Top Stories

dummy

political-news-img

అమెరికా డ్రీమ్ మసకబారుతోందా?

హెచ్ 1బి బంధనం,టెక్ లేఆఫ్స్, దుబాయ్ వైపు మరలుతున్న భారత టాలెంట్.. ఒక డీప్ డైవ్ విశ్లేషణ అమెరికన్ డ్రీమ్ ఒకప్పుడు స్పష్టంగా ఉండేది. అమెరికాలో హై పే జాబ్, గ్రీన్ కార్డ్, సబర్బన్ హౌస్, మంచి స్కూల్స్. ఇప్పుడు అదే డ్రీమ్, ముఖ్యంగా ఇండియన్ టెక్ ప్రొఫెషనల్స్ కోసం, మారిపోయింది. లేదా కనీసం రూపం మార్చుకుంటోంది. ఇటీవల ఒక భారతీయ మహిళా టెక్ ప్రొఫెషనల్, చికాగోలో 3లక్షల డాలర్ల గూగుల్ జాబ్ ( భారత కరెన్సీలో అక్షరాలా.. 2,78,23,500.00 రూపాయలు) వదిలి, దుబాయ్ కు షిఫ్ట్ అవ్వడం, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమెది కేవలం వ్యక్తిగత నిర్ణయంగా మాత్రమే చూడలేం. ఇది ఒక పెద్ద ట్రెండ్ కు ప్రతీకగా చెప్పుకోవచ్చు. గోల్డెన్ కేజ్ హెచ్1బి- డబ్బు ఉంది, స్వేచ్ఛ లేదు. ఇదీ ఆమె చెప్పిన ప్రధాన పాయింట్. ఇది చాలా మందికి చాలా చాలా బలంగా తాకింది. - హెచ్1బి వీసా అంటే గోల్డెన్ కేజ్ - జీతం ఎక్కువ, కానీ - ఒకే కంపెనీకి బంధనం - సైడ్ బిజినెస్ చేయలేరు - యాక్టివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేయలేరు - అసిమెట్రికల్ రిటర్న్స్ అంటే.. సాలరీకి మించి సంపద సృష్టించే అవకాశాలు ప్రాక్టికల్ గా బ్లాక్ అవుతాయి. ఇది కేవలం ఆమె ఫీలింగ్ కాదు. అమెరికన్ టెక్ లేఆఫ్స్ 2023–24లో 3 లక్షలకుపైగా ఉద్యోగులను తాకాయి, ఇందులో పెద్ద భాగంహెచ్1బి హోల్డర్లే. వీసా బంధనం - జాబ్ పోతే 60 రోజుల్లో కొత్త స్పాన్సర్ దొరకాలి. లేకపోతే దేశం విడిచి వెళ్లాలి. అంటే కెరీర్ రిస్క్, ఇమ్మిగ్రేషన్ రిస్క్ డబ్బు కంటే దగ్గరితనం.. తల్లిదండ్రుల నుంచి దూరం, మనసులో ఖాళీ. ఆమె నిర్ణయంలో రెండో పెద్ద కారణం కుటుంబం. - సంవత్సరాల తరబడి ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను చూడలేకపోవడం - టైమ్ జోన్, ట్రావెల్ ఖర్చు, వీసా పరిమితులు. - చికాగోలో కంఫర్ట్ ఉంది, కానీ మనసులో గిల్ట్, ఖాళీ. ఇది చాలా మంది ఎన్ఆర్ఐలు లోపల మౌనంగా మోస్తున్న భావన. అమెరికన్ డ్రీమ్ స్లోగా ఫ్యామిలీ డిస్టెన్స్ అనే ధరతో వస్తోంది. ఎందుకు దుబాయ్? అంటే.. జియోగ్రఫీ ,ఫ్రీడమ్ , ట్యాక్స్ ఆమె లాజిక్ సింపుల్, కానీ వెరీవెరీ స్ట్రాంగ్ - దుబాయ్ నుంచి ఇండియాకు మూడు నాలుగు గంటల ఫ్లైట్ - తరచూ చిన్న ట్రిప్స్, ఫ్యామిలీతో టైమ్ గడపొచ్చు. - యేఏఈ లోసైడ్ వెంచర్స్ అనుమతి - మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ - ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ - అమెరికాతో తో పోలిస్తే సాలరీ తక్కువైనా, లైఫ్, వెల్త్, ఫ్రీడమ్. ఇదే బెటర్ ఈక్వేషన్ అని ఆమె భావించారు. ఇది ఒక కొత్త మ్యాథ్.. మాక్స్ సాలరీ కాదు.. మాక్స్ ఫ్రీడమ్ + మాక్స్ కంట్రోల్ + మినిమమ్ రెగ్రెట్. అమెరికా టెక్ మార్కెట్ రియాలిటీ.. లేఆఫ్స్, హెచ్1 బిస్ట్రాంగిల్, రిస్క్ పెరుగుదల. 2022 నుంచి 3 లక్షలకుపైగా టెక్ లేఆఫ్స్. వీరిలో 30 నుంచి 40 శాతం వరకు ఇండియన్ హెచ్1బి, ఎల్1 ప్రొఫెషనల్స్ అని అంచనాలు. టాప్ హెచ్1బి ఎంప్లాయర్లు 2022–23లో 85,000కుపైగా ఉద్యోగులను తొలగించారు ఇక పాలసీ వైపు చూస్తే.. - హెచ్1బి అప్రూవల్స్ కఠినతరం - కొత్త రూల్స్, ఎక్కువ డాక్యుమెంటేషన్ - వీసా ఫీజులు, లీగల్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి ఇది ఒక క్లియర్ మెసేజ్.. అమెరికా టెక్ ప్లస్ హెచ్1బి ఈజీక్వల్టూ హై రివార్డ్, కానీ ఇప్పుడు హై రిస్క్ కూడా. కంపెనీలు కూడా మారుతున్నాయి.. జాబ్స్ ఇండియాకి, గల్ఫ్ కి షిఫ్ట్ ఒక సంవత్సరం లోపలే.. - 32,000కుపైగా హై స్కిల్ టెక్ రోల్స్ (ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ) అమెరికా నుంచి ఇండియాకు షిఫ్ట్ అయ్యాయి - 2 లక్షలకుపైగా ప్రొఫెషనల్స్ ఇండియాలో హై ఎండ్ టెక్ రోల్స్ లో హైర్ అయ్యారు అంటే.. - కంపెనీలు కూడా సిలికాన్ వ్యాలీ సెంట్రిక్ మోడల్ నుంచి డిస్ట్రిబ్యూటెడ్ టాలెంట్ మోడల్ వైపు వెళ్తున్నాయి - అమెరికాలో ఉండాల్సిందే అనే కంపల్షన్ తగ్గుతోంది జెన్జీ సిగ్నల్.. బిగ్ టెక్ ఆకర్షణ తగ్గుతోంది డేటా ప్రకారం.. • 2023లో బిగ్ టెక్లోజెన్ జీ రిప్రజెంటేషన్ 15 శాతం కాగా, అది 2025 నాటికి 6.8శాతానికి పడిపోయింది అంటే.. - బిగ్ టెక్ = లైఫ్ గోల్ కాదు - స్టార్టప్స్, క్రియేటర్ ఎకానమీ, రిమోట్ వర్క్, ఇండియా, యూఏఈ ఆప్షన్స్ - ఒకే కంపెనీ, ఒకే దేశం, 30 ఏళ్ల కెరీర్ మోడల్ యువ ప్రెఫెషనల్స్ కి ఆకర్షణీయంగా లేదు అమెరికన్ డ్రీమ్ రీడిఫైన్ అవుతోంది, పూర్తిగా చనిపోలేదు ఆమె చెప్పిన లైన్ చాలా ఇంపార్టెంట్.. నేను అమెరికన్ డ్రీమ్ ను వదిలేయలేదు, దాన్ని రీడిఫైన్ చేసుకున్నాను. అమెరికాలో సంపాదించిన సేవింగ్స్ తో కెరీర్ బ్రేక్, కంటెంట్ క్రియేషన్, బ్రాండ్ బిల్డింగ్, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ఎక్స్ ప్లోర్ చేయడంతో పాటు సాలరీ మాక్సిమైజేషన్ నుంచి లైఫ్ డిజైన్ + లాంగ్ టర్మ్ వెల్త్ + ఫ్రీడమ్ వైపు షిఫ్ట్ ఆన్లైన్ రియాక్షన్స్: - కొందరికి ఇది ఇన్స్పైరింగ్ - కొందరికి ఇది ఇంప్రాక్టికల్ - కొందరు ఇది ప్రివిలేజ్ అంటారు కానీ డీప్ లో ఉన్న ట్రెండ్ మాత్రం క్లియర్.. టెక్ వర్కర్స్ ఇప్పుడు జీతం కంటే జీవితాన్ని కొలుస్తున్నారు. తెలుగు కమ్యూనిటీ, ప్రత్యేకంగా: - అమెరికాలో ఉన్నహెచ్1బి ప్రొఫెషనల్స్ - ఇండియాలో ఉన్న, అమెరికాను డ్రీమ్ గా చూసే స్టూడెంట్స్ - గల్ఫ్, దుబాయ్ను ఆప్షన్ గా చూస్తున్న మిడిల్ కెరీర్ టెకీస్ వీళ్లందరికీ ఇప్పుడు కొన్ని హార్డ్ ప్రశ్నలు: - మీకు ముఖ్యమైంది ఏమిటి? - మాక్స్ సాలరీనా? - ఫ్యామిలీ దగ్గరగా ఉండడమా? - ఫ్రీడమ్, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్, లైఫ్ డిజైన్? - హెచ్1బి బంధనం మీ రిస్క్ టాలరెన్స్కు సరిపోతుందా? - ఇండియా + యూఏఈ + రిమోట్ వర్క్ కాంబినేషన్ మీకు బెటర్ ఈక్వేషన్ ఇవ్వగలదా? - అమెరికన్ డ్రీమ్ మీకు ఇంకా అదేనా? లేక మీరు కూడా దాన్ని రీడిఫైన్ చేస్తున్నారా? అమెరికన్ డ్రీమ్ మసకబారడం కాదు… మారుతోంది అమెరికన్ డ్రీమ్ చనిపోలేదు. కానీ అది ఇప్పుడు - ఒకే దేశం కాదు - ఒకే పాస్పోర్ట్ కాదు - ఒకే కంపెనీ కాదు ఎక్కడ ఉంటే నాకు ఫ్రీడమ్, ఫ్యామిలీ, ఫ్యూచర్ మూడు బ్యాలెన్స్ అవుతాయో అదే నా డ్రీమ్. కొంతమందికి అది ఇంకా అమెరికా కావచ్చు. కొంతమందికి దుబాయ్. కొంతమందికి హైదరాబాద్, బెంగళూరు. కొంతమందికి మల్టీ-లొకేషన్ లైఫ్. ప్రశ్న ఒక్కటే.. మీ డ్రీమ్ మీద మీకే కంట్రోల్ ఉందా? లేక వీసా, కంపెనీ, సిస్టమ్ కంట్రోల్లో ఉందా? సేకరణ, సంకలనం :కంఠమనేని సీతారాం

Publish Date: Apr 17, 2026 12:37PM

political-news-img

తమిళనాట టీవీకే విజయ్ ఫ్రీ పాలిటిక్స్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ తన పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో మహిళలు, రైతులపై వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.2500లు చొప్పున ఇస్తామని ప్రకటించారు. అలాగే పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతుల రుణాలను 50 శాతం మాఫీ చేస్తామన్నారు. అలాగే ఓ కుటుంబానికి ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల ఆర్థిక సహాయం చేస్తామన్నారు . అలాగే కొత్తగా ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు నెలకు రూ.3 వేలు పింఛను ఇస్తామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, ఏఐ మంత్రిత్వ శాఖ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని విజయ్ హామీల వర్షం కురిపించారు. అలాగే మహిళలు తమ ఇళ్ల ముందు టీవీకే పార్టీ గుర్తు అయిన విజిల్ ముగ్గు వేయాలని సూచించారు.

Publish Date: Apr 17, 2026 12:01PM

political-news-img

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. మహిళా స్మగ్లర్ అరెస్ట్

హైదరాబాద్‌ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్ ఆందోళనకర స్థాయికి చేరింది. తరచూ ఈ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా మరోసారి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాలను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 17) ఉదయం విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా ఒక మహిళా స్మగ్లర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు శంషాబాద్ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆమె వెంట ఉన్న లగేజీ బ్యాగులలో రహస్యంగా దాచిన డ్రగ్స్ బయటపడ్డాయి. ప్రాథమిక పరీక్షలలో ఆమె వద్ద అభించినది హైడ్రోపోనిక్ గంజాయి అని తేలింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్ లో కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితురాలిని విచారణ నిమిత్తం రహస్య ప్రాంతానికి తరలించారు. ఇటీవలి కాలంలో బ్యాంకాక్, దుబాయ్ వంటి నగరాల నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా పెరిగినట్లు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తనిఖీలను మరింత కఠినతరం చేశారు.

Publish Date: Apr 17, 2026 11:52AM

political-news-img

రెండేళ్లలో 5వేల ఆలయాల నిర్మాణం.. దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం

శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు గురువారం (ఏప్రిల్ 16) సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించామనీ, ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజ కవర్గంలోనూ పాతిక నుంచి 30 ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుందన్న ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలన్నారు. ఇప్పటి వరకు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయని చెప్పిన ఆయన ఈ మాస్టర్ ప్లాన్ ల ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నివాస సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దేవాలయాల్లో పవిత్రతో పాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్న చంద్రబాబు.. అన్ని దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగు పరచాలని చెప్పారు. ఇందుకోసం టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Publish Date: Apr 17, 2026 11:39AM

political-news-img

థాయ్‌లాండ్‌ సాంగ్‌క్రాన్ ఉత్సవాల్లో విషాదం.. 191 మంది మృతి

థాయ్‌లాండ్‌లో అత్యంత వైభవంగా జరిగే సాంగ్‌క్రాన్ ఉత్సవాలు ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద 'నీటియుద్ధంగా గుర్తింపు పొందిన ఈ వేడుకల ప్రారంభంలోనే భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. కేవలం మొదటి మూడు రోజుల్లోనే వివిధ రోడ్డు ప్రమాదాల్లో 191 మంది మరణించారు. ఏటా ఏప్రిల్ నెల మధ్యలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే సాంగ్ క్రాన్ ఉత్సవం భారీ ప్రాణనష్టంతో విషాదంగా మారింది. థాయ్ లాండ్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నీళ్లతో ఒకరినొకరు తడుపుకుంటూ పండుగ చేసుకుంటారు. కానీ ఈ ఏడాది ఈ ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాలలో 191 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. సాంగ్ క్రాన్ ఉత్సవాల ప్రారంభం రోజునే రోడ్డు ప్రమాదాలలో 51 మంది మరణించారు. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలుపుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, అదీ మద్యం సేవించి వాహనాలు నడపడం, అలాగే శిరస్త్రాణాలు ధరించకపోవడం కారణంగా ప్రమాదాలలో మృతుల సంఖ్య భారీగా పెరిగిిందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ సాంగ్ క్రాన్ వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలు జరగడం అన్నది ఏటా సర్వసాధారణమే అయినా, ఈ ఏడాది ప్రమాదాల సంఖ్యా, మృతుల సంఖ్యా కూడా ఆందోళనకర స్థాయికి పెరిగిందంటున్నారు. ఏప్రిల్ నెల మధ్యలో ఆరంభమై వారం రోజుల పాటు జరిగే సాంగ్ క్రాన్ పండుగ కాలాన్ని అధికారులు సెవెన్ డేంజరస్ డేస్ గా చెబుతుంటారు. ఈ పండుగ రోజులలో బ్యాంకాక్ వంటి నగరాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు తరలివెడతారు. ఆ కారణంగా రోడ్లన్నీ కక్కిరిసిపోతాయి. ఆ కారణంగా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.

Publish Date: Apr 17, 2026 11:25AM

political-news-img

అనకాపల్లి జిల్లాలో వారి ఎనర్జీస్ భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ సంస్థ అయిన వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అనకాపల్లి జిల్లాలో 8 వేల 175 కోట్ల రూపాయలతో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కంపెనీ రెడీ అయ్యింది. ఇందు కోసం ఆ కంపెనీకి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ లభ్యమయ్యాయి. దీంతో త్వరలో ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని వారి ఎనర్జీ స్టోరేష్ సిస్టమ్ నిర్ణయించింది. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్ సుమారు 16 గిగావాట్ అవర్ ( సామర్థ్యంతో పనిచేయనుంది. ఈ ప్లాంట్‌లో కేవలం బ్యాటరీ ప్యాక్‌లు మాత్రమే కాకుండా, సెల్ తయారీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌కు అవసరమైన విడిభాగాలను కూడా ఉత్పత్తి చేయనుంది. ఈ భారీ పరిశ్రమ స్థాపన ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు మొదటి దశను వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని వారీ ఎనర్జీస్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వారీ ఎనర్జీస్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గుజరాత్ , అమెరికాలోని టెక్సాస్‌లో సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉన్న ఈ సంస్థ, తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి అవసరమైన బ్యాటరీ నిల్వ వ్యవస్థలను దేశీయంగానే అందించే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 20 గిగావాట్ అవర్ వరకు పెంచాలని వారీ ఎనర్జీస్ సంస్థ భావిస్తోంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ తయారీలో ఈ కేంద్రం దేశంలోనే కీలక భూమిక పోషించనుందని చెబుతున్నారు.

Publish Date: Apr 17, 2026 11:07AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img