LATEST NEWS
పొలిటికల్ ఫ్లెక్సీల సంస్కృతి,  సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్య ప్రజలను, వ్యవస్థలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం తగదంటూ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు శ్రుతిమించుతున్నాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా?  అంటూ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండకూడదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయంటూ హైకోర్టు మండిపడింది. గతంలో న్యాయమూర్తులను సైతం లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తూ, అప్పట్లోనే కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అభిప్రాయపడింది. ఒకసారి అరెస్టయిన వారు  మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తున్నారంటే లోపం ఎక్కడుందో ఆలోచించాలని సూచించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తిని దూషించడం అంటే, ఆ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఎవరి కుటుంబ గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని, రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని హితవు పలికింది. కేవలం అధికారం కోసం లేదా రాజకీయ కక్ష సాధింపునకు ఇలాంటి అరాచక సంస్కృతిని ప్రోత్సహించడం సరికాదని హైకోర్టు విస్పష్టంగా పేర్కొంది.  భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది.
సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత  బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. మీడియా సమావేశంలోనే వెక్కివెక్కి ఏడ్చారు.  తెలుగుదేశం  నాయకుల తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన విమర్శల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.   వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆనాడు తానే స్వయంగా జగన్ పక్కన ఉండి, ఆయనను ఓదార్చానని చెబుతూ బొత్స కన్నీరుమున్నీరయ్యారు. అచ్చెన్నాయుడు తనపై చేసిన అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న సంతకాల వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని బొత్స ఈ సందర్భంగా చెప్పారు. ఈ సంగతి   రఘువీరారెడ్డి,  కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలకు  తెలుసన్నారు. అచ్చెన్నాయుడు కేవలం తన పదవిని కాపాడుకోవడానికే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ఆర్ గురించి అనుచితంగా మాట్లాడటం వల్లే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆయన వివరించారు.   
మాజీ మంత్రి టీఅ. జీవన్ రెడ్డి  బీఅర్ఎస్ గూటికి చేరారు. తన నివాసంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.     కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు.  2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.   కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగిత్యాలకు తొలి పర్యటన సందర్భంగా బోర్నపల్లి వంతెన అంశంపై జీవన్ రెడ్డి చేసిన వినతి వెంటనే ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే చక్కెర కర్మాగారం అంశంపై జీవన్ రెడ్డి పోరాటం చేసిన సందర్భాన్ని కూడా  ప్రస్తావించారు. జీవన్ రెడ్డి వంటి నాయకుడి చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.   కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలనే ఆలోచనే  తనకు ఆనందాన్నిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు.  కేసీఆర్‌ను కలిసి తన రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానన్నారు.   
ALSO ON TELUGUONE N E W S
    సినిమా పేరు: డెకాయిట్  న‌టీన‌టులు:  అడివిశేష్ , మృణాల్ ఠాకూర్, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల తదితరులు  సినిమాటోగ్ర‌ఫీ: ధనుష్ భాస్కర్  ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్  మ్యూజిక్: భీమ్స్  నిర్మాత‌: సుప్రియ యార్లగడ్డ  సహా నిర్మాత: సునీల్ నారంగ్  బ్యానర్స్: ఎస్ ఎస్ క్రియేషన్స్ , సునీల్ నారంగ్ ప్రొడక్షన్  రచన,దర్శకత్వం: షానియెల్ డియో  రిలీజ్ డేట్ : ఏప్రిల్ 10 , 2026  అడివి శేష్(Adavi Sesh),మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) 'డెకాయిట్'(Dacoit) తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాలని ఎంత ఆత్రుతతో ఎదురుచూసారో, అభిమానులు, మూవీ లవర్స్ అంతకు వంద రేట్లు ఆత్రుతతో ఎదురుచూసారు. ప్రచార చిత్రాలతో వచ్చిన క్రేజ్ అలాంటిది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ హరి(అడివి శేష్), సరస్వతి(మృణాల్ ఠాకూర్) ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ సరస్వతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక పాపకి కూడా జన్మనిస్తుంది. హరి 10 సంవత్సరాలపై నుంచే ఖైదీగా జైలులో ఉంటు తప్పించుకొని బయటకి వస్తాడు.సరస్వతి, హరి కలిసి కరుణ హాస్పిటల్ కి సంబంధించిన డబ్బుని దొంగతనం చేయాలనీ నిర్ణయించుకుంటారు.ప్రేమించుకున్న ఆ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు? హరి ఎందుకు జైలు పాలయ్యాడు? అందుకు కారణం ఎవరు? జైలు నుంచి తప్పించుకోవడానికి కారణం ఏంటి? సరస్వతి, హరి కలిసి డబ్బు ఎందుకు దొంగతనం చేయాలనుకున్నారు? రాంబాబు(అనురాగ్ కశ్యప్), సోమనాధ్ రెడ్డి(ప్రకాష్ రాజ్), మల్లి(కామాక్షి బాసర్ల)ల క్యారెక్టర్స్ ఏంటి? అసలు డెకాయిట్ లో దాగి ఉన్న అసలు కథ ఏంటి అనేదే ఈ చిత్రం. ఎనాలసిస్  అదిరిపోయే మాస్‌ టైటిల్ తో వచ్చినా దానికి తగ్గట్టు అడివి శేష్ మాస్‌ అప్పీరియన్స్‌ ఇచ్చినా అంతా ఆర్టిఫిషియల్‌గా ఉంది. స్టార్‌ హీరోలా బిహేవ్‌ చేశాడేగానీ.. క్యారెక్టర్‌లోకి వెళ్లలేకపోయాడు ముందుగా అనుకున్న శృతిహాసన్‌పై కొన్ని సీన్స్‌ తెరకెక్కించి ఆమెని మార్చడమే కాకుండా, మూవీ సెట్స్‌పై ఉండగానే  కథని చాలాసార్లు మార్చినట్టున్నారు. ఆ విషయం అర్ధమవుతుంది. అంతలా కథ అతుకుల బొంతగా వుంది. హాస్పిటల్ సీన్స్ లో నాచురాలిటీ లేదు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మొదటి పావు గంటలోనే టాక్ విషయంలో డెకాయిట్ కి అన్యాయం జరుగుతుందా అనిపిస్తుంది. అంతలా సీన్స్ వర్క్ అవుట్ కాలేదు. హరి, సరస్వతి మధ్య లవ్ సీన్స్ కూడా అంతే. జైలు నుంచి పారిపోయే క్రమంలో తాను చనిపోయినట్టుగా హరి చాలా ఈజీగా క్రియేట్ చేయచ్చు. కానీ పోలీసుల చూస్తుండగా పారిపోవడం అనేది వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత సరస్వతి విషయంలో హరి తీసుకున్న కీలక నిర్ణయంతో మంచి ఎగ్జైట్ మెంట్ కి లోనవుతాం. కానీ ఆ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ లోకి వెళ్లే కొద్దీ క్యూరియాసిటీ అనేది పండలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అంతే కిక్ ని ఇచ్చింది లేదు.  సెకండ్ హాఫ్ చూసుకుంటే కథ ఏ విధంగా జరగబోతుందో ముందుగానే ఊహించుకుంటాం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చెప్పే విధానం బాగున్నా గందరగోళంగా తీర్చిద్దిదారు. సరస్వతిలో దాగి ఉన్న అసలు విషయం బాగానే ఉండటంతో పాటు ప్రీ క్లైమాక్స్,  క్లైమాక్స్ బాగుంది. ఇక లాంగ్వేజ్ పరంగా యాసని డిఫరెంట్‌గా ట్రై చేయడంతో చాలా డైలాగ్స్‌ అర్థం కాలేదు. అసలు స్పష్టత కూడా లేదు. మేకర్స్ ఈ విషయంపై ఎందుకు దృష్టి సారించలేదో అర్ధం కాదు. లాజిక్‌ లేని సీన్స్‌ని ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఒకవైపు ఆపద తరుముకొస్తుంటే చర్చలు పెడతారు. మాట్లాడుకునేంత టైం లేకపోయినా.. తెగ మాట్లాడేసుకుంటారు. వాళ్లేమిటో..వాళ్ల విధానాలేమిటో అర్థం కాదు. శేషు, మృణాల్‌ మధ్య కెమిస్ట్రీనే కాదు.. ఎమోషన్‌ పండలేదు. మృణాల్‌ యాక్టింగ్‌ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐటంసాంగ్‌ మినహా భీమ్స్‌ సిసిరోలియో క్యాచీ ట్యూన్‌ ఒక్కటీ ఇవ్వలేకపోయాడు. కెమెరామేన్‌ షానిల్‌ డియో  డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. అడవి శేషు సినిమాలకు డైరెక్టర్‌తో పని లేదు. కథ, స్క్రీన్‌ప్లే అన్నీ తానై చూసుకుని హిట్‌ చేసుకునే అడవి శేషు ఈసారి తడబడ్డాడు.   నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు హరిగా అడివి శేష్ తన క్యారక్టర్ లో పర్లేదు. కారణాలు తెలియదు గాని అడివి శేష్ కనపడ్డాడు తప్ప హరి కనపడలేదు. మృణాల్ ఠాకూర్ అయితే ఒక రేంజ్ లో విజృంభించి నటించింది. అంత అందంగా ఎలా యాక్ట్ చేస్తుంది, మనం కూడా తన లాగా హీరోయిన్ అవ్వాలంటే ఎలా అని అమ్మాయిలు ఆలోచించేలా పెర్ఫార్మ్ చేసింది. అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, కామాక్షి బాసర్ల  తమ క్యారెక్టర్స్ కి నిండు తనాన్ని తెచ్చారు.  పైన మనం చెప్పుకున్నట్టే భీమ్స్‌ నుంచి ఆశించినంత సాంగ్స్ రాలేదు. ధనుష్ భాస్కర్ ఫొటోగ్రఫీ, బిజిఏం ఒక రేంజ్ లో ఉండి డెకాయిట్ కి న్యాయం చేసారు. నిర్మాణ విలువలుసూపర్ . అబ్బూరి రవి నుంచి డైలాగ్స్ బాగాలేదు. షానియెల్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఒక్కో సీన్ ని అద్భుతమైన టేకింగ్ తో హాలీవుడ్ స్టైల్లో తీర్చిదిద్దాడు. కానీ రచయితగా డెకాయిట్ కి తీరని అన్యాయం చేసాడు.  బలాలు 1 . అడివి శేష్, మృణాల్ పెర్ ఫార్మెన్స్  2 . ఆ ఇద్దరు కలిసి దొంగతనం చేయాలనుకునే పాయింట్ 3 .ఫొటోగ్రఫీ   4 .క్లైమాక్స్     బలహీనతలు  1 .కథ 2 .ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో సాగతీతగా నడిచే కథనం 3 . డైలాగ్స్  4 . లాజిక్ లేని సీన్స్  5 . ఏ క్యారక్టర్ కి సరైన జస్టిఫై ఇవ్వకపోవడం    చివరిగా చెప్పుకోవాలంటే డెకాయిట్ లాంటి పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసి త్యాగాల ప్రేమికుడిని చూపించారు. మృణాల్ పెర్ఫార్మ్ హైలెట్. రేటింగ్ 2 .25 /5                                                                                                                       అరుణాచలం   
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నిర్మాతగా మారి, క ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli TV). మునిరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఒక టీవీ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఈ సినిమా ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే వింటేజ్ డ్రామాగా కనిపిస్తోంది. ఊర్లోకి మొదటిసారి 'టీవీ' రావడం, ఆ టీవీ చుట్టూ జరిగే రాజకీయం, పంతాలు, వినోదాన్ని ఇందులో చూపించారు. ట్రైలర్ ప్రారంభం నుంచే పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే వైషమ్యాలను చాలా నేచురల్ గా చూపించారు. ఊరి జనం అంతా చందాలు వేసుకుని శివరాత్రి పండుగ కోసం సతీష్ అనే వ్యక్తి ద్వారా ఊరికి టీవీని తెప్పిస్తారు. ఆ టీవీలో ఏ సినిమా చూడాలి అనే దానిపై ఊరి జనాల మధ్య జరిగే సరదా సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఊరి పెద్దగా చలామణి అయ్యే రాజప్ప.. సతీష్ టీవీ తీసుకురావడాన్ని తన గౌరవానికి భంగంగా భావిస్తాడు. "ఊర్లో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని" అనే ఇగో అతని పాత్రలో కనిపిస్తుంది. టీవీ రాకతో ఊర్లో మనుషుల మధ్య గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా సాయి తేజ్, వేధ జలంధర్, వి. మునిరాజు పోషించిన పాత్రల మధ్య సాగే డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. “వచ్చే శివరాత్రి లోపల టీవీకి సంబంధించిన వాళ్ళని తెచ్చి పంచాయతీ పెట్టకపోతే.. ఒంటి మీద నూలుపోగు లేకుండా తిరుగుతా” అంటూ సాగే డైలాగ్స్ సినిమాలోని ఘర్షణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.  ట్రైలర్ లో గమనిస్తే, తిమ్మరాజుపల్లి అనే ఊరికి టీవీ రావడం అనేది ఒక పెద్ద సెలబ్రేషన్ లా చూపించారు. అయితే, అదే టీవీ వల్ల ఊరి పెద్దలకు, హీరోకి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? రాజప్ప అనే పాత్రతో హీరోకి ఉన్న వైరం ఏమిటి? అనే విషయాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఒక సాధారణ టీవీ మనుషుల మధ్య ఎలా చిచ్చు పెట్టింది అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సాయి తేజ్ పల్లెటూరి యువకుడిగా సహజంగా కనిపిస్తున్నాడు. ట్రైలర్‌లో విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ట్రైలర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది.  మొత్తానికి, ఒక చిన్న పల్లెటూరిలో టీవీ ఎంతటి మార్పులు తెచ్చింది, అది ఆ ఊరి మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అనే పాయింట్‌తో ఈ సినిమా ఆసక్తికరంగా సాగనుంది.  
టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో, థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ సెట్ చేసుకున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 10న ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో, అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘గూఢచారి 2’ (G2) గురించి మరియు తనకు వస్తున్న బాలీవుడ్ ఆఫర్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ‘గూఢచారి 2’ సినిమా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై అడివి శేష్ స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా బ్యాలెన్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే ఈ ఏడాది చివరలో మాత్రమే ‘G2’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని శేష్ స్పష్టం చేశారు. ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శేష్‌కు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఏకంగా ఆరు పెద్ద ప్రాజెక్టులు ఆయన వద్దకు వచ్చాయట. ఇందులో నాలుగు వార్ సినిమాలు, రెండు బయోపిక్‌లు ఉన్నాయి. కానీ, శేష్ ఈ ఆఫర్లన్నింటినీ సున్నితంగా తిరస్కరించారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం అవ్వడం తనకు ఇష్టం లేదని, ముఖ్యంగా ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించిన తర్వాత మళ్లీ అటువంటి బయోపిక్‌లు లేదా యుద్ధ సినిమాలు చేయాలని అనిపించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి తన పూర్తి ఫోకస్ అంతా ‘G2’ పైనే ఉందని, ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త యాక్షన్ అనుభూతిని ఇస్తుందని శేష్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్ 2’ వంటి సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు ‘డెకాయిట్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ అడివి శేష్ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం అవకాశాల కోసం కాకుండా, వైవిధ్యమైన కథల కోసం ఎదురుచూడటం గొప్ప విషయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న ‘డెకాయిట్’ ఫలితం ఎలా ఉండబోతుందో, అలాగే ఈ ఏడాది చివరలో రానున్న ‘G2’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. 
The ongoing dispute between actor Silambarasan and producer Isari Ganesh has finally reached an amicable resolution. The issue, which had halted the progress of his upcoming film Arasan and his ad film shoots, was settled after the actor's parents, T. Rajender and Usha Rajender, held direct discussions with the producer.  To clear the roadblocks, a total compensation of ₹6.5 crores was agreed upon. Simbu will pay ₹4 crores towards the settlement, while Arasan producer Thanu will cover the remaining ₹2.5 crores. With this major hurdle cleared, Simbu is ready to resume his work without further delays. He will first complete his pending commitments for an ad film. Following that, he will return to the sets of Arasan. Director Vetrimaaran has planned long, continuous schedules to wrap up the project quickly, aligning with Simbu's goal to have at least two theatrical releases next year. Simbu will start his next film with director Aswath Marimuthu, known for Oh My Kadavule and Dragon, post Arasan. The director has already completed the script, and shooting is expected to begin around August or September this year, bringing the recent roadblocks to a definitive end.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -రీసెంట్ గా ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్లిన పవన్  -సుదీర్ఘ ప్రసంగం  -అర్హత లేదనే అవసరం ఎందుకొచ్చింది రావడం లేట్ అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అని పవర్ స్టార్, డిప్యూటీ సిఏం  చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్(Pawan Kalyan)న్యూస్ సోషల్ మీడియాలో సందడి చేయడానికి రావడం లేట్ అవ్వచ్చేమో గాని వచ్చాక దాని తీవ్రత ఎలా ఉంటుందో అందరకి బాగా తెలుసు. మరి లేటు చెయ్యకుండా ఆ సందడి చేస్తున్న న్యూస్ ఏంటో చూద్దాం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నంలో జరిగిన మెగా కల్చరల్ ఫీస్ట్ కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రసంగిస్తు యూనివర్సిటీలోకి రావడానికి అర్హత లేదు. ఎందుకంటే మేధస్సుతో నేను పోటీ పడలేను. మనుషులని కదిలించేది సమాజాన్ని ముందుకు నడిపించేది యూనివర్సిటీలే. అలాంటి మహానుభావులు  వ్యవస్థని ప్రతిష్ఠించిన వ్యవస్థకి అతిధిగా రావడానికి అర్హత ఉందా అనిపిస్తుంది. కానీ మీరు ప్రేమతో పిలిస్తే వచ్చానని చెప్పాడు. ఇప్పుడు  పవన్ తాలూకు స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. also read: Rajasekhar: ఎమోషనల్ తో కన్నీళ్లు పెట్టుకున్న రాజశేఖర్ అభిమానులు స్పందిస్తు జ్ఞానం ముమ్మాటికి గొప్పదే. కానీ ఎలాంటి కల్మషం లేని మంచి మనసు అంతకంటే గొప్పది. ఆ మంచి మనసే మంచి సమాజానికి బీజం ఇస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు       
- భారీ ఖర్చుకు వెనుకాడుతున్న నాగ‌వంశీ - యానిమేషన్ సినిమాకి ఓటీటీ షాక్..  - నాగవంశీ ఆలోచన ఇదేనా! టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులకు కొదవలేదు. ముఖ్యంగా సోషియో ఫాంటసీ, మైథాలజీ అంశాలతో కూడిన సినిమాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్‌తో సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి, హనుమంతుడి ఇతివృత్తంతో 'వాయుపుత్ర' అనే యానిమేషన్ చిత్రాన్ని ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు అనిశ్చితిలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వాయుపుత్ర సినిమాకు సంబంధించి బడ్జెట్ లెక్కలు నిర్మాతలకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయని తెలుస్తోంది. పూర్తి స్థాయి యానిమేషన్, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాలంటే దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇటీవలే యానిమేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని చిత్రాలు సక్సెస్ కావడంతో ఈ సినిమాపై మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే అంత భారీ మొత్తాన్ని వెచ్చించడం రిస్క్ అని భావిస్తున్నారట. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ విషయంలో చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో నిర్వహించిన చర్చల్లో కేవలం 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా మేకింగ్ ఖర్చులో ఇది సగం కూడా కాకపోవడంతో నిర్మాత నాగవంశీ డైలమాలో పడ్డారు. మిగిలిన భారీ మొత్తాన్ని కేవలం థియేట్రికల్ వసూళ్ల మీద నమ్ముకుని ఇన్వెస్ట్ చేయడం క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు చందూ మొండేటి గతంలో 'కార్తికేయ 2'తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో కృష్ణుడి తత్త్వాన్ని చూపించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే నమ్మకంతో హనుమంతుడిపై ఒక విజువల్ వండర్ చేయాలని ఆయన భావించారు. కానీ ఇప్పుడు బడ్జెట్ మరియు ఓటీటీ బిజినెస్ మధ్య సమతుల్యత కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టాలని (Hold) నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. సినిమా రంగంలో ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కంటెంట్ బాగుంటే ఆదరణ దక్కుతున్నప్పటికీ, యానిమేషన్ సినిమాలకు మార్కెట్ ఇంకా పూర్తి స్థాయిలో స్థిరపడలేదు. దీంతో ఇంత పెద్ద సాహసం చేయడం అవసరమా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేదా కేవలం వాయిదా మాత్రమే పడిందా అనే విషయంపై సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ అనగానే గుర్తొచ్చే పేర్లలో వి.వి. వినాయక్ (VV Vinayak) ముందు వరుసలో ఉంటారు. తాజాగా 'తెలుగువన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్ తన సినీ ప్రయాణం గురించి, ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీ ఈ స్థాయికి వెళ్తాడని తాను ఎప్పుడో ఊహించానని ఆయన చెప్పడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఠాగూర్ టైమ్ లోనే బన్నీని చూసి.. మెగాస్టార్ చిరంజీవితో తాను 'ఠాగూర్' సినిమా చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ ఇంకా హీరో కాలేదని గుర్తు చేసుకున్నారు. అప్పుడప్పుడే 'గంగోత్రి' సినిమా కోసం ప్రయత్నాలు మొదలయ్యాయని, అప్పుడు బన్నీ ఒక చిన్న పిల్లోడిలా ఉండేవాడని చెప్పారు. కానీ అప్పటికే బన్నీలో ఏదో సాధించాలనే తపన ఉండేదని, ఆ చిన్న వయసులోనే తన అబ్జర్వేషన్ బాగుండేదని వినాయక్ కొనియాడారు. ఇప్పుడు బన్నీ ఎదిగిన తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. బద్రీనాథ్ కలెక్షన్స్ పై క్లారిటీ అల్లు అర్జున్ తో వినాయక్ 'బన్నీ', 'బద్రీనాథ్' వంటి సినిమాలు చేశారు. అయితే 'బద్రీనాథ్' సినిమాపై ఉన్న కొన్ని విమర్శల గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. పక్కన ఉన్న పెద్ద సినిమాలతో కంపేర్ చేసినప్పుడు ఆ సినిమా రిజల్ట్ గురించి జనం ఏమైనా అనుకోవచ్చు కానీ, అప్పట్లో బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ రెవెన్యూ రాబట్టిన సినిమా అదేనని వినాయక్ స్పష్టం చేశారు. అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమందికి అలా అనిపించి ఉండొచ్చు కానీ, అది బాగా రెవెన్యూ చేసిందని ఆయన పేర్కొన్నారు. అపజయాలను తట్టుకోవడం కష్టమే.. సినిమా హిట్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తానో, ఫ్లాప్ అయితే అంతగా కుంగిపోతానని నిజాయితీగా వినాయక్ ఒప్పుకున్నారు. 'చెన్నకేశవరెడ్డి' విడుదలైనప్పుడు మొదటి మూడు నాలుగు రోజులు భోజనం కూడా చేయలేదని అన్నారు. ఆ తర్వాత సినిమా పుంజుకోవడంతో మళ్ళీ నార్మల్ అయ్యాయని తెలిపారు. అలాగే 'యోగి', 'అఖిల్', 'ఇంటెలిజెంట్' వంటి సినిమాల రిజల్ట్ కూడా తనను బాగా బాధించాయని, అపజయాలను హ్యాండిల్ చేయడం తనకు ఇప్పటికీ రాదని ఆయన అన్నారు. వినాయక్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతం వినాయక్ మళ్ళీ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నారు. రెండు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయని, కానీ తనను ఎగ్జైట్ చేసే పాయింట్ దొరికితేనే వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో 'యానిమల్', 'లోకా', 'లక్కీ భాస్కర్', 'ధురంధర్', 'పుష్ప' వంటి సినిమాలు తనను బాగా ఆకట్టుకున్నాయని వినాయక్ తెలిపారు.  వి.వి. వినాయక్ ఫుల్ ఇంటర్వ్యూ కోసం, మరిన్ని ఆసక్తికర సినిమా విశేషాల కోసం మా తెలుగువన్(TeluguOne) ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.  
Megastar Chiranjeevi is gearing up to set the screens on fire once again, as his highly anticipated reunion with director Bobby Kolli is officially locked for a grand muhurtham launch this Saturday, April 11th, in Hyderabad. Following the massive box office storm created by their previous collaboration, Waltair Veerayya, trade circles are understandably buzzing with immense expectations for #ChiruBobby2. Coming fresh off the phenomenal success of his recent Regional Industry Hit, Mana Shankara Vara Prasad Garu, Chiranjeevi seems completely ready to dive straight into a full-blown bloody actioner. As a die-hard fanboy, Bobby Kolli knows exactly how to tap into the Megastar’s unparalleled screen presence. The previously released concept poster heavily hinted that Bobby is designing one of the fiercest and most explosive mass avatars we have seen from the Boss in recent times. What elevates the sheer magnitude of this project is the backing of KVN Productions. Making a powerful entry into Telugu cinema, this ambitious banner is already known for mounting massive pan-India heavyweights like Toxic and Jananayagan.  Their track record guarantees that this high-octane entertainer will be crafted with zero compromises on quality or scale. With the regular shoot commencing shortly, we just have to wait a little longer for the complete cast and crew details to drop.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే... గొప్ప వ్యక్తులలో ఉండే అతిగొప్ప లక్షణం తక్కువ మాట్లాడటం.  తక్కువ మాట్లాడేవాడు తన చేతల్లోనే తన విజయాన్ని చూపిస్తాడు అని తరచుగా చెబుతూ ఉంటారు కూడా. ఇతరుల కంటే తక్కువ మాట్లాడేవారే ఎక్కువ తెలివైనవారని, జ్ఞానులని ఎందుకు అంటారు? తక్కువ మాట్లాడేవారు ఎందుకు ప్రత్యేకమైనవారిగా పరిగణించబడతారు? తక్కువ మాట్లాడటం అనేది గొప్ప లక్షణంగా ఎందుకు పరిగణించబడుతుంది? వివరంగా తెలుసుకుంటే.. తక్కువ మాట్లాడితే మాట విలువ పెరుగుతుంది.. ఎప్పుడూ  మాట్లాడుతూ ఉండే వ్యక్తులపై  చుట్టూ ఉన్నవారు  శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారట.చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి మాట్లాడినా కూడా ప్రజలు శ్రద్ధగా వింటారు. తక్కువ మాట్లాడటం వల్ల  వ్యక్తి మాటలకు విలువ పెరిగి, సమాజంలో వారికి మరింత గౌరవం లభిస్తుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఆలోచనా శక్తి.. తక్కువ మాట్లాడేవారు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు స్పందించడానికి తొందరపడరు.  ముందుగా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే  వారు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారని అందరూ ఒప్పుకునే విధంగా ఉంటాయి.   సమాజం కూడా ఇలా తక్కువ మాట్లాడే వారికి చాలా తెలివైన వారు అని చెబుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం..  తక్కువ మాట్లాడేవారు ఆర్భాటాలు చేయరు. వారికి తమపై పూర్తి విశ్వాసం ఉంటుంది, కాబట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి  పనికిమాలిన మాటలు మాట్లాడరు. ఇలా  నిశ్శబ్దంగా ఉండే స్వభావమే వారి నిజమైన బలం అవుతుందని చాణక్యుడు అంటాడు.  తక్కువ మాట్లాడినప్పుడు వారిలో ఎన్నో విషయాలు వారిలోనే రహస్యంగా ఉండిపోతాయి. అదే ఎప్పుడూ మాట్లాడేవారు ఏ చిన్న సంఘటన జరిగినా బయటకు చెప్పేసుకుంటారు. దీని వల్ల వారికి విలువ, గౌరవం తగ్గిపోతుంది. అర్థం చేసుకునే అవకాశం.. తక్కువ మాట్లాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  ఇతరుల మాటలను వినడానికి  అవకాశం లభించడం. ఇతరులు చెప్పేది బాగా వినగలిగే వ్యక్తి మాత్రమే  ఇతరుల బలహీనతలను, అవసరాలను అర్థం చేసుకోగలరని చాణక్యుడు చెబుతాడు. మౌనంగా ఉండి ఇతరుల మాటలను విన్నప్పుడు, వారి ఆలోచనలపై  ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడానికి,  విజయం సాధించడానికి అత్యంత కీలకం అవుతుంది.                                 *రూపశ్రీ.
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు. అయితే మనిషి తన స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెడుతూ, ఇతరులకు నష్టం కలిగిస్తూ, ఇతరుల జీవితాలు నాశనం అవుతున్నా తనకు అది అనవసరం అనుకునే స్థాయిలో కొందరు ఉంటారు. వారికి కేవలం తమ క్షేమం, తమ సంతోషం మాత్రం ముఖ్యం.  అలాంటి వారిని సింపుల్ గా అవకాశవాదులు అని కూడా అంటారు. కానీ ఇలాంటి వారు తమలో ఉన్న స్వార్థం, అవకాశవాదం బయటకు కనిపించకుండా మంచితనం అనే ముసుగు వేసుకుని ఉంటారు. అలాంటి వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం.  మంచితనం ముసుగు ధరించిన చెడ్డ వ్యక్తులలో కనిపించే కొన్న లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. వారిని గుర్తించి జాగ్రత్త పడవచ్చు.. మంచితనం ముసుగు వేసుకున్న వ్యక్తుల లక్షణాలు.. కొంతమంది ప్రతి విషయంలో ఇతరులను విమర్శిస్తూ, ఆలోచించకుండానే తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. వారి మాటలు కొన్నిసార్లు ఎంత కఠినంగా ఉంటాయంటే, అవి ఎదుటివారి మనసును గాయపరుస్తాయి. తమ తప్పులను ఒప్పుకోకుండా, ఇతరులను నిందించే వారు ఉంటారు. తాము చెప్పిందే సరైనదని నిరూపించుకోవడమే వారికి ముఖ్యం. ఇతరులను,  ఇతరుల అభిప్రాయాలను  గౌరవించరు,  వాటిని పట్టించుకోరు. వారి ప్రవర్తన కేవలం వారి ప్రాధాన్యత, వారికి నచ్చిన విషయాలే అయి ఉండాలని అనుకుంటారు. కృతజ్ఞత అనేది వీరిలో కొంచెమైనా ఉండదు.  ఎప్పుడూ ప్రతికూలతపైనే దృష్టి పెడతారు. ఏ విషయంలో అయినా సరే.. మంచిని చూడటం కంటే ఫిర్యాదు చేయడానికి,  నెగెటివ్ గా మాట్లాడటానికి ఇష్టపడతారు. మంచితనం అనే ముసుగు వేసుకున్నవారు ఎవరికీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోరు.  మాట దాటేస్తుంటారు. అవకాశం కోసం మాటలు ఇవ్వడం తర్వాత మాట తప్పడం వీరి దృష్టిలో అస్సలు తప్పు కాదు.  ఒకవేళ తప్పిన మాట గురించి మాట్లాడితే ఎదురుదాడి చేసి మాట్లాడతారు. సరదా లేదా ఫన్ పేరుతో ఇతరులను ఎగతాళి చేయడం, కించపరిచి మాట్లాడటం వీరి గుణం. ఇలాంటివి పదే పదే చేస్తూ ఉంటే.. వారు మంచితనం ముసుగు వేసుకున్న చెడ్డ వ్యక్తుని అర్థం చేసుకోవచ్చు. తాము ఇతరుల కన్నా గొప్ప అని  భావించుకుంటూ, తమ ఆధిక్యతను నిరూపించుకోవడానికి  ప్రయత్నిస్తుంటారు. పైగా ఇతరులను తక్కువగా అంచనా వేస్తారు. తక్కువ చేసి మాట్లాడతారు.  పాత పగలను మనసులో పెట్టుకుంటారు, ఎవ్వరినీ క్షమించరు.  చిన్న చిన్న తప్పులను కూడా చాలా కాలం గుర్తుంచుకుంటారు. గాసిప్స్ చెప్పుకోవడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ చేరవేడం,  అందరి దృష్టిలో ఇతరులను చెడ్డ చేయడం అంటే వీరికి చాలా సంతోషం కలిగించే విషయం. చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు.  ఇలాంటి అబద్దాలు విని విని అవి సహజం అనుకునే వారు ఏదో ఒకరోజు వీరి ద్వారా చాలా పెద్ద మోసాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది క్రమంగా సంబంధాలలో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.                                *రూపశ్రీ.
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగమని కూడా సిఫార్సు చేస్తారు. కొందరు ఆరోగ్యానికి కొబ్బరి నీరు బెటర్ అని చెబితే.. మరికొందరు మజ్జిగ చాలా మంచిది అంటారు.  ఈ రెండూ ఆరోగ్యకరమైనవే.. అయినప్పటికీ రెండింటిలో కూడా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయం దగ్గర చాలా మంది కన్ప్యూజ్ అవుతుంటారు.  కొబ్బరి నీరు,  మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే డ్రింక్ ఏంటో తెలుసుకుంటే.. కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం , సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం నివారించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది.  తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది.  అధికంగా చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయబడుతుంది. మజ్జిగ.. మజ్జిగలో జీర్ణవ్యవస్థను బలపరిచే ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. మజ్జిగ తాగడం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ ,  ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ తాగితే  శరీరం  చల్లబడుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేడా.. కొబ్బరి నీరు శరీరానికి తక్షణమే తేమను అందిస్తుంది. మరోవైపు, మజ్జిగ జీర్ణక్రియను బలపరుస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండగా, మజ్జిగలో ప్రోటీన్ , ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది ఎంచుకోవాలి..?  డీహైడ్రేషన్ లేదా అలసటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరాన్ని తిరిగి ఎనర్జీగా మారుస్తుంది.  శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత తగ్గిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.  అలాగే ఎండలో బయటకు వెళ్లే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండ నుండి వచ్చిన తర్వాత కూడా కాసింత చల్లగా ఉండే మజ్జిగ తాగవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు రెండూ మంచివే అయినా.. శరీర పరిస్థితిని బట్టి కొబ్బరి నీరు, మజ్జిగ వేర్వేరు ఫలితాలు ఇస్తాయి,  వేర్వేరుగా ఉపయోగపడతాయి.                              *రూపశ్రీ.
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ కారణంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది.   వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్షలా కాపాడతాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రయాణాలు.. వేసవి కాలంలో చేసే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  అధిక వేడిమితో డీహైడ్రేషన్ గురికాకుండా తరచూ మంచినీరు,ఓఆరెస్,పల్చటి మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు  ఉదయం చాలా తొందరగా,  లేదా సాయంత్రం ఎండ వేడిమి చాలా వరకు తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయడం ఉత్తమం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లడం.. వేసవి కాలంలో సాధారణంగా మిగతా రోజుల్లా పనుల కోసం బయటకు వెళ్ళే విధానాన్ని తగ్గించుకోవాలి. వేసవి కాలంలో పనుల షెడ్యుల్.. బయటకు వెళ్ళి చక్కబెట్టుకోవాల్సిన పనుల ప్రణాళికలు మార్చుకోవాలి.  తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే.. వెంట వాటర్ బాటిల్,  గొడుగు ఉండేలా చూసుకోవాలి. కాలి నడకన లేదా బైక్ లో వెళ్లడం కంటే ఆటో వంటి వాహనాలలో బయటకు వెళ్లి రావడం చాలా మంచిది. ఆహార, పానీయాలు.. వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి  నీటి శాతాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి.  ఆహారంలో కారం, ఉప్పు,  నూనె వంటివి బాగా తగ్గించాలి. నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు,  పండ్లు విరివిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తొందర పాటులో చాలా చల్లగా ఉన్న ఫ్రిజ్ లోని నీరు తాగడం  మానుకోవాలి.  బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కుండలోని నీరు లేదా పల్చగా మజ్జిగ,  సుగంద షర్బత్ వంటివి తాగవచ్చు. ఇవి శరీరానికి ఊరట ఇస్తాయి.  వేసవి తాపం తీరుస్తాయి. హెల్త్ కేర్..   వేసవి ఎండల కారణంగా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన చికిత్స పొందాలి. అక్కడ ఓఆర్ లేదా ఎలక్ట్రోలైట్స్ ను అందించి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ పట్టున విశ్రాంతి తీసుకోవడం లేదా నీడ పట్టున పనులు చేసుకోవడం మంచిది.   సేవ.. వేసవికాలంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా.. నలుగురి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం కనీస మానవత్వం.  వేసవిలో ప్రయాణాలు చేసేవారు.. దారి వెంట వెళ్లే బాటసారులు ఉంటారు. అలాంటి వారి కోసం.. మంచి నీరు ఏర్పాటు చేయడం,  అక్కడక్కడా కూర్చోవడానికి కాసింత చోటు ఇవ్వడం వంటివి కూడా చేయాలి. ఇవి కనీస మానవ ధర్మం కూడా. అయితే.. ఏ పని చేసినా ప్రమాదాలు మీదకు తెచ్చుకోకుండా చేయడమే మంచిది.                               *రూపశ్రీ.