political-news-img

నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరు

సంధ్యా థియేటర్ తొక్కిస లాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం (జూన్ 22) హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సమన్ల మేరకు ఆయన కోర్టుకుహాజరయ్యారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ను ఎ–11 నిందితుడిగా పేర్కొన్నారు. చార్జిషీట్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు కేసును విచారణకు స్వీకరించి, నిందితులకు (జూన్ 22) సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్ తన నివాసం నుండి నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు.

Publish Date: Jun 22, 2026 11:43AM

political-news-img

రోడ్డు ప్రమాదంలో డీటీవో వెంకన్న దుర్మరణం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా అధికారి డీటీవో వెంకన్నన దుర్మరణం చెందారు. విధినిర్వహణలో భాగంగా రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తున్న వెంకన్నను ఒక బొగ్గు టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. పరకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై సరిగ్గా జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరకాల వైపు నుంచి భూపాలపల్లి వైపు వస్తున్న ఒక బొగ్గు టిప్పర్ అతివేగంగా దూసుకొ డీటీఓ వెంకన్నను ఢీకొంది. వెంకన్న 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు బాధ్యతలు చేపట్టారు. సమాచారంఅందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బొగ్గు టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, ఫెయిల్ అవ్వడం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై తెలంగాణ రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన.. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. విధినిర్వహణ లో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Publish Date: Jun 22, 2026 11:34AM

political-news-img

ఆర్టీసీ బస్సు..లారీ ఢీ.. ఇద్దరు మృతి

తిరుపతి జిల్లాలో సోమవారం (జూన్ 22) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు వాహనాలూ కూడా అతి వేగంతో ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రమాదంలో మృతులను ఏడాది వయస్సున్న పునీత్ సాయి, శ్రీకాళహస్తికి చెందిన 16 ఏళ్ల యశ్వితగా గుర్తించారు.

Publish Date: Jun 22, 2026 11:01AM

political-news-img

ఏఐ టెక్నాలజీని ఉపయోగించి బాలికను వేధించిన కీచక ఉపాధ్యాయుడు!

కృత్రిమ మేధస్సు(ఏఐ) సాంకేతికత మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడుతోంది నిజమే.. కానీ.. కొందరు దీనిని దుర్మార్గాలు కూడా వాడేస్తున్నారు. సమాజానికి హాని కలిగించేందుకు ఇందుకు వినియోగిస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో సాంకేతికతను ఒక ట్యూషన్ టీచర్ దుర్వినియోగం చేసిన తీరు విస్మయపరిచేలా, ఏఐ అంటేనే భయపడేలా ఉంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. కీచకుడిగా మారి.. ఏఐ టూల్స్ సహాయంతో తన వద్దే చదువుకునే ఒక మైనర్ విద్యార్థినిపై మానసిక దాడికి తెగబడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం నిందితుడు షణ్ముఖ్ హితేష్‌ తన వద్ద రెగ్యులర్‌గా ట్యూషన్ నేర్చుకోవడానికి వచ్చే ఒక మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని.. ఆ బాలికకు సంబంధించిన ఫొటోలను సేకరించాడు. ఆ తర్వాత ఏఐ టూల్స్ ఉపయోగించి, ఆ ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేశాడు. వాటిని చూపించి సదరు బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు లొంగకపోతే.. ఈ మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాననీ, ఇతరులందరికీ పంపిస్తానని ఆ మైనర్ బాలికను బెదరించాడు. నిందితుడు షణ్ముఖ్ హితేష్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో, ఆ బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే.. విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు షణ్ముఖ్ హితేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Publish Date: Jun 22, 2026 10:40AM

political-news-img

అమెరికా, ఇరాన్ మధ్య ముగిసిన తొలి విడత శాంతి చర్చలు.. కుదిరిన ఒప్పందాలేంటంటే?

అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నత స్థాయి శాంతి చర్చలు ముగిశాయి. స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ నగరంలో జరిగిన ఈ తొలి విడత చర్చలలో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఒక దశలో చర్చలు అర్ధంతరంగా ముగిసిపోయాయా? అన్న అనుమానాలు సైతం తలెత్తాయి. అయితే.. చివరికి ఈ చర్చలు సానుకూలంగా ముగియడంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రపంచ దేశాలననీ అత్యంత ఆసక్తితో ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సుదీర్ఘ ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఒక ముందడుగు పడింది. వచ్చే 60 రోజుల్లో సంపూర్ణమైన తుది ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాలు ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకోవడం ఈ చర్చల్లో సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. అయితే.. ఈ శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఇరాన్ ను తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తే సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు కలకలం రేపింది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులను అదుపులో పెట్టుకోకుంటే.. గత వారం కంటే ఘోరమైన, తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందం టూ హెచ్చరించారు. అలాగే.. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తామని, చర్చల కోసం వచ్చిన ఇరాన్ ప్రతినిధుల బృందాన్ని కిడ్నాప్ చేస్తామంటూ ఆ పోస్టులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన ఈ అవమానకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసి చర్చలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశారు. దీంతో చర్చలు విఫలమై కథ మళ్లీ మొదటికొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఇరు దేశాల మధ్యా శాంతి కోసం మీడియేట్ చేస్తున్న పాకిస్థాన్, దేశాలు రంగంలోకి దిగాయి. ఇరుపక్షాలతో సంప్రదింపులు జరిపి, వారిని మళ్లీ చర్చల టేబుల్ ముందుకు తీసుకువచ్చాయి. తొలి విడత భేటీలో .. చర్చల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు, సరైన రాజకీయ మార్గనిర్దేశం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ కమిటీ పరిధిలో అణు కార్యక్రమాలు, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, పర్యవేక్షణ వంటి ప్రత్యేక అంశాలపై వర్కింగ్ గ్రూపులు పనిచేసి నివేదికలు సమర్పిస్తాయి. దీనితో పాటు, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతను నిర్ధారించడానికి ఇరు దేశాల మధ్య ఒక ప్రత్యేక కమ్యూనికేషన్ లైన్‌ను ఏర్పాటు చేస్తారు. రాబోయే 60 రోజుల్లోగా శాశ్వత శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు సాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గుతాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.

Publish Date: Jun 22, 2026 10:24AM

political-news-img

మళ్లీ కవ్వింపులకు దిగుతున్న పాక్.. భారత్ తో యుద్దానికైనా సై అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

దేశంలో అంతర్గత కలహాలు, ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. ఈ సమస్యల నుంచి, సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. దేశంలో సంక్షోభాలు తీవ్ర స్థాయికి చేరిన ప్రతి సారీ పాకిస్థాన్ కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి పబ్బం గడుపుకునేది. అయితే ఈ సారి ఆ పప్పులు కూడా ఉడకకపోవడంతో.. సింధు జలాల వివాదాన్ని శరణు జొచ్చింది. సింధు జలాల వివాదాన్ని రాజకీయం చేస్తూ యుద్ధ నాటకానికి తెరలేపింది. సింధు నదీ జలాల విషయంలో తమ దేశ ప్రయోజనాలకు, నీటి ప్రవాహానికి ఏమాత్రం ముప్పు వాటిల్లుతోందని భావించినా భారత్‌తో యుద్ధానికైనా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. నీటి హక్కులు తమ జాతీయ భద్రతలో ఒక భాగమని, అవసరమైతే సైనిక చర్యకు దిగే అవకాశాన్ని తాము కొట్టిపారేయలేమని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్‌ మీడియా సంస్థ ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగమే యుద్ధ వ్యాఖ్లు అంటూ అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే వరకు దాయాది దేశంతో ఎటువంటి చర్చలు ఉండవన్న ఇండియా వైఖరి స్పష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి నుంచి యుద్ధం మాట రావడం అంతిమంగా ఆదేశానికే నష్టం చేకూరుస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల భారత జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోనే ఉంటూ, భారత భూభాగంలో లభించే జల వనరులను మరియు దేశానికి చట్టబద్ధంగా దక్కాల్సిన నీటి హక్కులను పూర్తిగా వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాక్ రక్షణ మంత్రి భారత్ తో యుద్ధానికైనా సరే అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదంపై వైఖరిని మార్చుకోకుండా.. ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగితే మరోసారి భంగపాటుకు గురికాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Jun 22, 2026 10:07AM

MOVIE NEWS