Top Stories

political-news-img

ఏక్ నాథ్ షిండేకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.!

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఏక్ నాథ్ షిండే ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు ఆయనను థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో షిండే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తోంది. ఏక్‌నాథ్ షిండే ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన మరికొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. Maharashtra Deputy CM, Jupiter Hospital Thane, Eknath Shinde Health, Teluguone

Publish Date: Jul 4, 2026 1:01PM

political-news-img

టీఆర్ఎస్ కుదరదు.. మరో పేరు పెట్టుకోండి.. కల్వకుంట్ల కవితకు ఈసీ తాఖీదు.!

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆమె స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సమితి పేరుపై భారీ ఎత్తున అభ్యంతరాలు వచ్చిన కారణంగా పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు పార్టీకి అధికారిక సమాచారం ఇచ్చింది. ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది. తన పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర్కొంటూ.. రిజిస్ట్రేషన్ కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. అయితే.. ఈ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని అందువల్ల మూడు ప్రత్యామ్నాయ పేర్లను కు సర్పించాలని ఈసీ కవితకు లేఖ రాసింది. కాగా ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలపై స్పందించిన కవిత.. ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదనీ.. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామనీ తెలిపారు. గత ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి పేర్లను సూచిస్తూ కవిత సీఈసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించిన కవిత, అదే సభలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకు కవిత కొత్త పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన గా ఈసీ ప్రాథమికంగా గుర్తించింది. తాజాగా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రత్యామ్నాయ పేర్లు ఎంపిక చేసుకోవాలని సూచించడం తెలంగాణలో రాజకీయ సంచలనానికి తేరతీసింది. ECI, Kalvakuntla, Kavitha, TRSname, Teluguone, Telangana Politics

Publish Date: Jul 4, 2026 12:41PM

political-news-img

ఎవరైనా తీయని మాటలతో మోసం చేస్తున్నారా లేదా? ఇదిగో ఇలా తెలుసుకోండి!

చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం, ఈర్ష్య, అసూయ, ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు. చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు. వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు. వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు. తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా? తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా.. "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం జరగలేదు." వంటి మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే.. జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం. ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. *రూపశ్రీ.

Publish Date: Jul 4, 2026 11:53AM

political-news-img

మీకు టీ అంటే చాలా ఇష్టమా? ఒక్క నెల మానేసి చూడండి అద్బుతం చూస్తారు!

భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్ సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు. కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. నిద్ర నాణ్యత.. టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది. టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు. ఎసిడిటి, గ్యాస్.. ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దంత ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన.. అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చర్మం.. టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల, టీ మానేయడం వల్ల శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి, చర్మం మెరుపు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం.. అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు. *రూపశ్రీ.

Publish Date: Jul 4, 2026 11:50AM

political-news-img

2029 ఎన్నికల్లోనూ ఓటమే.. వైపీపీ ఇప్పుడే డిసైడైపోయిదా?

వైసీపీ వచ్చే ఎన్నికలలోనూ ఓటమి ఖరారని ఇప్పుడే మానసికంగా ఫిక్సైపోయిదా? వచ్చే ఎన్నికలలో కూడా పరాజయం తప్పదన్న నిర్ణయానికి వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు తాజాగాకేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) విషయంలో ఆ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, చేస్తున్న విమర్శలను ఎత్తి చూపుతూ పరిశీలకులు ఔననే అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు అధికార పక్షానికి కొమ్ముకాసేలా ఉన్నాయంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే ప్రక్రియను గత నెల 15 నుండి ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, ఓటర్ల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దీని ఆధారంగా జూలై 21న ఓటర్ల ప్రాథమిక ముసాయిదా విడుదల కానుంది. ఆ తర్వాత అభ్యంతరాలు, చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిశాక, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ 3 నెలల సుదీర్ఘ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైసీపీ విమర్శిస్తోంది. ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది. బూత్‌కు 50 చొప్పున తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందనీ సర్ గడువు నెల రోజులు పెంచాలంటూ వైసీపీ వినతిపత్రాలు ఇస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో ఓటమికి ఇప్పటి నుంచే రెడీ అయిపోతోందా? అన్న అనుమానాలు కలిగేలా చేస్తున్నదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ ఎలా జరుగుతుందన్న విషయంలో రహస్యమేదీ ఉండదు.. రాజకీయ పార్టీలకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రక్రియ పట్ల సంపూర్ణ అవగాహన ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి.. నివాసం ఉంటున్న వారినే ఓటర్లుగా గుర్తిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిశీలనలో అర్హులైన ఏ పౌరుడి ఓటు పోయే అవకాశమే ఉండదు. పోతే గీతే.. ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు.. చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు, మూడు నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఇదే వైసీపీని భయపెడుతోంది. అలా తొలగిపోయే ఓట్లన్నీ తమవేనని చెప్పుకుంటోంది. అలా చెప్పుకోవడం ద్వారా.. ప్రతి బూత్ కూ తమవి దాదాపు 50 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పకనే చెప్పుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. వైసీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి బూత్‌లోనూ భారీగా దొంగ ఓట్లను చేర్పించారన్న బలమైన ఆరోపణలను చూపిస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ద్వారా ఆ దొంగ ఓట్లు తొలగిపోతుండటంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందంటున్నారు. YSRCP Allegations on ECI, Voter Verification Process AP, Special Intensive Revision

Publish Date: Jul 4, 2026 11:35AM

political-news-img

విజయసాయి నోట వీజీటీఎమ్.. విసారెడ్డి అసలు వ్యూహం ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి స్టైలే వేరు. ఆయన రూటే సెపరేటు. రాజకీయ సన్యాసం అని ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమన్న చాటిన తరువాత కూడా విజయసాయి.. రాజకీయాలే మాట్లాడుతున్నారు. మనిషిగా ఆయన రాజకీయాలకు దూరం అని చెబుతున్నా.. ఆయన మనసు మాత్రం రాజకీయాలతోనే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఖరారైన తరువాత కూడా జగన్ కు అనుకూలంగా.. విజయసాయిరెడ్డి తాజాగా రాజధాని విషయంలో చేసిన కొత్త ప్రతిపాదన ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. నిన్నటి వరకు వైస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన ఆయన, ఇప్పుడు జగన్ మనసులోని ఆలోచనలను ప్రతిబింబించేలా, రాజధాని విషయంలో కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చి.. జగన్ పై తనకున్న భక్తిని, అభిమానాన్నీ చాటుకున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు తమ నినాదంమావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు) అని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టుగా సాగుతాయని కూడా జగన్ చెప్పారు. ఇక్కడే విజయసాయి రెడ్డి పైకి మావిగన్ ను వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తూనే.. జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలకు అదనంగా మంగళగిరిని కూడా చేర్చి, మచిలీపట్నాన్ని తొలగించి తెనాలి పేరును తీసుకువచ్చి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎమ్) ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. గతంలో శివరామకృష్ణ కమిషన్ కూడా ఈ వీజీటీఎం ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించిన విషయం తెలిసిందే. కేవలం ఒకే చోట అమరావతిని నిర్మించడం కంటే.. ఈ నాలుగు నగరాలను సమగ్రంగా విస్తరిస్తూ కనెక్టివిటీని పెంచితే, అది ఆటోమేటిక్‌గా రాష్ట్రానికి ఒక అద్భుతమైన మెగా రాజధాని అయిపోతుందంటూ విజయసాయి సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఒకవైపు అమరావతిపై విమర్శలు చేస్తూ, అక్కడ భారీగా అవినీతి జరిగిందని ఆరోపించడమే కాకుండా, ఈ వివాదంపై త్వరలోనే న్యాయస్థాన్ని ఆశ్రయిస్తానంటూ.. జగన్ చెప్పిన మాటలనే మరో డిక్షన్ తో విజయసాయి చెబుతున్నారు. విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి విదితమే. అప్పట్లో అమరావతిని ఏకాభిప్రాయంతో రాజధానిగా నిర్ణయించినప్పుడు గానీ, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు గానీ ఆయన ఎన్నడూ వీజీటీఎం ప్రస్తావన తీసుకు రాలేదు. ఇప్పుడు.. వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత...వీజీటీఎమ్ అంటూ మాట్లాడటం విజయసాయి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. AP Capital Row, Amaravati Controversy, VGTM Proposal, Mavigan Concept

Publish Date: Jul 4, 2026 10:55AM

MOVIE NEWS