగిన ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ పెళ్లి వేడుకలో శ్రీవాణి వీణ వాయించారు. ఆమె ఎంతో అందంగా వీణ వాయించడం, అర్జున్ ఆమెను ఆప్యాయంగా పలకరించడం.. వంటి వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. అతని భార్య పల్లవి ఈ ఏడాది ఫిబ్రవరిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు తెలియజేశాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిఖిల్- పల్లవి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.  నిఖిల్ తనయుడి బారసాల ఫొటోలు కూడా లీక్ అయ్యాయి.   కానీ నిఖిల్ తన కొడుకుకి ఏ పేరు పెట్టాడు అనేది మాత్రం చెప్పలేదు. కాగా హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న విడుదల కానుంది.  ఇటీవలే జరిగిన  ‘నింద’  ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ వచ్చాడు. ఈ  సందర్బంగా మాట్లాడుతూ... చిత్రం ఘన విజయం సాధించాలంటూ మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. అంతే కాకుండా ఇదే ఈవెంట్‌లో తన కొడుకు పేరు ‘ధీర సిద్దార్ద’  అంటూ తన కొడుకు పేరును ప్రకటించాడు నిఖిల్. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనసును తమ స్వాధీనంలో ఉంచుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికీ మనసు నియంత్రణ గురించి ఎంతో కొంత తెలుసు. మనందరం మనసుల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ, దాని గురించి మరికొంత తెలుసుకొని, మరింత మెరుగ్గా, సమర్థంగా మనసును స్వాధీనంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఈ విషయంలో మనకు ఎవరు సహాయం చేయగలరు? ఎవరైతే తమ మనసును సంపూర్ణంగా స్వాధీనంలో ఉంచుకున్నారో వారు మాత్రమే మనకు సహాయపడగలరు! మనోనిగ్రహం ఎంతో ఆసక్తికరమైన ఆట. అయితే అది మనకు అంతర్గతమైనది. గెలుపు ఓటములను లెక్క చేయని మనస్తత్వం (క్రీడాస్ఫూర్తి) ఉంటే అప్పుడప్పుడు, తాత్కాలికంగా ఓడిపోతున్నట్లు తోచినా, ఈ ఆటను గొప్పగా ఆనందించవచ్చు. ఈ ఆట ఆడడానికి నైపుణ్యం, చురుకుదనం, హాస్యస్ఫూర్తి, మంచి హృదయం, వ్యూహాత్మక శక్తి, ధీరోదాత్తత అవసరం. అప్పుడే నూరుసార్లు అపజయం పాలైనా గుండె జారిపోకుండా నిలదొక్కుకోగలం.  అత్యున్నత యోగస్థితిని ఎలా పొందగలమో శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. అర్జునుడు ఆయన చెప్పినది విని నిస్పృహతో భగవానుణ్ణి ఈ క్రింది విధంగా అడిగాడు. అతని నిస్పృహను మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. “ఓ కృష్ణా! మనను అత్యంత చంచలమైనది! నువ్వు బోధించే ఈ యోగం సంపూర్ణంగా నిశ్చలమైన మనసును కలిగివున్నప్పుడే సాధ్యం కదా! కాబట్టి ఈ యోగస్థితి మనలో ఏ విధంగా నిలిచి ఉండగలదో నాకు అర్థం కావడం లేదు. అంతేకాక  మనసు అశాంతితో అల్లకల్లోలంగా ఉంటుంది. అది శక్తిమంతమైనది, మూర్ఖమైనది. గాలిని నిగ్రహించడం ఎంత కష్టమో మనసును నిగ్రహించడం కూడా అంతే కష్టమని నాకు తోస్తున్నది” అని అర్జునుడు తన సందేహాన్ని వెలిబుచ్చాడు. మానవులందరూ సర్వసాధారణంగా అడిగే ఈ ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు సర్వమానవాళీ ఎల్లకాలం గుర్తుంచుకోదగిన సందేశాన్నిచ్చాడు. మనసు నియంత్రణకు సంబంధించిన భారతీయ ఆలోచనా ధోరణి, సాధనా విధానం చాలావరకూ ఈ సందేహం మీదే ఆధారపడ్డాయి.  శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు.. “ఓ అర్జునా! నిస్సందేహంగా మనసు ఎంతో చంచలమైనది. దాన్ని నియంత్రించడం చాలా కష్టం. కానీ అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.” 'అభ్యాసం', 'వైరాగ్యం' అనే ఈ రెండు మాటలలో శ్రీకృష్ణుడు మనసును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన రహస్యాన్నంతటినీ  అందించాడు. కానీ, వాటిని మన జీవనస్రవంతిలోకి తెచ్చేది ఎలా? అదే అసలు సమస్య. దీన్ని పరిష్కరించడానికి.. => మనసును స్వాధీనపరచుకోవాలన్న దృఢ సంకల్పం కలిగివుండాలి. => మనసు స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. => మనోనిగ్రహం కోసం క్రమం తప్పకుండా ప్రయత్నించాలి.  ఈ మూడు చేస్తే మనసు స్వాధీనంలో ఉంటుంది.                                      *రూపశ్రీ.  
    ప్రతి పిల్లవాడి దృష్టిలో తన తండ్రి సూపర్ హీరో.  బయట ఏ మహిళను అయినా అమ్మ అని పిలిచే వీలుంటుంది. కానీ నాన్న అని కేవలం కన్న తండ్రిని మాత్రమే పిలుస్తాం.  తల్లిదండ్రులలో ఎప్పుడూ పిల్లలకు దగ్గరగా ఉండేది,  పిల్లల బాగోగులు దగ్గరగా చూసుకునేది తల్లే. అందుకే చాలా మంది పిల్లలు తల్లితోనే చనువుగా ఉంటారు. కానీ తండ్రి బయట ఉద్యోగం చేసి భార్యా పిల్లలకు జీవితం మీద భరోసా ఇవ్వగలిగితేనే ఏ భార్య అయినా తన పిల్లలను ప్రశాంతంగా చూసుకోగలదు.  కాబట్టి ప్రతి కుటుంబం ప్రశాంతంగా ఉండటం వెనుక నాన్న కష్టం, ఆయన త్యాగం చాలా ఉంటుంది.  అయితే పిల్లలు తన తండ్రి నుండి మాత్రమే నేర్చుకోగలిగే విషయాలు కొన్ని ఉన్నాయి.  ఇవి బయట ఎవ్వరినీ చూసి నేర్చుకోలేరు.  అవేంటో ఓ లుక్కేస్తే.. బాధ్యత నుండి పారిపోకుండా ఉండటం.. చాలామంది కష్టం, బాధ,  అసౌకర్యం అనిపించగానే వాటి నుండి దూరంగా పారిపోతారు.  దానివల్ల తాము ప్రశాంతంగా ఉండగలుగుతాం అని అనుకుంటారు. కానీ తండ్రి అలా ఆలోచిస్తే భార్యాపిల్లల జీవితం తలకిందులు అవుతుంది.  తండ్రి బాధ్యతలు, కష్టాలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ ఒక సైనికుడిలా సిద్దంగానే ఉంటాడు. కాబట్టే భార్యా పిల్లలు ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు. బాధ్యతల నుండి పారిపోకుండా.. వాటిని  సమర్థవంతంగా మోసేది తండ్రి మాత్రమే.  ఈ లక్షణాన్ని పిల్లలు తండ్రి నుండి నేర్చుకుంటారు.  ఓ కుటుంబాన్ని మోయడం  బరువు కాదు బాధ్యత అని తండ్రి నుండి తెలుసుకుంటారు. మాట వినడం.. చాలామంది అంటూ ఉంటారు.  అమ్మ చెబుతూ ఉంటే నాన్న వింటూ ఉంటాడు అని.  కొందరు ఈ విషయంలో తండ్రులను చులకన చేయడం, జోకులు వేయడం కూడా చేస్తారు.  అయితే తండ్రి ఇలా కేవలం వినడం వల్ల తల్లిదండ్రుల మద్య రెలేషన్ ఎంత ఆరోగ్యకరంగా ఉందో అర్థమవుతుంది. కొన్నిసార్లు తండ్రి చెప్పే మాటను తల్లి, తల్లి చెప్పే మాటలను తండ్రి ఓపికగా వినడం చూసి  పిల్లలు కూడా వినడాన్ని అలవాటు చేసుకుంటారు.   ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు వినడం అనే లక్షణం పిల్లలను కూడా గొప్పగా తయారుచేస్తుంది. రోల్ మోడల్.. చాలామంది తల్లిదండ్రులను, తమ అవ్వ తాతలను తమ రోల్ మోడల్స్  అని పేర్కొంటూ ఉంటారు. నిజానికి ప్రతి పిల్లవాడికి తన తండ్రి రోల్ మోడల్ గా ఉండాలి. తండ్రి కుటుంబం బాధ్యత తీసుకుంటాడు. ఎవరికి ఏం కావాలన్నా చూసుకుంటాడు.  ఎవరికీ ఏ లోటు రాకుండా జాగ్రత్త పడతాడు. ఆర్ఠిక విషయాల నుండి సాధారణ సమస్యల వరకు ప్రతి దాన్ని తండ్రి ఎంతో  ఓపికగా డీల్ చేస్తాడు. అన్నింటినీ హ్యాండిల్ చేస్తాడు కాబట్టే తండ్రి కొడుకు దృష్టిలో రోల్ మోడల్ గా ఉంటాడు. నిస్వార్థం.. ప్రతి తండ్రి తన పిల్లలు గొప్పగా ఉండాలని ఆశ పడతాడు.  చదువు చెప్పించడం నుండి,  పిల్లల  అవసరాలు తీర్చడం వరకు అన్ని విషయాలలో తనకంటే తన పిల్లలు ఎక్కువ సుఖపడాలని అనుకుంటాడు.  కొన్ని సార్లు పిల్లల సంతోషం కోసం డబ్బు కూడా లెక్క చేయడు. తనకు ఏమీ లేకపోయినా భార్య, పిల్లలను సంతోష పెడితే చాలని అనుకుంటాడు. కుటుంబం విషయంలో నిస్వార్థంగా ఉండేది నాన్న మాత్రమే. ఈ లక్షణాన్ని  పిల్లలు తండ్రి నుండే స్పష్టంగా గ్రహించి అలవాటు చేసుకోగలరు. చేయడం, నేర్చుకోవడం.. ఒక మగాడు తన పిల్లల కోసం తనకు తెలియని పనిని కూడా చేయడానికి సిద్దపడతాడు. పనిని చేస్తూ నేర్చుకోవచ్చనే గుండె ధైర్యం,  ఆత్మవిశ్వాసం కేవలం తండ్రికి మాత్రమే ఉంటుంది. ఆ తండ్రి మనసులో కేవలం తన పిల్లలు, భార్యకు లోటు రాకూడదనే ఆరాటం తప్ప తను చేస్తున్నది ఎంత కష్టమైన పని అనే ఆలోచన అస్సలు ఉండదు. ప్రతి పిల్లవాడు తండ్రి నుండి ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది వారిని జీవితంలో ఏ పనిని అయినా ధైర్యంగా చేసేందుకు సహాయపడుతుంది.                                        *రూపశ్రీ.  
నేటి ఇంటర్నెట్ యుగంలో పిల్లల నుండి పెద్ద వారి వరకు ఫోన్ లేకపోయినా, నెట్ కనెక్షన్ లేకపోయినా ఒక్క నిముషం కూడా ఉండలేని స్థితికి దిగజారిపోయారు. ఫోన్ లేకపోతే పిల్లలు అన్నం తినరు, హోం వర్క్ చెయ్యరు,  చివరకు అల్లరి చేయకుండా నిద్రపోవడానికి సిద్దం కారు.   ఇక పెద్దలు అయితే సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యి ఫేస్ బుక్, యూట్యూబ్ లో గంటలు గంటలు కాలక్షేపం చేస్తుంటారు. ఇది చాలామందిల వ్యసనంగా మారుతోంది.  ఎప్పుడూ పోన్ కు, ఇంటర్నెట్ కు అతుక్కుని ఉండేవారికి ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్ సమస్య ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపడం, బాధ్యతలను విస్మరించడం, జీవితం మీద సీరియస్ నెస్ లేకపోవడం,  జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి బదులు వాటి నుండి తప్పించుకోవడం వంటివి చేస్తున్నారు.  ఈ సమస్య నుండి బయట పడటానికి ఏం చేయాలో వైద్యులు ఏం చెప్పారో తెలుసుకుంటే.. సమస్యను గుర్తించాలి. ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్ఢర్ ని అధిగమించడంలో మొదటి దశ సమస్య ఉందని అర్థం చేసుకోవడం. మీ ఇంటర్నెట్ వినియోగ విధానాలను గమనించుకోవాలి.   ఇది  దైనందిన జీవితాన్ని, సంబంధాలను, పనితీరును  ప్రతికూలంగా  ఎలా ప్రభావితం చేస్తుందో లేదో అంచనా వేయండి. ఇంటర్నెట్ వినియోగం కోసం కొన్ని రూల్స్ ఏర్పాటుచేసుకోవాలి. ఇంటర్నెట్‌ని ఉపయోగించడం కోసం రోజులో నిర్దిష్ట సమయాలను కేటాయించుకోవాలి.  ఈ పరిమితులకు కట్టుబడి ఉండాలి. ఆన్‌లైన్‌లో  గడిపే  సమయాన్ని ట్రాక్ చేయాలి. దాన్ని నియంత్రించడంలో  సహాయపడే స్మార్ట్‌ఫోన్ యాప్‌లు లేదా బ్రౌజర్ లను ఉపయోగించాలి. ఇంటర్నెట్‌తో సంబంధం లేని హాబీలు,  కార్యకలాపాలను ఎంచుకోవాలి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, తోటపని చేయడం లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులను  కలుసుకోవడం, వారితో మాట్లాడటం వంటివి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇవి ఆలోమేటిక్ గా  ఆన్‌లైన్‌లో ఉండాలనే ప్రలోభాన్ని తగ్గేలా చేస్తాయి. ఆన్లైన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి  స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా థెరపిస్ట్‌ను సంప్రదించండి. వారి సపోర్ట్ తీసుకోవాలి.  ఇంటర్నెట్ వినియోగం గురించి  ఆందోళనలను,  అది  జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చర్చించాలి. కొన్నిసార్లు, ఎవరితోనైనా మాట్లాడటం వలన  సమయాన్ని ఆన్‌లైన్‌లో సమయాన్ని  సమర్థవంతంగా నిర్వహించడానికి,  కొత్త దృక్కోణాలు,  వ్యూహాలను అమలుచేయడానికి మార్గాలు దొరికే అవకాశం ఉంటుంది. పని లేదా ఏదైనా పరిశోదించడం, విశ్రాంతి, వ్యాయామం, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. టీవి, ఫోన్, సిస్టమ్ మొదలైనవాటి  నుండి రెగ్యులర్ బ్రేక్‌ తీసుకోవాలి.   ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ వ్యాయామాలు వంటి స్వీయ-సంరక్షణ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి.                                                       *రూపశ్రీ.
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు.  ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు . ఆరోగ్యం బాగుండటం కోసం చాలామంది ఉదయాన్ని ఒక మంచి ఆహారపు అలవాటుతో ప్రారంభిస్తారు. కొందరు నిమ్మరసం, తేనె తాగుతారు. మరికొందరు గ్రీన్ టీ తాగుతారు. ఇంకొందరు  ఇతర ఆరోగ్యకర ఎంపికల వైపు వెళతారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో  గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుని తాగడం చాలా అధ్బుతాలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  గోరు వెచ్చని నీటిలో నెయ్యి వేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. నెయ్యి నీరు  ఎలా తయారుచేసుకోవాలి అంటే.. స్వచ్చమైన ఆవు నెయ్యిని కొద్దిగా వేడి చేయాలి.   ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ప్రయోజనాలేంటంటే.. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.  సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు నెయ్యిలో ఉన్నాయి. ఇవి చర్మాన్ని మృదువుగా,  మెరిసేలా చేస్తాయి. ఆవు నెయ్యి ఫ్రీ సెల్స్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.  ఈ కారణంగా ఇది  ధమనులు గట్టిపడకుండా చేస్తుంది. నెయ్యి మెదడును లోపల నుండి బలోపేతం చేయడంలో,  జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మార్కెట్లో దొరికే నెయ్యి కంటే ఇంట్లో తయారుచేసుకుని లేదా ఇంట్లోనే తయారుచేసి అమ్మేవారి దగ్గర నెయ్యి కొనుక్కుని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.  దేశీ నెయ్యి వాడటం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. నీళ్లలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. నెయ్యి  ఎముకలను బలోపేతం చేయడంలో,  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.  పేగు ఆరోగ్యానికి కూడా మంచిది. నెయ్యి శరీరంలో జీర్ణక్రియ ఎంజైమ్‌లను పెంచుతుంది.                                                  *రూపశ్రీ.
భారతీయులు చాలా వంటకాలలో ఎక్కువగా వినియోగించే పదార్థాలలో వెల్లుల్లి ఒకటి.  ప్రతి వంటిట్లో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది.  వెల్లుల్లి వంటకు రుచిని, సువాసనను మాత్రమే కాదు..  ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది.  రోగనిరోధక శక్తి పెరగాలంటే వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే అద్భుత లాభాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. వెల్లుల్లిలో కార్బోహైడ్రేట్లు, కాపర్, ఫాస్పరస్, డైటరీ ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, బి6, మాంగనీస్, క్యాల్షియం, సెలీనియం, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్‌లను తొలగించడంలో వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది.  దీన్ని ఒక్కటి తింటే చాలు రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి తినడం వల్ల  గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోధిస్తుంది. ఇది గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. జీర్ణ  సమస్యలు పరిష్కారం అవుతాయి.  ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నందువల్ల  జీర్ణశయాంతర వ్యాధులను తగ్గిస్తుంది. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులోని నులిపురుగులు మూత్రం, మలం సహాయంతో బయటకు వెళ్లిపోతాయి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే.. ఇది చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.  పేగులోని మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుంది. పచ్చి వెల్లుల్లి రోజూ తినడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు  కూడా ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. వెల్లుల్లి  ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (GERD)తో బాధపడుతున్న వ్యక్తులకు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి వైద్యుల సలహా లేకుండా జీర్ణ సమస్యలు, ప్రేగు వ్యాధులు ఉన్నవారు తినకూడదు. వెల్లుల్లిలో ఫ్రక్టాన్‌లు ఉంటాయి. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్, ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారిలో  గ్యాస్,  ఉబ్బరం  సమస్యలు కలిగిస్తుంది.                                              *రూపశ్రీ.  
దోసకాయ చాలామందికి ఇష్టమైన కూరగాయ. దీన్ని నేరుగా తినేసేవారు కొందరైతే..  ఉప్పు కారం చల్లుకుని,  కాస్త మసాలా జోడించి స్పైసీగా తినేవారు మరికొందరు. జ్యూస్ చేసుకుని తాగేవారు ఇంకొందరు.  చాలామంది ఆరోగ్య స్పృహతో డిటాక్స్ వాటర్ తయారుచేసుకుని తాగుతుంటారు. అందులో తప్పనిసరిగా కీరదోసకాయను చేర్చుతారు. అటు నోటికి రుచిని ఇస్తూ, ఇటు ఆకలి తీరుస్తూ.. మొత్తం మీద బరువు తగ్గడంలో మ్యాజిక్ చేసే కీర దోసకాయను నీటిలో వేసి ఆ తరువాత  ఆ నీటిని తాగడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని డైటీషియన్లు అంటున్నారు. ఇంతకీ ఈ కీర దోసకాయ కథ ఏంటో పూర్తీగా తెలుసుకుంటే.. కీర దోసకాయ కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని చాలా బాగా చల్లబరుస్తుంది. శరీరంలో తేమ శాతాన్ని నిలిపి ఉంచుతుంది. అయితే కీర దోసకాయను ముక్కలుగా చేసి దాదాపు లీటరుకు పైగా నీటిలో వేయాలి. ఈ నీరు ఇంకా బాగా రుచిగా ఉండటం కోసం ఇందులో పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, అల్లం వేసుకోవచ్చు.  ఒక జార్ లో ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి.  దీన్ని 1-2  గంటల పాటూ అలాగే కదపకుండా ఉంచాలి.  ఆ తరువాత ఈ నీటిని తాగవచ్చు. లాభాలేంటంటే.. చర్మం పొడిబారడం, శరీరంలో మంట,  మైకము వంటివి శరీరంలో నీటి కొరత ఏర్పడటం వల్ల సంభవించే సమస్యలు. ఈ దుష్ప్రభావాలను తగ్గించడానికి సాధారణ సమయాల్లో అయినా,  వేసవి వేడి సమయంలో అయినా ఈ నీటిని తీసుకోవడం ఉత్తమం.  దోసకాయ నీటిలో జోడించే ఇతర పదార్థాల వల్ల  ఇది  అదనపు రుచితో ఉల్లాసంగా ఉంచుతుంది. దోసకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది.  శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. కీర దోస నీటిలో ఉండే  ఫైబర్‌లు,  ఎంజైమ్ ల  కారణంగా చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఇది సెల్యులార్ స్థాయిలో చర్మం  పొరలను క్లియర్ చేస్తుంది. చర్మాన్ని  మెరుగుపరుస్తుంది. దోసకాయల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ,  విటమిన్ కె ఉంటాయి. ఇవన్నీ సహజ యాంటీఆక్సిడెంట్లు. కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా ఇవి సహాయపడతాయి. దోసకాయలో చక్కెరలు తక్కువగా ఉంటాయి. ఇది  బరువు పెరగడానికి దోహదం చేయదు. పైపెచ్చు వాటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది,  అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.                                     *రూపశ్రీ.