political-news-img

తమిళనాట స్టాలిన్‌కు వైగో షాక్!

తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. వైకో టీవీకే అధినేత, సీఎం విజయ్‌ను కలవడం, విజయ్ నాయకత్వంపై ప్రశంసులు కురిపించడం తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రానున్న ఎన్నికల్లో టీవీకే మరింత అద్భుత ఫలితాలు సాధిస్తుందని వైకో వ్యాఖ్యానించడం స్టాలిన్ శిబిరంలో కలకలం రేపుతోంది. తాజాగా వైకో, విజయ్ భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో విజయ్ మ్యాజిక్ చేసే అవకాశముందని వైకో అభిప్రాయపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. 1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించిన వైకో, ఇటీవల ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్కులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌తో కలిసి నాలుగు స్థానాల్లో పోటీ చేశారు. రెండో స్థానాల్లో ఎండీఎంకే అభ్యర్ధులు గెలిచారు. అయితే కొంతకాలంగా ఎండీఎంకే నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. వైకో కుమారుడు ఎండీఎంకే కీలక నేత దురై వైకో ఇటీవల టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. వైకో వంటి సీనియర్ ద్రవిడ నాయకుడు విజయ్‌ని బహిరంగంగా ప్రశంసించడంతో రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రస్తుతం వైకో డీఎంకే కూటమిలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఆయన స్టాండ్ ఎలా ఉండబోతుందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎండీఎంకే నిజంగానే డీఎంకే కూటమిని వీడి టీవీకేతో జతకడితే, అది స్టాలిన్‌కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు. విజయ్‌కి ద్రవిడ రాజకీయాల్లో మైలేజ్ మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Publish Date: Jun 18, 2026 3:28PM

political-news-img

తాడేపల్లి ప్యాలెస్ దాటి రా.. చర్చకు సిద్ధం.. జగన్ కు లోకేష్ సవాల్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో నిరుద్యోగులను ఘోరంగా వంచించిందని లోకేష్ ధ్వజమెత్తారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పారదర్శకంగా మెగా డీఎస్సీ ప్రక్రియను చేపట్టి 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు వేసిందని గుర్తుచేశారు. ఈ భర్తీ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు 240కి పైగా కోర్టు కేసులు వేసి కుట్రలు పన్నారని ఆరోపించారు. కోర్టులు ఆ కేసులను కొట్టివేసినా.. ఇంకా బురదజల్లేందుకే వైకాపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. త్వరలోనే మళ్లీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు నమ్మకం ప్రకటించారు. రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ నేతలు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలను లోకేష్ తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల వైకాపా నేతలకు ఉన్న సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు. ఒక హోంమంత్రి అని కూడా చూడకుండా ఆమె దుస్తులు, బాడీ లాంగ్వేజ్‌పై నీచంగా మాట్లాడిన వ్యక్తిని మెచ్చుకుంటూ జగన్‌మోహన్ రెడ్డి ఫోన్ చేసి అభినందించడం దారుణమన్నారు. తమ కుటుంబ మహిళలను గతంలో అవమానించినా.. తాము మాత్రం ప్రతిపక్ష మహిళా నేతలను గౌరవిస్తామని, సోషల్ మీడియాలో హద్దులు దాటిన తమ కార్యకర్తలను సైతం జైలుకు పంపిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్‌లకే పరిమితం కాకుండా జగన్ క్షేత్రస్థాయిలోకి వస్తే నిజాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4,000 వృద్ధాప్య పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను పక్కాగా అమలు చేస్తోందని వివరించారు. ఐటీ ఆధారిత అప్లికేషన్ల ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తుంటే, అవగాహన లేని వైకాపా నేతలు ఓట్లు తొలగిస్తున్నారంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. అభివృద్ధిపై చర్చకు జగన్ ఎక్కడికి రమ్మన్నా తానే వస్తానని లోకేష్ సవాల్ విసిరారు.

Publish Date: Jun 18, 2026 3:26PM

political-news-img

రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా?  అసలు  నిజం ఏంటంటే!

భారతీయుల ప్రధాన ఆహారం అన్నం. మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న భోజనంలో అయినా, రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా.. కనీసం అందులో కాసింత అన్నం అయినా లేకపోతే భోజనం తిన్న తృప్తి ఉండదు చాలామందికి. అయితే ఈ మధ్యకాలంలో రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలు తినమని కొందరు, టిఫిన్ లు తినమని మరికొందరు చెబుతూ ఉంటారు. రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని కూడా చెబుతుంటారు. రాత్రి సమయంలో అన్నం తింటే బరువు పెరుగుతారా? ఇది నిజమా? దీని గురించి వైద్యులు చెబుతున్న నిజాలు ఏంటి? తెలుసుకుంటే.. బరువు పెరగడానికి అసలు కారణం.. డాక్టర్ల ప్రకారం.. బరువు పెరగడం లేదా తగ్గడం అనేది తినే ఏదో ఒక ఆహారంపై ఆధారపడి ఉండదు. అది పూర్తిగా రోజూ తీసుకునే కేలరీలు , శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, ఆ కేలరీలు అన్నం నుండి వచ్చినా లేదా ఇతర ఆహారాల నుండి వచ్చినా బరువు పెరుగడం జరుగుతుంది. అందువల్ల, రాత్రిపూట కేవలం అన్నం తింటేనే లావు అవుతామని చెప్పలేమని అంటున్నారు. అన్నం తినవద్దని ఎందుకు అంటారంటే.. అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. రాత్రి భోజనం చేసేటప్పుడు, శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల, ఎక్కువగా అన్నం తిని, రోజువారీ కేలరీల పరిమితిని మించిపోతే, అదనపు శక్తి శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం మొదలవుతుంది. అందుకే రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. బియ్యం రకం ముఖ్యం.. అన్ని రకాల బియ్యం ఒకేలా ఉండవని వైద్యులు చెబుతున్నారు. తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్, అంటే తక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది. అన్నాన్ని పప్పులు, పుష్కలంగా కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి , అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియ, నిద్రపై అన్నం ప్రబావం.. ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి రాత్రిపూట అన్నం తినడం సులభంగా జీర్ణమై, బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరోవైపు, మరికొందరు ఎక్కువగా అన్నం తిన్న తర్వాత కడుపులో భారంగా ఉన్నట్లు ఫీలవుతారు. దీన్ని బట్టి అన్నం యొక్క ప్రభావాలు ప్రతి వ్యక్తి జీర్ణవ్యవస్థ, జీవనశైలి , ఆరోగ్యంపై ఆధారపడి మారుతూ ఉంటాయి. సమతుల్యం ఉంటేనే.. రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారన్న భావన పూర్తిగా నిజం కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, రోజువారీ కేలరీలను గమనిస్తూ, సమతుల్య మోతాదులో అన్నం తింటే, రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరగడం అనేది జరగదు. బరువును అదుపులో ఉంచుకోవడానికి, రోజులోని సమయం కంటే కూడా తినే ఆహారం పరిమాణం, ఆహార రకం , మొత్తం జీవనశైలికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల, అన్నాన్ని సరైన మోతాదులో , సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది. *రూపశ్రీ.

Publish Date: Jun 18, 2026 3:21PM

political-news-img

అసెంబ్లీలో తమిళనాడు గవర్నర్ క్షమాపణలు.. ఎందుకంటే?

తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటూనే ఉంటుంది. తాజాగా రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఒక అరుదైన, అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటన జరిగింది. సాధారణంగా గవర్నర్ ప్రసంగాలు, అసెంబ్లీ సమావేశాలు అంటే రాజకీయ విమర్శలు, సభలో గందరగోళం వంటివి మనం చూస్తుంటాం. కానీ ఈసారి తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చేసిన ఒక ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. తన ప్రసంగం మధ్యలోనే ఆయన సభకు, తమిళ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఒక రాష్ట్ర అత్యున్నత పదవిలో ఉన్న గవర్నర్ ఇలా క్షమాపణలు చెప్పడం వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు శాసనసభ బడ్జెట్ లేదా నూతన సంవత్సర సమావేశాల సందర్భంగా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ విధానాలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే, ఈ ప్రసంగ పాఠంలో తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు, చారిత్రక వ్యక్తుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. మాతృభాష తమిళం కాని గవర్నర్ అర్లేకర్, ఆ పేర్లను చదువుతున్న సమయంలో వాటిని స్పష్టంగా పలకలేకపోయారు. అనేక మంది తమిళ నేతల పేర్లను ఆయన తప్పుగా ఉచ్ఛరించారు. తమిళ సంస్కృతిలో, రాజకీయాల్లో అక్కడి నేతల పేర్లకు, భాషకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన గవర్నర్ వెంటనే అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఇలాంటి తప్పులు దొర్లినప్పుడు చాలామంది వాటిని దాటవేస్తుంటారు లేదా సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. కానీ గవర్నర్ అర్లేకర్ మాత్రం అలా చేయలేదు. తమిళ భాషపై, అక్కడి నేతలపై ఉన్న గౌరవంతో ఆయన పెద్ద మనసు చేసుకున్నారు. ప్రసంగం మధ్యలోనే ఆగి, తాను తమిళ నేతల పేర్లను సరిగ్గా ఉచ్ఛరించలేకపోయానని, తప్పుగా పలికినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని సభ ముఖంగా ప్రకటించారు. తన మాతృభాష తమిళం కాకపోవడం వల్లే ఈ ఉచ్ఛారణ దోషాలు దొర్లాయని ఆయన వివరించారు. గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం అసెంబ్లీలోని సభ్యులను సైతం ఆకట్టుకుంది. భాషాభిమానం ఎక్కువగా ఉండే తమిళనాడులో గవర్నర్ ఇలా క్షమాపణలు చెప్పడం ఒక సానుకూల చర్చకు దారితీసింది. రాజకీయాల్లో ఇగోలు, విభేదాలు పక్కన పెట్టి, తాను చేసిన చిన్న పొరపాటును కూడా అంగీకరించి క్షమాపణ చెప్పిన గవర్నర్ అర్లేకర్ తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి కూడా ఎలాంటి సంకోచం లేకుండా తప్పును ఒప్పుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో ఇదొక ప్రత్యేకమైన మరియు గౌరవప్రదమైన ఘట్టంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఘటన ద్వారా భాష పట్ల, ప్రాంతీయ నేతల పట్ల చూపించాల్సిన గౌరవం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది.

Publish Date: Jun 18, 2026 3:13PM

political-news-img

రుషికొండ ప్యాలెస్ లో ప్రభుత్వం ఏం చేయబోతోంది

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు రూ.450 కోట్ల ప్రజాధనంతో నిర్మితమైన ఈ లగ్జరీ భవన సముదాయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జనలు పడుతోంది. ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉన్న ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యావరణ నిబంధనలను సైతం పక్కనబెట్టి రుషికొండపై ఈ భారీ రాజసౌధాన్ని నిర్మించారు. అప్పట్లో దీనిని టూరిజం ప్రాజెక్టుగా ప్రచారం చేసినప్పటికీ.. వాస్తవానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అధికారిక నివాసంగా వాడుకునేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించుకున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్యాలెస్‌ను స్వయంగా పరిశీలించి మీడియాకు కూడా చూపించారు. అయితే.. ప్రభుత్వం మారి నెలలు గడుస్తున్నా ఈ భవనాన్ని దేనికి ఉపయోగించాలనే దానిపై స్పష్టత రాలేదు. ఈ ప్యాలెస్ నిర్వహణ, సెక్యూరిటీ కోసం నెలకు దాదాపు పాతిక లక్షలు.. అంటే ఏడాదికి సుమారు రూ.3 కోట్ల చొప్పున ఇప్పటికే ఆరు కోట్ల రూపాయల ప్రజాధనం కేవలం మెయింటెనెన్స్ కోసమే బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినప్పటికీ తుది నిర్ణయం వెలువడలేదు. ఈ వివాదాస్పద కట్టడాన్ని ఒక ఐకానిక్ స్టార్ హోటల్‌గా మార్చాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు. కానీ పెద్ద పెద్ద హాల్స్, విలాసవంతమైన బాత్‌టబ్‌లతో ఉన్న ఈ ప్యాలెస్‌ను హోటల్ గదులుగా మార్చడానికి మళ్లీ రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు అదనపు ఖర్చు అవుతుందని అంచనా. పైగా పర్యాటక హోటల్‌గా మారిస్తే రుషికొండ పర్యావరణానికి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే సంశయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రుషికొండకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందన్నారు. పూర్వం ఋషులు తపస్సు చేసిన పవిత్ర స్థలం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. కాబట్టి ఈ భవనాన్ని ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా అంతర్జాతీయ ఆధ్యాత్మిక లేదా యోగా కేంద్రంగా మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇది పర్యావరణానికి హాని చేయకపోగా, విశాఖకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెస్తుందన్నారు. మరికొందరు మాత్రం గత ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిందో ప్రజలకు చూపించడానికి దీనిని ఒక ప్రభుత్వ మ్యూజియంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాలయాపన పెరిగేకొద్దీ ప్రజాధనం వృధా అవుతూనే ఉంటుంది కాబట్టి.. కూటమి ప్రభుత్వం త్వరగా స్పందించి ఈ భవనాన్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Publish Date: Jun 18, 2026 3:10PM

political-news-img

ఒడిశా అడవుల్లో ఈగల్ ఫోర్స్ దాడి.. 500 కిలోల గంజాయి స్వాధీనం

తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది. ఒడిశా లోని దట్టమైన కోరాపుట్ అటవీ ప్రాంతంలో అత్యంత సాహసోపేతంగా నిర్వహిం చిన ఈ ఆపరేషన్‌లో ఈగల్ ఫోర్స్ 500 కిలోల గంజా యిని స్వాధీనం చేసుకు న్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈగల్ ఫోర్స్ నిర్వహించిన ఈ హై రిస్క్ ఆపరేషన్‌కు ఒడిశా పోలీసులు ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపిం చారు.విశ్వసనీయమైన సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ బృందాలు, బలిమేళా నుంచి జయపూర్ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని వెంబడించారు. అడవులు, ఘాట్ రోడ్లు దాటుకుంటూ సాగిన ఉత్కంఠభరిత చేజింగ్ అనంతరం వాహ నాన్ని అటవీ ప్రాంతం లో నిలిపివేసిన డ్రైవర్ చీకటి మాటున పరారయ్యాడు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు అందులో మొత్తం 115 ప్యాకెట్లలో దాచిన 500 కిలోల గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. వీటిలో 90 ప్యాకెట్లు ఐదు కిలోల చొప్పున, మరో 25 ప్యాకెట్లు రెండు కిలోల చొప్పున ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని ఒడిశా కోరాపుట్ పోలీసు లకు అప్పగించారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహనం ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాకు చెందిన అమీర్ అలీ ఖాన్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.కాగా, 2024లో కూడా రాంచీ వరకు వెంబడించి 500 కిలోల గంజాయిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్, మరోసారి అదే స్థాయిలో విజయవంతమైన అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వ హించడం విశేషం.... తెలంగాణకు మాదకద్ర వ్యాల సరఫరాను అడ్డుకునే క్రమంలో ఈగల్ ఫోర్స్ చేప డుతున్న వరుస చర్యలు స్మగ్లింగ్ ముఠాల్లో గుండె దడ పుట్టిస్తున్నాయి... తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేసిన సాహసాన్ని చూసి ఒరిస్సా పోలీసులు సైతం అవాక్కయ్యారు.... ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులు ఈగల్ ఫోర్స్ ను అభినందించారు...

Publish Date: Jun 18, 2026 2:59PM

MOVIE NEWS