political-news-img

రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఉదయ్ కృష్ణారెడ్డి..!

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనలు విన్న కోర్టు రెండు రోజులపాటు కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని రేపు గురువారం అత్తాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. రెండు రోజుల కస్టడీ విచారణలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై జరిగిన వేధింపులు, ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఇతర కీలక అంశాలపై పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించను న్నారు. కేసుకు సంబంధిం చిన పూర్తి వివరాలను రాబట్టడంతో పాటు డిజిటల్ ఆధారాలను సేకరించడంపైనా కూడా పోలీసులు దృష్టి సారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డి ఉపయోగించిన మొబైల్ ఫోన్ పోలీసులకు లభించకపోవడం దర్యాప్తులో కీలకంగా మారింది. ఆ ఫోన్ స్వాధీనం అయితే కాల్ డేటా, వాట్సాప్ చాట్‌లు, సందేశాలు, ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా కేసులోని పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తు న్నారు. ముఖ్యంగా కస్టడీ విచారణలో మొబైల్ ఫోన్ ఆచూకీని రాబట్టడం, దానిని స్వాధీనం చేసుకోవడం, కేసుకు సంబంధించిన ఇతర సాక్ష్యాధారాలను సేకరించడంపై అత్తాపూర్ పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల విచారణ అనం తరం కేసులో మరిన్ని కీలక విషయాలు బయ టపడే అవకాశముందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నారు. Trainee IPS Uday Krishna Reddy, Police Investigation, Attapur Police, Cherlapalli Jail, CM Revanth Reddy

Publish Date: Aug 5, 2026 8:20PM

political-news-img

జగన్ కోసం పోరాడిన వారికి ఇదే ప్రతిఫలమా..?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి చేపట్టిన నిరసన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా జగన్‌కు, వైసీపీకి అనుకూలంగా నిలిచి అనేక రకాల వివాదాలు, 22 లీగల్ కేసులను ఎదుర్కొని తొమ్మిది నెలల పాటు జైలు జీవితం గడిపిన తనకు ఇప్పుడు పార్టీ నుంచి తీవ్ర పరాభవం ఎదురవుతోందని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను నేరుగా కలిసేందుకు ప్రయత్నించగా అనుమతి నిరాకరించడం, పార్టీ కార్యాలయానికి రావద్దని హెచ్చరించడం వంటి పరిణామాలు వైసీపీలోని ప్రస్తుత గందరగోళ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పార్టీ కోసం కేసులు ఎదుర్కొని, ఆస్తులు జప్తు అయి, బ్యాంక్ అకౌంట్లు సీజ్ అయి కుటుంబం రోడ్డున పడినా తమను పట్టించుకునే వారు లేరని ఆయన ఆరోపించారు. బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన ఆరోపణలు ప్రధానంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్యంగా సాగాయి. పార్టీలో కీలక నిర్ణయాలు, నేతల భేటీలు, లీగల్ సహాయం చివరికి జగన్ మీడియాలో శుభాకాంక్షల ప్రకటనలు ఇవ్వాలన్నా సజ్జల అనుమతి తప్పనిసరి కావడం పార్టీలోని కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థను బయటపెడుతోంది.జగన్‌ను కలిసేందుకు కార్యకర్తలు లేదా మద్దతుదారులు నేరుగా వెళ్లకుండా అడ్డుగోడలు నిర్మించడం వల్ల క్షేత్రస్థాయి నాయకులు, కష్టపడిన మద్దతుదారులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. పొన్నులు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ ఇంచార్జీలు కూడా సజ్జల అనుమతి లేనిదే సహాయం చేయలేమని చెప్పడం, అధికారంలో లేని సమయంలో పార్టీ యంత్రాంగం తమ కోసం నిలబడిన వారిని ఏ రీతిన గాలికి వదిలేస్తుందో స్పష్టం చేస్తోంది. ఇది కేవలం అనిల్ కుమార్ ఒక్కరి సమస్య మాత్రమే కాక, వైసపి ద్వితీయ శ్రేణి నేతలు మరియు కార్యకర్తలలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతంగా కనిపిస్తోంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంవిపత్తు సమయాల్లో లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పోరాడిన నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, లీగల్ మరియు నైతిక రక్షణ దక్కకపోవడం వైసపి భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. జగన్ వ్యక్తిగత ఇమేజ్, ప్రజాకర్షణపైనే పూర్తిగా ఆధారపడిన వైసపి, క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోసిన కార్యకర్తల నిరాశను నిర్లక్ష్యం చేస్తే సుదీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో పునర్వైభవం సాధించాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి వంటి కోర్ టీమ్ నిర్వహణా వైఖరిపై వైసపి అధిష్టానం పునరాలోచన చేసుకోవడం అత్యంత అవసరం. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలవకపోతే, రాబోయే రోజుల్లో పార్టీ కోసం పోరాడేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. Borugadda Anil Kumar, YS Jagan Mohan Reddy, YSRCP Internal Crisis, Sajjala Ramakrishna Reddy, Borugadda Anil Protest, YSRCP Cadre Issues, AP Politics Today, YS Jagan House Protest, AP Political News

Publish Date: Aug 5, 2026 7:54PM

political-news-img

కల్తీ పాల వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఐఏఎస్ అధికారి..!

కేవలం నెల రోజుల్లో 360 దాడులు..! ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు. ఆహార భద్రతా నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రజలకు విషపూరిత పాలు విక్రయిస్తున్న ముఠాల గుండెల్లో ఆయన వణుకు పుట్టిస్తున్నారు. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కల్తీ పాలపై సంచలన స్థాయి డ్రైవ్ చేపట్టారు. పరిశీలించిన పాల నమూనాల్లో దాదాపు 70 శాతం వరకు కల్తీ జరుగుతోందనే నివేదికలు రావడంతో ఆయన, ఏకంగా 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణను నిర్వహించారు. ఈ వినూత్న తనిఖీల్లో భాగంగా మహారాష్ట్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తి కేంద్రాలు, గిడ్డంగులు, డెయిరీలు, పంపిణీ వ్యాపారులపై దాదాపు 360 ప్రదేశాల్లో ఎఫ్‌డీఏ బృందాలు దాడులు చేశాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 235 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో పాటు సుమారు 350 మంది కల్తీదారులను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా, నకిలీ ప్రమాదకర రసాయనాలతో పాలు తయారు చేస్తున్న 274 అక్రమ తయారీ కేంద్రాలను అధికారులు సీజ్ చేశారు. ముంబైలో శతాబ్ద కాలంగా పేరొందిన ప్రముఖ 'కే. రుస్తుమ్ అండ్ కంపెనీ' సంస్థలోనూ పరిశుభ్రతా లోపాలను గుర్తించి, ఏకంగా దాని లైసెన్స్‌ను రద్దు చేయడం ద్వారా చట్టం ముందు ఎంతటి వారైనా సమానమేననే స్పష్టమైన సందేశం పంపారు. తన 21 ఏళ్ల సివిల్ సర్వీస్ కెరీర్‌లో ఏకంగా 25 సార్లు బదిలీలు ఎదుర్కొన్నప్పటికీ, తుకారాం ముండే ఎక్కడా తన నిబద్ధతను వీడలేదు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే అధికారిగా ఆయనకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతిరోజూ ఉదయాన్నే చిన్నారుల నుండి వృద్ధుల వరకు తాగే పాలల్లో రసాయనాలు కలపడం క్షమించరాని నేరమని, ఇలాంటి కఠిన చర్యల వల్ల నిత్యావసర వస్తువులపై ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరణ పొందుతుందని సామాజిక విశ్లేషకులు, సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే కల్తీ ముఠాలపై ఇదే రీతిలో కఠిన చర్యలు కొనసాగాలని, ఇతర రాష్ట్రాల అధికారులు కూడా తుకారాం ముండేను ఆదర్శంగా తీసుకుని నాణ్యమైన ఆహార సరఫరాను నిర్ధారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై ఇదే తరహా కఠిన చర్యలు కొనసాగాలని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రత్యేక తనిఖీలు చేపట్టి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. Tukaram Mundhe IAS, Maharashtra Milk Adulteration, FDA Commissioner Maharashtra, Milk Crackdown Maharashtra, Tukaram Mundhe Transfers

Publish Date: Aug 5, 2026 7:20PM

political-news-img

తొలి బడ్జెట్‌లోనే వరాల జల్లు కురిపించిన సీఎం విజయ్..!

మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..! విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్..! తమిళనాడులో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చిన బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పలు కీలక ప్రకటనలు చేసింది. మహిళలు, విద్యార్థులు, చిన్నారులను ఆకట్టుకునేలా వరాల జల్లును ప్రకటించింది. వివాహ వేళ వధువులపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. అన్నన్ సీర్ తిట్టమ్ కింద అర్హులైన వధువులకు 8 గ్రాముల బంగారు నాణెంతో పాటు పట్టు చీర అందించేందుకు ఏకంగా రూ.812 కోట్లు కేటాయించింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి శిశువుకూ 1 గ్రాము బంగారు ఉంగరం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.560 కోట్లు కేటాయించింది. ఈ ప్రకటన బడ్జెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కళాశాల విద్యార్థుల కోసం వెట్రి ల్యాప్‌టాప్‌ పథకానికి రూ.2,000 కోట్లు కేటా యించారు. విద్యార్థులకు డిజిటల్‌ విద్యను మరింత చేరువ చేయడమే లక్ష్య మని ప్రభుత్వం తెలిపింది. సామాన్య కుటుంబాలకు కూడా ఊరటనిచ్చేలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాల ల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.125 కోట్లు కేటాయిం చారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేప ట్టనుంది. ఎలక్ట్రిక్‌ వాహ నాల వినియోగాన్ని పెంచేం దుకు వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సంక్షేమంతో పాటు ఆర్థిక అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2031 నాటికి తమిళనాడు ను 1.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ద డమే లక్ష్యంగా ప్రకటించింది...మొత్తంగా.. విజయ్‌ సర్కార్‌ తొలి బడ్జెట్‌ సంక్షేమం, విద్య, మహిళలు, యువతతో పాటు రాష్ట్ర ఆర్థిక అభి వృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సాగింది. తొలి బడ్జెట్‌లోనే భారీ వరాల ప్రకటనలు చేయడంతో ఈ బడ్జెట్‌ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. Tamil Nadu Budget, CM Vijay, TVK Goverment, Vetri laptop, First Budget, Digital education

Publish Date: Aug 5, 2026 7:07PM

political-news-img

తుమ్మిడిహెట్టికి అనుమ‌తులు ఇప్పించండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన‌తి..!

ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మ‌హారాష్ట్రలో ముంపు ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని వివ‌రించారు. జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆయ‌న కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి బుధ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్య‌త‌, ప్రాజెక్టుకు అనుమ‌తులు మంజూరు కోరుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి తాను రాసిన లేఖ‌, దానికి ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం స్పందించి జ‌ల్ శ‌క్తికి పంపిన లేఖ‌ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌ల్‌శ‌క్తి మంత్రితో ప్ర‌స్తావించారు. తుమ్మిడిహెట్టి వ‌ద్ద 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గ‌తంలోనే రెండు రాష్ట్రాల మ‌ధ్య ఒప్పందం కుదిరిన విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి వ‌ద్ద 148 మీట‌ర్ల నుంచి 152 మీట‌ర్ల వ‌ర‌కు ఎత్తుతో బ్యారేజీ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్ర‌ల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ సెంట‌ర్ (CWPRS) అధ్య‌య‌నం నిర్వ‌హించింద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. CWPRS అధ్య‌య‌నం ప్రకారం 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపులో పెద్ద‌గా తేడా లేద‌ని స్ప‌ష్ట‌మైంద‌న్నారు. ముంపులోనూ 50 శాతం న‌దీ గ‌ర్భం (రివ‌ర్ బెడ్‌)లోనే ఉంటుంద‌ని కేంద్ర మంత్రి పాటిల్‌కు సీఎం వివ‌రించారు. 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేప‌డితే గ్రావిటీ ద్వారా కావ‌ల్సినంత నీరు స‌ర‌ఫ‌రా చేయ‌లేమ‌ని, కాబ‌ట్టి 150 నుంచి 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని కేంద్ర మంత్రి పాటిల్‌ను సీఎం కోరారు. తుమ్మిడిహెట్టి వ‌ద్ద 150 నుంచి 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేప‌డితే గ్రావిటీ ద్వారానే నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. గ్రావిటీ ద్వారా నీటి స‌ర‌ఫ‌రాతో విద్యుత్ వినియోగం భారం ఉండ‌ద‌ని, ఈ నేప‌థ్యంలో బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని కోరారు. ఈ అంశంపై సాధ్య‌మైనంత త్వ‌ర‌గా తెలంగాణ‌, మ‌హారాష్ట్రల మ‌ధ్య స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యితే పూర్తిగా వెనుక‌బ‌డిన ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీటి వ‌స‌తి ఏర్ప‌డుతుంద‌ని సీఎం వివ‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి లేఖ అందింద‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ అంశంపై మొద‌ట కేంద్ర జ‌ల సంఘం (సీడ‌బ్ల్యూసీ) ఆధ్వ‌ర్యంలో స‌మావేశం ఏర్పాటు చేసి తొలుత తెలంగాణ‌, మ‌హారాష్ట్ర స్థాయి అధికారుల‌తో చ‌ర్చ‌ల ప్ర‌క్రియ ప్రారంభిస్తామ‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి తెలియ‌జేశారు. ఆ త‌ర్వాత తెలంగాణ‌, మ‌హారాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రుల స‌మావేశం ఏర్పాటు చేస్తాన‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి ముఖ్య‌మంత్రికి తెలిపారు. ఈ స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, వేం న‌రేంద‌ర్ రెడ్డి, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, గ‌డ్డం వంశీకృష్ణ‌, ఎం.అనిల్ యాదవ్‌, డాక్ట‌ర్ క‌డియం కావ్య‌, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్య‌నాధ్ దాస్‌, నీటి పారుద‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఈ.శ్రీ‌ధ‌ర్ పాల్గొన్నారు. Tummidihetti Barrage, CM Revanth reddy, Minister CR Patil, Minister Uttam Kumar Reddy, CWC, Telangana, Maharashtra

Publish Date: Aug 5, 2026 6:23PM

political-news-img

ఆరోగ్యంగా ఉండాలంటే సెల్ హెల్త్ గురించి తప్పక తెలుసుకోండి!

మన శరీరం అనేది ప్రకృతి సృష్టించిన అత్యంత అద్భుతమైన జీవ వ్యవస్థ. మనకు కనిపించని స్థాయిలో శరీరంలో సుమారు 36 లక్షల కోట్ల కణాలు (36 Trillion Cells) ప్రతి క్షణం పనిచేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఈ కణాలన్నీ సమన్వయంతో పనిచేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఒక్క కణం పనితీరులో లోపం వచ్చినా, అది క్రమంగా ఇతర కణాలపై ప్రభావం చూపి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే నిజంగానే "ఉన్నది ఒకటే జబ్బు... అది సెల్ అనారోగ్యం" అనే భావన వెనుక శాస్త్రీయ కారణం ఏమిటి? ప్రతి వ్యాధి కణాల స్థాయిలోనే మొదలవుతుందా? కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు లభిస్తాయి. ఈ వీడియోలో Cell Health Clinics Founder డా. రవి కుమార్ చింత సెల్ హెల్త్ (Cell Health) యొక్క ప్రాముఖ్యతను సులభమైన ఉదాహరణలతో వివరిస్తున్నారు. మన ఆహారం, నిద్ర, వ్యాయామం, మానసిక ఒత్తిడి, కాలుష్యం, జీవనశైలి వంటి అంశాలు కణాల పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన వివరించారు. అంతేకాదు, చాలా మంది ఎదుర్కొనే మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యల వెనుక కణాల ఆరోగ్యం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో కూడా ఈ చర్చలో తెలుసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించాలంటే కేవలం వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడటం సరిపోదని, కణాల స్థాయిలో శరీరాన్ని బలపరిచే జీవనశైలిని అలవర్చుకోవడం అవసరమని డా. రవి కుమార్ చింత సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మీ శరీరాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచే సెల్ హెల్త్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Publish Date: Aug 5, 2026 6:23PM

MOVIE NEWS