Top Stories

political-news-img

ఎస్ క్యూబ్(S³).. లోకేష్ సక్సెస్ ఫార్ములా!

జాతీయ రాజకీయ యవనికపై ఏపీ మంత్రి మంత్రి నారా లోకేష్ తనదైన ముద్ర వేశారు. వేస్తున్నారు. రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ 'నేషన్ ఫస్ట్' అనే థీమ్‌తో హస్తిన వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ సదస్సులో షేపింగ్ పవర్ గా ఇండియా అనే ప్యానెల్ చర్చలో పాల్గొన్న నారా లోకేష్ ప్రపంచలొ ఇండియాను అగ్రస్థాయి ఆర్థిక శక్తిగా నిలపాలనే ప్రధాని నరేంద్ర మోదీ విశ్వగురు విజన్‌కు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తోడ్పడుతోందో కళ్లకు కట్టారు. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న S³.. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఫార్ములాను ఆయన ఈ వేదికపై ప్రకటించారు. ఈ సదస్సులో జాతీయ మీడియా ప్రతినిధులు సంధించిన క్లిష్టమైన ప్రశ్నలను లోకేష్ తనదైన శైలిలో ఎదుర్కొని పరిణితితో సమాధానాలు ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది ఎంపీల బలం ఉండటం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు దక్కుతున్నాయా? అన్న ప్రశ్నకు ఆయన.. కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి లోకేష్ ఇచ్చిన ఉదాహరణకు ప్యానెల్ సభ్యులు సైతం ఫిదా అయ్యారు. కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వస్తోందని సమాచారం అందగానే, మిగతా రాష్ట్రాలు ఇంకా ఆ దిశగా ఆలోచించకముందే ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా స్పందించిందన్న లోకేష్.. ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, కేవలం 37 రోజుల్లోనే ఏకంగా 600 ఎకరాల భూమిని ఆ ప్రాజెక్ట్ కోసం కేటాయించామనీ. . ఈ స్థాయి వేగం వల్లే రక్షణ శాఖ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ సొంతమైందన్నారు. ఇ ఈ వేగం కేవలం ఏపీ వృద్ధికే కాకుండా, చైనాకు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ సప్లై చైన్‌లో భారతదేశాన్ని నిలబెట్టడానికి ఎంతో అవసరమని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక డిజిటల్ సంస్కరణల గురించి లోకేష్ మాట్లాడినప్పుడు సదస్సులోని వారంతా సంభ్రమాశ్చర్యాలో అభినందనలు కురిపించారు. . కార్పొరేట్ సంస్థల నిర్వహణ తరహాలోనే తాము ప్రభుత్వ స్కూళ్లలో టెక్నాలజీని వాడుతున్నామన్న లోకేష్.. తాను అమరావతిలోని తన ఛాంబర్‌లో కూర్చొని డిజిటల్ స్క్రీన్ల ద్వారా రాష్ట్రంలోని ఏ స్కూల్‌లో ఏ టీచర్‌కు, ఏ విద్యార్థికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో రియల్ టైమ్‌లో పర్యవేక్షించగలనన్నారు. ఈవిధానాల వల్లే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్న లోకేష్.. ఇటీవలి కాలంలో ఏకంగా 85 వేల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లను వదిలి ప్రభుత్వ స్కూళ్లలో చేరడం ఒక చారిత్రాత్మక రికార్డు అని వెల్లడించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యమైన విద్యను, డిజిటల్ మౌలిక వసతులను తాము అందిస్తున్నామని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన రాజధాని అమరావతి నిర్మాణ కాలపరిమితిపై జాతీయ వేదిక నుంచి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. 2028 సంవత్సరానికల్లా అమరావతిలో ప్రధాన ప్రభుత్వ భవనాలన్నింటినీ ప్రారంభించి తీరుతామన్నారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిని కేవలం ఒక పరిపాలనా నగరంగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక తిరుగులేని ఎకనామిక్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారుజ జాతీయ స్థాయిలో లోకేష్ ప్రదర్శించిన ప్రసంగ పటిమ, స్పష్టమైన రోడ్‌మ్యాప్ భవిష్యత్ జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్రను పోషించబోతున్నారన్న బలమైన సంకేతాలను ఇచ్చింది.

Publish Date: Jun 23, 2026 2:25PM

political-news-img

పోస్టాఫీస్ బంపర్ స్కీమ్: రోజుకు రూ.100 దాచుకుంటే రూ.2 లక్షలు మీ సొంతం!

చాలా మందికి జీవితంలో డబ్బు సంపాదించడం సులువుగానే తెలుస్తుంది కానీ, ఆ వచ్చిన సంపాదనను ఎలా సరైన పద్ధతిలో పొదుపు చేయాలో అర్థం కాదు. మరికొందరైతే తమ నెలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని, అందులో ఇక పొదుపు చేయడానికి ఏం మిగులుతుందని భావిస్తూ ఉంటారు. అయితే ఆర్థిక నిపుణులు చెప్పే మాట ఒక్కటే.. పొదుపు చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, కేవలం స్థిరమైన ఆలోచన, క్రమశిక్షణ ఉంటే చాలు. రోజుకు రూ.500 సంపాదించే సామాన్యుడు లేదా చిరు వ్యాపారి సైతం సులభంగా పొదుపు చేసుకునేందుకు భారత ప్రభుత్వ పోస్టాఫీస్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (Post Office RD) పథకం. ఇందులో చాలా తక్కువ మొత్తంతోనే మీ పొదుపు ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఈ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో చేరడానికి కనీస పెట్టుబడి కేవలం రూ.100 మాత్రమే. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, మధ్యతరగతి ఉద్యోగులు ఎవరైనా సరే తమకు తోచిన మొత్తాన్ని నెలనెలా ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్‌డీ పథకంపై ఏకంగా 6.7 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది. విశేషం ఏమిటంటే, ఈ వడ్డీని ప్రతి త్రైమాసికానికి (Quarterly) ఒకసారి లెక్కిస్తూ ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వ రక్షణ ఉండటం వల్ల ఇందులో ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు, మీ పెట్టుబడికి పూర్తి గ్యారెంటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పథకంలో రోజుకు రూ.100 చొప్పున పక్కన పెడితే, నెలకు రూ.3,000 అవుతుంది. అంటే సంవత్సరానికి మీరు రూ.36,000 పొదుపు చేస్తారు. ఇలా ఐదేళ్ల పాటు (5 Years) క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, మీ మొత్తం పెట్టుబడి రూ.1,80,000 అవుతుంది. దీనిపై ప్రభుత్వ నియమాల ప్రకారం 6.7 శాతం వడ్డీ రేటుతో రూ.34,097 వడ్డీ లభిస్తుంది. దీనితో ఐదేళ్ల ఐదేళ్ల మెచ్యూరిటీ కాలం ముగిసేసరికి మీ చేతికి ఏకంగా రూ.2,14,097 లభిస్తాయి. చిన్న మొత్తాలతో ప్రారంభించి లక్షల రూపాయల నిధిని సమకూర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. పిల్లల భవిష్యత్తు చదువుల కోసం, అత్యవసర ఖర్చుల కోసం లేదా సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ పథకం ఎంతో అనువుగా ఉంటుంది. అయితే ఈ ఆర్‌డీ ఖాతాలో పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను కాలానుగుణంగా సమీక్షిస్తూ మారుస్తుంది. కాబట్టి మీరు చేరే సమయానికి ఉన్న వడ్డీ రేటును బట్టి మీ తుది మెచ్యూరిటీ మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి నెల నిర్ణీత గడువులోగా డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది, ఆలస్యంగా కడితే పెనాల్టీ పడటమే కాకుండా వడ్డీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పోస్టాఫీసులో ఈ పథకంతో పాటు సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్ వంటి మరెన్నో సురక్షితమైన పొదుపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

Publish Date: Jun 23, 2026 12:57PM

political-news-img

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం (జూన్ 23) భారీ అగ్నిప్రమా దం సంభవించింది. దక్షిణ్ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిశ్రమ మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే కొందరు బయటకు వచ్చే దారిలేక లోపలే చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. మరి కొందరు కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకున్నారని అంటున్నారు. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయ టకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీ పంలోని ఆస్పత్రులకు తర లించి చికిత్స అందిస్తు న్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు భారీగా ఎగసి పడ్డాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Publish Date: Jun 23, 2026 12:54PM

political-news-img

పాన్-ఆధార్ లింక్ చేయలేదా? బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రయాణంలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అనేవి అత్యంత కీలకమైన పత్రాలుగా మారిపోయాయి. అయితే ఇప్పటికీ దేశవ్యాప్తంగా కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు తమ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయకుండా అలాగే ఉంచేశారు. ఈ నిర్లక్ష్యం కారణంగా వారి పాన్ కార్డులు ప్రస్తుతం 'ఇన్-ఆపరేటివ్' అంటే పనిచేయని స్థితిలోకి వెళ్లిపోయాయి. ఆదాయపు పన్ను శాఖ దేశంలో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడానికి, పన్ను ఎగవేతలను పూర్తిగా అరికట్టడానికి ఈ రెండు పత్రాల అనుసంధానాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేసింది. మీరు కూడా మీ లింకింగ్ ప్రక్రియను ఇంకా పూర్తి చేయకపోతే, భవిష్యత్తులో తీవ్రమైన చట్టపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గడువు ఇప్పటికే ముగిసిపోయినప్పటికీ, పౌరులకు మరో అవకాశం కల్పించింది. గతంలో ఇచ్చిన డెడ్‌లైన్లను మిస్ అయిన వారు ఎవరైనా సరే, ప్రస్తుతం రూ. 1,000 జరిమానా (ఫైన్) చెల్లించి తమ పాన్-ఆధార్ కార్డులను సులభంగా అనుసంధానం చేసుకోవచ్చు. ఈ జరిమానా మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు చెందిన అఫీషియల్ పోర్టల్‌లో 'e-Pay Tax' అనే ప్రత్యేక ఫీచర్‌ను ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా చాలా సులభంగా చెల్లించే వీలుంది. ఒకవేళ మీరు ఈ వెయ్యి రూపాయల పెనాల్టీని చెల్లించి లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయకపోతే, మీ ఆర్థిక ప్రొఫైల్‌పై ప్రభుత్వం విధించిన కఠినమైన ఆంక్షలు అలాగే కొనసాగుతాయి. ఇది మీ దైనందిన బ్యాంకింగ్ వ్యవహారాలను పూర్తిగా నిలిపివేసే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ పాన్ కార్డ్ పనిచేయకపోతే, దాని ప్రభావం మీ బ్యాంకు ఖాతాలపై మరియు ఇతర ఆర్థిక లావాదేవీలపై చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ప్రభుత్వం నుండి రావలసిన ఆదాయపు పన్ను రీఫండ్‌లు (Tax Refunds) పూర్తిగా నిలిచిపోతాయి. అంతేకాకుండా, మీ జీతం లేదా ఇతర ఆదాయాలపై కట్ అయ్యే టీడీఎస్ (TDS - Tax Deducted at Source) రేటు సాధారణం కంటే భారీగా పెరిగి ఏకంగా 20 శాతానికి చేరుకుంటుంది. రికార్డుల్లో మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా లేకపోతే, బ్యాంకులు మీకు కొత్త సేవింగ్స్ ఖాతాలను తెరవడానికి నిరాకరిస్తాయి. అలాగే కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయడం కానీ, అత్యవసర సమయాల్లో హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ దరఖాస్తులను ఆమోదించడం కానీ చేయవు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే వెంటనే అఫీషియల్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించి మీ లింకింగ్ స్టేటస్‌ను ఒకసారి సరిచూసుకోవాలి. ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు మీ రెండు డాక్యుమెంట్లలో ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ మరియు లింగం వంటి వివరాలు ఖచ్చితంగా ఒకేలా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీ ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ వివరాలు తప్పుగా ఉంటే, మీ లింకింగ్ అభ్యర్థన తిరస్కరణకు గురవుతుంది. అటువంటి సందర్భంలో మొదటగా స్థానిక ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి వివరాలను అప్‌డేట్ చేయించుకోవాలి. ఆ తర్వాతే జరిమానా చెల్లించి అనుసంధానం పూర్తి చేయాలి. ఇలా నియమ నిబంధనలను పాటించడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి లాభదాయకమైన పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోండి.

Publish Date: Jun 23, 2026 12:53PM

political-news-img

ఐటీ నుంచి ఏఐ వరకు.. నారా లోకేష్ ట్రాన్స్‌ఫార్మేషన్!

పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ ప్రస్థానం ఒక అద్భుతం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం నుంచి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, విద్యా పరంగా దేశంలోనే నంబర్ వన్ గా నిలిపే విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు, అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకుర దీటుగా ఇస్తున్న కౌంటర్లు.. ఆయనలోని పరిణితికి అద్దం పడుతున్నాయి. అదే సమయంలో జాతీయ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన ప్రదర్శిస్తున్న పరిణితి అందరినీ విస్మయ పరుస్తోంది. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇసుమంతైనా తడబాటు లేకుండా స్పాంటేనియస్ గా ఇస్తున్న సమాధానాలు, గణాంకాలతో సహితంగా ఆయన చెబుతున్న వివరాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఆంధ్రప్రదేశ్‌ను ఎలా నడిపించబోతున్నారో ఇటీవల ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ వివరిం వివరించిన తీరు ఆయన పొలిటికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను కళ్ళకు కట్టింది. లోకేష్ విజన్‌కు దిగ్గజ నేతలు సైతం ఫిదా అవుతున్నారు. అయితే నారా లోకేష్ లోని మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. 2019 మంగళగిరి ఎన్నికల ఓటమి లోకేష్‌ను రాటుదేల్చింది. కేవలం 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన..కుంగిపోలేదు.. వెనకడుగు వేయలేదు. అదే మంగళగిరిని తన స్థావరంగా మార్చుకుని ప్రజా సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత ఆయన చేపట్టిన 400 రోజుల యువగళం పాదయాత్ర లోకేష్ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సుమారు నాలుగువేల కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో మంగళగిరిలో 91,413 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి.. గత 39 ఏళ్లుగా అక్కడ గెలుపు అన్నదే ఎరుగని తెలుగుదేశం పార్టీకి అద్భుత విజయాన్ని అందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి , రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా లోకేష్ సరికొత్త పాలనా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మాత్రమే కాకుండా.. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను తమ ప్రభుత్వ పాలసీగా మార్చేశారు. ఇందుకు ఉదాహరణగా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్ కోసం కేవలం 37 రోజుల్లోనే భూసేకరణ పూర్తి చేయడాన్ని చెప్పుకోవచ్చు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థల ప్రాజెక్టులను వేగంగా ఆకర్షిస్తూ, రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద పారించేలా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే ఏకంగా 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలను సాధించామని, వాటిని త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని లోకేష్ గణంకాలతో సహా జాతీయ మీడియా ముందు ఆవిష్కరించిన తీరు ఆయనకు ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు దక్కేలా చేసింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పిన నారా లోకేష్.. గతంలో హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఎలా నిర్మించామో, అంతకంటే మెరుగైన ఫలితాలను విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌లో కేవలం 10 ఏళ్లలోనే సాధించి చూపిస్తామని లోకేష్ ధీమాగా చెబుతున్నారు. డిజిటల్ టెక్నాలజీ, లైవ్ డేటా ఫీడ్స్, రియల్ టైమ్ డ్యాష్‌బోర్డుల ద్వారా రికార్డు స్థాయిలో 52 లక్షల మందిని తెలుగుదేశం సభ్యులుగా చేర్పించిన లోకేష్ ఇప్పుడు అదే సాంకేతికతను ఏపీ అభివృద్ధికి సమర్థంగా వాడుతున్నారు. నారా లోకేష్ ఈ పొలిటికల్ ట్రాన్స్‌ఫార్మేషనే ఆయనను ప్రజా నాయకుడిగా అందరూ గుర్తించేలా చేస్తోంది.

Publish Date: Jun 23, 2026 12:45PM

MOVIE NEWS