political-news-img

వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉప‌సంహ‌రించుకోవాలి : మంత్రి సీత‌క్క‌

వీబీజీ రామ్‌జీ చట్టంపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించిన సీత‌క్క‌.. న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీ రామ్‌జీ చట్టం అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను మంత్రి సీతక్క వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర ప్రభుత్వ తరఫున వినతిపత్రాన్ని అందజేశారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క మాట్లాడుతూ, కొత్త చట్టంలో రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం మోపే నిబంధనలు ఉన్నాయని, వాటిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిందని తెలిపారు. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో ఉపాధి హామీ పథకం కింద కూలీల వేతన భారం 100 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించేదని, మెటీరియల్ కాంపోనెంట్‌లో కూడా కేంద్రం 75 శాతం వాటా కల్పించేదని గుర్తు చేశారు. కొత్త విధానంలో 60:40 నిష్పత్తి అమలు చేయడం వల్ల రాష్ట్రాలపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వాటా కొన్ని వందల కోట్ల రూపాయల పరిధిలో ఉండగా, కొత్త విధానంలో తెలంగాణ వాటా సుమారు రూ.2,000 కోట్ల వరకు పెరిగే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. వీబీజీ రామ్‌జీ చట్టంలో ప్రతిపాదించిన కొన్ని నిబంధనలు పేదలు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా చట్టాన్ని తీసుకురావడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. చట్టానికి పేరు మార్చడమే కాకుండా, అమలులో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక బాధ్యతలు మోపడం సరైన విధానం కాదన్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఇతర కీలక అంశాలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన కింద రెండు సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి కేంద్రానికి పంపించినప్పటికీ ఇప్పటికీ ఇళ్ల మంజూరు జరగలేదని, వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తెలంగాణలో మంజూరైన అనేక రహదారి పనులు అటవీ, వన్యప్రాణి అనుమతుల సమస్యలతో నిలిచిపోయాయని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్లమల, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో రోడ్లు, నివాసాలు, బోర్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం కూడా అటవీ అనుమతుల కారణంగా నిలిచిపోతోందని వివరించారు. రోడ్లకు కేంద్రం మంజూరు ఇచ్చినప్పుడే అటవీ శాఖ నుంచి అవసరమైన క్లియరెన్స్‌లు కూడా కల్పించే విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈ అంశాలపై సానుకూలంగా స్పందించారని, అటవీ అనుమతుల సమస్యల పరిష్కారం కోసం సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. వీబీజీ రామ్‌జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టమని, రాష్ట్ర ప్రయోజనాలు, గ్రామీణ పేదల సంక్షేమం, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే మంత్రివర్గం తుది నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కొత్త చట్టంలో చేరాలా, వద్దా అనే అంశంపై జూలై 2న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నిర్ణయం తెలియజేస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో నూత‌న చ‌ట్టంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌ వీబీజీ రామ్‌జీ చట్టానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అభ్యంతరాలు, సూచనలను సమావేశంలో మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)ను హక్కు ఆధారిత కార్యక్రమంగానే కొనసాగించాలని, ప్రతిపాదిత వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త చట్టం గ్రామీణ పేదల పని హక్కును బలహీనపరచడంతో పాటు గ్రామ పంచాయతీల అధికారాలను తగ్గించి, రాష్ట్రాల పాత్రను పరిమితం చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రణాళిక, పనుల ఎంపిక, నిధుల కేటాయింపు, అమలు, పర్యవేక్షణ వంటి కీలక అధికారాలను కేంద్రం వద్దే కేంద్రీకరించడం సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా మాత్రమే నిధుల కేటాయింపు చేయడం సమంజసం కాదని, గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న వాస్తవ ఉపాధి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని నిధులు కేటాయించాలని తెలంగాణ సూచించింది. గత ఐదేళ్లలో రాష్ట్రాలకు కల్పించిన పని దినాలకు 80 శాతం, ఆర్థిక సంఘం సిఫార్సులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని ప్రతిపాదించింది. వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ఐదో షెడ్యూల్ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కోరారు. కొత్త చట్టంలో కేంద్రం కేవలం 60 శాతం మాత్రమే నిధులు భరిస్తుండగా, మిగిలిన 40 శాతం రాష్ట్రాలపై భారం పడుతోందని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రాయోజిత పథకాల వల్ల రాష్ట్రాలపై ఆర్థిక ఒత్తిడి పెరిగిందని, మరింత భారం మోపడం అమలును క్లిష్టతరం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాలతో సమగ్ర సంప్రదింపులు జరపకుండానే చట్టం రూపొందించడం సరికాదని, రాష్ట్రాలకు ప్రణాళిక, అమలు, పర్యవేక్షణలో మరింత అధికారాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నూతన చట్టంలో అనుమతించే పనుల జాబితాను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం, వ్యక్తిగత భూఅభివృద్ధి పనులు, వరదల అనంతర పునరుద్ధరణ పనులు, న్యూట్రి గార్డెన్లు, వెదురు తోటలు, కూరగాయల పందిళ్లు, పశుగ్రాస అభివృద్ధి, వర్క్‌షెడ్లు వంటి స్థానిక అవసరాలకు అనుగుణమైన పనులను చట్టంలో చేర్చాలని సూచించింది. రాష్ట్రాల స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త పనులను ఆమోదించే స్వేచ్ఛ కల్పించాలని మంత్రి కోరారు. పథకంలో ప్రతిపాదించిన తప్పనిసరి 60 రోజుల ఉపాధి విరామాన్ని పూర్తిగా ఉపసంహరించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిబంధన గ్రామీణ పేద కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని మంత్రి వివరించారు. రైతుల ప్రయోజనాలు, ఉపాధి కూలీల ప్రయోజనాలు పరస్పర విరుద్ధం కాదని, గ్రామీణ పరిస్థితులు రాష్ట్రానికో, ప్రాంతానికో భిన్నంగా ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఐదో షెడ్యూల్ ప్రాంతాలు, నీటి ఎద్దడి ప్రాంతాలు, మొక్కల పెంపకం కార్యక్రమాలు, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల పనులకు ఈ నిబంధన నుంచి మినహాయింపులు కల్పించాలని సూచించారు. తెలంగాణలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాలకు ఈశాన్య రాష్ట్రాల తరహాలో 90:10 కేంద్ర రాష్ట్ర నిధుల నిష్పత్తిని అమలు చేయాలని కూడా కోరారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, భూమిలేని వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు, ఇతర బలహీన వర్గాల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా కొత్త చట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల నుంచే వచ్చే వాస్తవ ఉపాధి డిమాండ్ ఆధారంగా ప్రణాళిక, పనుల ఎంపిక, నిధుల కేటాయింపు జరిగితేనే అత్యంత వెనుకబడిన గ్రామాలకు సమర్థవంతంగా ప్రయోజనం చేకూరుతుందని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ పేద కుటుంబాల ఉపాధి హక్కులను పరిరక్షించడం, గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం, రాష్ట్రాలకు తగిన స్వేచ్ఛ, గౌరవం కల్పించడం ద్వారా మాత్రమే గ్రామీణాభివృద్ధి లక్ష్యాలు సమర్థవంతంగా సాధ్యమవుతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, సహకార సమాఖ్య స్ఫూర్తితో గ్రామీణ భారత అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Publish Date: Jun 29, 2026 6:59PM

political-news-img

షైనింగ్ స్టార్లే మా బ్రాండ్ అంబాసిడర్లు : మంత్రి లోకేష్

దేశం మొత్తం ఏపీ విద్యా మోడల్ గురించే మాట్లాడాలి... వచ్చే ఏడాది మరో రెండు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే రాష్ట్రానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘షైనింగ్ స్టార్స్’ సత్కార కార్యక్రమంలో గత ఏడాది పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి ఘనంగా సన్మానించారు. 55 మంది పదో తరగతి విద్యార్థులకు రూ.30 వేల నగదు బహుమతి, మెడల్, సర్టిఫికెట్ అందజేయగా, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “మీరు గెలిచారు... నన్ను గెలిపించారు. మన విద్యావ్యవస్థను గెలిపించారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చారు” అని అభినందించారు. విద్యాశాఖ వ్యవసాయం లాంటిదని, ఫలితాలు ఒక్కరోజులో రావని, నిరంతర కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్‌లాండ్‌కు పంపిస్తూ అక్కడి అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి ఏపీలో అమలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా “ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్” గురించి చర్చ జరిగేలా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, గతంలో చిన్నచూపు ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం సిఫారసులు కోరే పరిస్థితి వచ్చిందని లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల నుంచి 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఆ విజయానికి షైనింగ్ స్టార్స్‌నే కారణమని అన్నారు. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు అన్నీ విద్యార్థి కేంద్రంగానే రూపుదిద్దుకున్నాయని తెలిపారు. వన్ క్లాస్–వన్ టీచర్ విధానం, లీప్ మిషన్, లీప్ యాప్, స్టూడెంట్ కిట్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, సెంట్రలైజ్డ్ కిచెన్లు, నో బ్యాగ్ డే, క్లిక్కర్ టెక్నాలజీ, త్వరలో ఏఐ ట్యూటర్ ప్రవేశపెట్టడం వంటి చర్యలతో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం 72.8 నుంచి 78.39 శాతానికి పెరిగిందని వెల్లడించారు. విద్య అనేది జీవితంలో అత్యుత్తమ పెట్టుబడిగా అభివర్ణించిన లోకేష్, విద్యార్థులు తమ పాఠశాలలను ఎప్పటికీ మర్చిపోవద్దని, భవిష్యత్తులో అవకాశాలు వచ్చినప్పుడు తమ చదువుకున్న విద్యాసంస్థలకు సహాయం చేయాలని సూచించారు. పాఠశాలల్లో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేసిన మంత్రి, పాఠ్యపుస్తకాల నుంచి రాజకీయ ప్రచార అంశాలను తొలగించామని తెలిపారు. విలువలతో కూడిన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళల పట్ల గౌరవ భావన చిన్ననాటి నుంచే అలవర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Publish Date: Jun 29, 2026 6:42PM

political-news-img

జొన్నగిరి కంటే కుప్పం భూముల్లోనే ఎక్కువ బంగారం!

కేజీఎఫ్ చేతులెత్తేసిన చోట తవ్వకాలు సాధ్యమా...? రాయలసీమ.. రతనాల సీమ అంటారు. ఆ మాటేమో కాని ఇప్పుడు పసిడి గనులకు సీమ కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. తాజాగా కుప్పం ప్రాంతంలోనూ బంగారం ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. జొన్నగిరితో పోలిస్తే కుప్పంలోని ముడి ఖనిజంలోనే బంగారం ఎక్కువ ఉంది. అయితే కుప్పం ప్రాంతంలో ఖనిజం భూగర్భంలో ఉండటంతో మైనింగ్‌కు ఎక్కువ ఖర్చవుతుంది. కుప్పం సమీపంలోని చిగురుగుంట, బిసానత్తం ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నాయి. భౌగోళికంగా ఈ ప్రాంతం కర్ణాటకలోని కోలార్‌కు చేరువగా ఉండటంతో దశాబ్దాల క్రితమే ఇక్కడ బంగారం కోసం తవ్వకాలు చేపట్టి.. ఇక్కడి మట్టిని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కు తీసుకెళ్లి శుద్ధి చేసేవారు. జొన్నగిరి ప్రాంతంలోని కొన్ని గనుల్లో 1 టన్ను ముడి ఖనిజం నుంచి 1.5 గ్రాముల వరకు బంగారం వస్తుంది. కొన్ని ప్రత్యేక జోన్లలోనే 4-5 గ్రాముల బంగారం వస్తుంది. కుప్పంలోని బిసానత్తంలో 1 టన్ను ముడి ఖనిజం నుంచి 4 గ్రాముల బంగారం వెలికి తీయొచ్చు. అయితే జొన్నగిరి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కావడంతో తక్కువ ఖర్చవుతుంది. అదే కుప్పం ఏరియాలో ఇప్పటికే ఉపరితలం మీద ముడి ఖనిజాన్ని తవ్వేయడంతో, భూగర్భంలో తవ్వకాలు జరపాల్సి ఉండటంతో, ఖర్చు ఎక్కువ. గనుల్లో లోతుకు వెళ్లే కొద్దీ ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. భూమి లోతుల్లో తవ్వకాలతో నష్టాలు రావడంతో కేజీఎఫ్‌తోపాటు చిగురుగుంట, బిసానత్తం గనుల్లో తవ్వకాలను గతంలో పూర్తిగా నిలిపేశారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడం, టెక్నాలజీ పెరగడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 2018 నుంచి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. 2018లో మైనింగ్‌కు ఎన్ఎండీసీ బిడ్ దక్కించుకుంది. కానీ రైతుల అభ్యంతరంతో పూర్తి స్థాయి లైసెన్స్ పొందలేకపోయింది. 2026 ప్రారంభంలోనూ టెండర్లు పిలిచినా ఖరారు చేయకుండానే రద్దు చేశారు. ఇప్పుడు మూడో సారి టెండర్లు పిలవగా.. జూలై 9 వరకు బిడ్లు దాఖలు చేయనున్నారు. చిగురుగుంటలో 20 లక్షల టన్నులకు పైగా బంగారం ఖనిజ నిల్వలు ఉండగా.. బిసానత్తంలో 1.7 లక్షల టన్నులకుపైగా ఖనిజం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కుప్పం ప్రాంతంలోని ముడి ఖనిజం సాధారణ రకం కాదని, బంగారం వేరు చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతోపాటు సంక్లిష్టమైన రసాయన క్రియలు అవసరకమంటున్నారు. బంగారం శుద్ధికి భారీ స్థాయిలో నీరు అవసరం అవుతుందంట. జొన్నగిరిలో భూమి ఉపరితలం నుంచి 100-150 మీటర్ల లోతులో బంగారం లభిస్తుంది. కుప్పం ప్రాంతంలో 300 మీటర్ల నుంచి 1000 మీటర్ల లోతు సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. మరి గతంలో కేజీఎస్ చేతులెత్తేసిన చోట ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ఎందవరకు ఫలిస్తాయో చూడాలి.

Publish Date: Jun 29, 2026 6:00PM

political-news-img

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా : సీఎం చంద్రబాబు

యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం జరగాలని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం రూ.50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హౌసింగ్, ట్రంక్ ఇన్ ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ ఫ్రా, సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల లాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140కి పైగా భారీ యంత్రాలు నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్టు మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకమూ లేకుండా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహాలు సజావుగా సాగేందుకు వీలుగా వాటిని వెడల్పు చేస్తున్నమని మంత్రి తెలియచేశారు. దీనిపై స్పందించిన సీఎం భవిష్యత్ నగరంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణంలో పని చేశామన్న బ్రాండ్ ను కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు చేపట్టాలని సూచించారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని .. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పుణ్య క్షేత్రాలు, నదుల నుంచి పవిత్రమైన మట్టి, నీళ్లు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని.. గత పాలకులు ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణాన్ని ఆపేశారని సీఎం అన్నారు. గడచిన రెండేళ్లుగా అమరావతి నిర్మాణాన్ని మళ్లీ గాడిలో పెట్టామన్నారు. అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా నిర్మాణం చేస్తున్న అమరావతిలో భాగస్వాములం అయ్యామన్న ఆలోచనతో కాంట్రాక్టు సంస్థలు పనిచేయాలని సీఎం సూచించారు. పనులు పూర్తి అయ్యాక రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని సీఎం తెలిపారు. నిర్మాణ పనుల వేగంతో పాటు నాణ్యత పై కూడా ఎక్కడా రాజీ లేకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలని పేర్కొన్నారు. అమరావతికి పేరు తెచ్చేలా ఈ భవనాలను నిర్మించాలన్నారు. రాజధాని నిర్మాణంలో చిన్న ఇబ్బందులు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజి, మెగా ఇంజినీరింగ్, ఎన్సీసీ, బీఎస్ఆర్, కేఎంవీ సహా వేర్వేరు కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనులకు సంబంధించిన అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ అధికారులు, వివిధ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

Publish Date: Jun 29, 2026 5:37PM

political-news-img

యూకేలో ఇస్లామిస్ట్ గ్రూమింగ్ గ్యాంగ్స్.. స్థానిక సమస్య నుండి జాతీయ ముప్పు వరకు

యునైటెడ్ కింగ్‌డమ్‌లో గత కొన్ని దశాబ్దాలుగా ఇస్లామిస్ట్ రాడికలైజేషన్, గ్రూమింగ్ గ్యాంగ్స్ కార్యకలాపాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఈ ముప్పు గురించి వచ్చిన ప్రాథమిక హెచ్చరికలను బ్రిటన్ సమాజం, అంతర్జాతీయ మీడియా తీవ్రంగా పరిగణించలేదు. ముస్లింలలో తీవ్రవాద ధోరణులు ఉన్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందనే సాకుతో, ఆనాటి ఆందోళనలను కేవలం జాత్యహంకార పూరితమైనవిగా లేదా అనవసరమైన భయాందోళనలుగా కొట్టిపారేశారు. అయితే, బ్రిటన్‌లోని లూటన్ వంటి నగరాల్లో క్షేత్రస్థాయిలో పెరిగిన సామాజిక ఉద్రిక్తతలు భవిష్యత్తులో దేశం మొత్తం ఎదుర్కోబోయే తీవ్రమైన సంక్షోభానికి స్పష్టమైన నమూనాగా నిలిచాయి. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక వర్గం జనాభా పరంగా మరియు సామాజికంగా ఆధిపత్యం సాధించినప్పుడు, అక్కడ శాంతిభద్రతలకు సంబంధించిన సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తమను తాము శాంతియుతంగా చెప్పుకునే సాధారణ పౌరులు సైతం ఇటువంటి నేరపూరిత ముఠాలను అడ్డుకోవడంలో లేదా ఉగ్రవాద మూలాల గురించి భద్రతా సంస్థలకు సమాచారం అందించడంలో విఫలమవుతున్నారని, దీనివల్ల వారు వ్యవస్థాగతంగా అసంబద్ధంగా మారుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రకమైన దోపిడీ మరియు హింసాత్మక ధోరణులను అణచివేయడానికి ముస్లిమేతర వర్గాలు కేవలం ఆయా సమాజాల అంతర్గత సంస్కరణలపై మాత్రమే ఆధారపడలేవనే వాదన బలంగా వినబడుతోంది. శాంతియుత చర్చలు మరియు సంప్రదింపులు అవసరమే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నేరాలను అడ్డుకోవడానికి అవి సరిపోవట్లేదు. విచిత్రమేమిటంటే, ఈ లైంగిక వేధింపుల ముఠాల సమస్యను పరిష్కరించే నెపంతో ప్రభుత్వం ముస్లిం స్వచ్ఛంద సంస్థలకు భారీగా నిధులు మంజూరు చేయడం కొనసాగిస్తోంది. ఇటువంటి చర్యలు తీవ్ర ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయని, నేరాలను అదుపు చేయడంలో ఇవి అహేతుకమైనవని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాలుగా ఈ రకమైన సామాజిక ముప్పుల గురించి పదే పదే హెచ్చరిస్తున్న ఇతర మైనారిటీ వర్గాలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆర్థిక లేదా నైతిక మద్దతు లభించకపోవడం ఇక్కడి పక్షపాత వైఖరిని స్పష్టం చేస్తోంది. సిక్కు సమాజ క్రియాశీలత, ఆత్మరక్షణ చర్యలు బ్రిటన్‌లో లైంగిక వేధింపుల ముఠాల దారుణాలను ఎదుర్కోవడంలో సిక్కు సమాజం అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా "సిక్కు యూత్ వంటి స్వచ్ఛంద సంస్థలు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఈ రకమైన కేసులలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటూ బాధితులకు అండగా నిలిచాయి. ఈ సమస్యపై జాతీయ స్థాయిలో చర్చ జరగడానికి ఎంతో కాలం ముందే ఈ సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేశాయి. ఈ క్రమంలో, ముఠాల బారిన పడి తీవ్రమైన వేధింపులకు గురవుతున్న పది మంది బాలికలను రక్షించి, వారికి తదుపరి రక్షణ కల్పించడం కోసం విదేశాలకు సైతం తరలించాయి. ఈ రకమైన రక్షణ చర్యలు కేవలం సిక్కు బాలికలకే పరిమితం కాలేదనీ.. వివిధ సామాజిక నేపథ్యాలు ఉన్న ఇతర బాధితులకు కూడా వారు పెద్ద ఎత్తున సహాయం అందించారని నిర్ధారణ అయింది. ఎలాంటి ప్రభుత్వ సహాయం లేదా నిధులు లేకుండా, కేవలం సమాజం అందించిన విరాళాల ఆధారంగానే ఈ ఉమ్మడి ప్రయత్నాలు కొనసాగాయి. ఈ సుదీర్ఘ పోరాటంలో మోహన్ సింగ్ అనే మతపరమైన నాయకుడి పాత్ర అత్యంత కీలకమైనదిగా పేర్కొనబడింది. ఆయన తన ప్రగాఢమైన ఆధ్యాత్మిక భక్తి, ఆకర్షణీయమైన నాయకత్వ లక్షణాలతో గురుద్వారాలలో శక్తిమంతమైన ప్రసంగాలు చేస్తూ, సమాజంలో ఒక బలమైన నైతిక బాధ్యతను, సామూహిక చైతన్యాన్ని రగిల్చారు. దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు, హిందూ దేవాలయాలను సందర్శిస్తూ, లైంగిక వేధింపుల పద్ధతులు ఎలా ఉంటాయి, వాటి హెచ్చరిక సంకేతాలు ఏమిటి?, నేరస్థులు ఏ విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు అనే విషయాలపై తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు క్రమబద్ధమైన అవగాహన సెమినార్లను నిర్వహించారు. శ్వేతజాతి కార్మిక వర్గ సమాజాలలో ఇటువంటి విద్యా కార్యక్రమాలు లేకపోవడం వల్ల ఆ వర్గాల బాలికలు సులభంగా ఈ ముఠాల లక్ష్యాలుగా మారిపోయారని, దానికి భిన్నంగా సిక్కు, హిందూ సంఘాలు ఏర్పాటు చేసుకున్న ఈ అంతర్గత రక్షణ వ్యవస్థ క్షేత్రస్థాయిలో ఒక అద్భుతమైన రక్షణ నమూనాగా నిలిచింది. అయితే, ఈ నేరాల తీవ్రత బహిర్గతమైన తర్వాత కూడా ప్రభుత్వ నిధులు ఎక్కువగా ముస్లిం టాక్సీ సంస్థలకు, ముస్లిం కమ్యూనిటీ సమూహాలకే వెళ్లడం, విజిల్‌బ్లోయర్‌లుగా ఉన్న సిక్కు సంఘాలు ఇప్పటికీ సొంత విరాళాలపైనే ఆధారపడటం ఒక ఆందోళనకరమైన పరిణామం. తొలి విజిల్‌బ్లోయర్‌లపై అణచివేత.. రోథర్‌హామ్ కుంభకోణంతో మారిన పరిస్థితులు ప్రారంభంలో ముస్లిం లైంగిక వేధింపుల ముఠాల గురించి ఆందోళన వ్యక్తం చేసిన సిక్కు సంఘాలను బ్రిటిష్ అధికారిక యంత్రాంగం, అక్కడి మీడియా తీవ్రమైన అనుమానంతో చూశాయి. భారతదేశంలో ఉన్న చారిత్రక సామాజిక ఉద్రిక్తతల కారణంగానే వీరు ముస్లింలపై సామూహికంగా నిందలు వేస్తున్నారని ఆరోపిస్తూ.. వారిని తీవ్ర రైట్ వింగ్ సంస్థలతో సమానంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ రకమైన మతతత్వ ముద్రలు, పక్షపాత ఆరోపణలు, వ్యవస్థీకృత నేరాల వెనుక ఉన్న అసలు నిజాలను సమాజానికి తెలియకుండా దాచడానికి, విజిల్‌బ్లోయర్‌ల ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉపయోగపడ్డాయి. కానీ, ఎప్పుడైతే ప్రసిద్ధ రోథర్‌హామ్ కుంభకోణం పూర్తిగా బయటపడిందో, అప్పటివరకు నిందలు ఎదుర్కొన్న సిక్కు కార్యకర్తల వాదనలు నిజమని తేలింది. దశాబ్దాలుగా వేలాది మంది బాలికలపై జరిగిన దారుణమైన లైంగిక దోపిడీ వివరాలు అధికారికంగా వెలుగులోకి రావడంతో పౌర సమాజం ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. సిక్కు కార్యకర్తలు కేవలం వివక్షతోనే మాట్లాడుతున్నారని కొట్టిపారేయడం అధికారులకు సాధ్యపడలేదు. నిజాలను ధైర్యంగా నొక్కిచెప్పిన విశ్లేషకుల పాత ఇంటర్వ్యూలు, వారు చేసిన వాస్తవ అంచనాలు కాలంతో పాటు సరైనవని నిరూపితమయ్యాయి. రెడ్-గ్రీన్ కూటమి, అంతర్జాతీయ రాజకీయాల వ్యూహాలు ఈ సామాజిక సంక్షోభం వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే, తీవ్ర వామపక్ష ఉద్యమాలు మరియు ఇస్లామిస్ట్ సమూహాల మధ్య ఉన్న ఒక అపవిత్ర పొత్తు స్పష్టమవుతోంది. దీనిని విశ్లేషకులు “రెడ్-గ్రీన్ కూటమి”గా వ్యవహరిస్తున్నారు. సాధారణ ప్రజాస్వామ్య రాజకీయాలకు, ప్రస్తుత సామాజిక వ్యవస్థలను పూర్తిగా విచ్ఛిన్నం చేసి తమకు నచ్చినట్లు పునర్నిర్మించాలని చూసే కరడుగట్టిన కమ్యూనిస్టులు, మార్క్సిస్టుల తీవ్రవాద ధోరణులకు చాలా తేడా ఉంది. ఈ తీవ్ర వామపక్ష శక్తులు ఇస్లామిస్ట్ ఉద్యమాలతో వ్యూహాత్మకంగా చేతులు కలిపాయి. ఎందుకంటే, ప్రస్తుత పాశ్చాత్య వ్యవస్థను పడగొట్టాలనేది ఇరువర్గాల ఉమ్మడి లక్ష్యం. ఇస్లామిస్టులు షరియా ఆధారిత పాలనను కోరుకుంటే, తీవ్ర వామపక్ష రాడికల్స్ ఒక విప్లవాత్మక కమ్యూనిస్ట్ రాజ్యాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. చారిత్రకంగా లెబనాన్ మరియు ఇరాన్ వంటి దేశాలలో జరిగిన పరిణామాలు దీనికి హెచ్చరికలుగా నిలుస్తున్నాయి. ఆయా దేశాలలో అప్పటి ప్రభుత్వాలను కూలదోయడానికి వామపక్ష సమూహాలు ఇస్లామిస్ట్ శక్తులతో కలిసి పనిచేశాయి, కానీ కొత్త ఇస్లామిక్ వ్యవస్థ అధికారాన్ని చేజిక్కించుకున్న వెంటనే మొట్టమొదట ఆ వామపక్ష గ్రూపులనే పూర్తిగా నిర్మూలించింది. ప్రస్తుత ఐరోపాలోని తీవ్ర వామపక్ష కార్యకర్తలు బహిరంగ ప్రదర్శనలలో మరియు హమాస్ అనుకూల ర్యాలీలలో జిహాదీ సమూహాలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా, తమను తాము ద్వేషించే శక్తులకే బలాన్ని చేకూరుస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిహాద్ అనేది కేవలం ఒక నిర్దిష్ట వర్గానికి వ్యతిరేకంగా మాత్రమే కాదని, ప్రస్తుతం తమకు మిత్రులుగా భావిస్తున్న కమ్యూనిస్టులు, మార్క్సిస్టులతో సహా ముస్లిమేతరులందరికీ వ్యతిరేకంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. సిద్ధాంతాల వెనుక శత్రుత్వం, జనాభా మార్పుల అసలు రూపం వివిధ తీవ్రవాద భావజాలాలలో ఉన్న ఉమ్మడి శత్రుత్వాన్ని గమనిస్తే, కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, ఇస్లామిస్ట్ రాడికల్స్ మరియు నియో-నాజీల వంటి అతివాద మితవాద శక్తులు కూడా కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండటంలో ఏకీభవిస్తాయి. సాంప్రదాయకంగా ఒకరికొకరు వ్యతిరేకమైన శక్తులు కూడా ఉమ్మడి శత్రుత్వ వేదికలపై కలిసి కూర్చోవడం ఇందుకు నిదర్శనం. చారిత్రక తీవ్రవాద గ్రంథాలలో కనిపించే భావజాల ద్వేషం కంటే, మతపరమైన ప్రేరణలతో కూడిన శత్రుత్వం మరింత తీవ్రంగా మరియు విస్తృతంగా సమాజంలోకి చొచ్చుకుపోతుందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో, ఐరోపాలో జరుగుతున్న ఈ జనాభా మార్పులను కేవలం ఒక నిర్దిష్ట జాతికి మాత్రమే ఆపాదించడాన్ని విశ్లేషకులు తిరస్కరిస్తున్నారు. దీనిని ఒక అంతర్జాతీయ ఉన్నత వర్గం లేదా "ఒలిగార్కీ" నడుపుతున్న ఒక సుదీర్ఘ ప్రాజెక్ట్‌గా అర్థం చేసుకోవడం సమంజసంగా ఉంటుంది. ఈ ఉన్నత వర్గాలలో అన్ని రకాల నేపథ్యాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. కేవలం సరళమైన జాతి వివరణలు ఎలా విఫలమవుతాయో చెప్పడానికి అంతర్జాతీయ సినిమా పరిశ్రమల రాజకీయ నిధుల సరళిని ఉదాహరణగా పేర్కొనవచ్చు, అక్కడ జాతి కంటే కూడా సైద్ధాంతిక పొత్తులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. సరిహద్దు విధానాలు, ఖతార్ నిధులు, ఐరోపా భద్రత ఆఫ్ఘనిస్తాన్ వంటి తీవ్రవాద పీడిత దేశాలలో దాదాపు 99 శాతం మంది ప్రజలు కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేయడాన్ని సమర్థిస్తున్నారని వివిధ సర్వేలు చెబుతున్నాయి. అటువంటి ప్రాంతాల నుండి భారీగా వలస వచ్చిన పౌరులు ఐరోపాకు వెళ్లినప్పుడు కూడా తమ పాత సామాజిక అభిప్రాయాలను వదులుకోరు. దీనివల్ల సరిహద్దులు తెరిచి ఉంచే ఉదారవాద వలస విధానాలు, మహిళలు మరియు మైనారిటీల పట్ల అసహనపూరితమైన, మధ్యయుగపు వైఖరులను ఐరోపా సమాజంలోకి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ ధోరణులకు సౌదీ అరేబియా మరియు ఖతార్ వంటి దేశాల నుండి వచ్చే విదేశీ నిధులు మరింత అదనపు బలాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా ఖతార్ దేశం అంతర్జాతీయంగా ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థలకు మరియు ఐరోపా అంతటా సాంస్కృతిక, రాజకీయ ఆధిపత్య ప్రాజెక్టులను నడిపే సమూహాలకు దాదాపు ఒక బిలియన్ పౌండ్ల నిధులను సమకూర్చుతోందని ఆరోపణలు ఉన్నాయి. విదేశాలలో తీవ్రవాదాన్ని ప్రేరేపించే ఉద్యమాలకు నిధులు ఇస్తూనే, తమ సొంత మీడియా సంస్థలకు గట్టి భద్రతను కల్పించుకోవడంలో ఉన్న కపటత్వాన్ని అంతర్జాతీయ సమాజం విమర్శిస్తోంది. ఇటువంటి నిరంతర వలసలు మరియు జనన రేట్ల మార్పుల వల్ల ఐరోపా భватиష్యత్తు తన సాంప్రదాయ క్రైస్తవ, చారిత్రక స్వభావాన్ని కోల్పోయి, తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలకు వేదికగా మారే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పత్రాలు, ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం ప్రస్తుత జాతీయ ప్రభుత్వాలు తీసుకుంటున్న అంతర్జాతీయ నిర్ణయాలు, ముఖ్యంగా సరిహద్దులు తెరిచి ఉంచే సామూహిక వలసల విధానాలు స్థానిక యూరోపియన్ జనాభా ప్రయోజనాలకు నేరుగా విరుద్ధంగా ఉన్నాయి. ఈ జనాభా పరివర్తన యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు, ఇది ప్రణాళికాబద్ధంగా అధికార యంత్రాంగాలచే నిర్వహించబడుతుందని చెప్పడానికి ఐక్యరాజ్యసమితి (UN) గతంలో విడుదల చేసిన "జనాభా భర్తీ" (Replacement Migration) కి సంబంధించిన 177 పేజీల అధికారిక పత్రమే ఒక స్పష్టమైన సాక్ష్యం. సాధారణ పౌరులు ఇటువంటి అధికారిక పత్రాలను లోతుగా పరిశోధించడానికి సమయాన్ని వెచ్చించరనే నమ్మకంతోనే, ప్రభుత్వ అధికారులు ఈ విధానాలను విమర్శించే వారిని కుట్ర సిద్ధాంతకర్తలుగా ముద్రవేసి కొట్టిపారేస్తున్నారు. అయితే, తీవ్ర కుడిపక్షాలు ప్రచారం చేసే పిచ్చి కుట్ర సిద్ధాంతాలకు, వాస్తవంగా జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యూహాలకు చాలా తేడా ఉంది. అసమ్మతిని అణచివేయడానికి మరియు పౌరుల నోళ్లు నొక్కడానికి పాలక వర్గాలు తీవ్రవాద ఆరోపణలను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయి. శాంతియుత విప్లవం కోసం పిలుపు బ్రిటన్ మరియు ఐరోపా యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. ఇస్లామిస్ట్ ప్రభావం, జనాభా మార్పులు మరియు ప్రభుత్వ సంస్థల నిరసన లేని సహకారం వల్ల పదేళ్ల తర్వాత తమ పిల్లల జీవితాలు ఎంత ప్రమాదంలో పడబోతున్నాయో సాధారణ బ్రిటిష్ పౌరులు త్వరగా గ్రహించాల్సి ఉంది. ఈ సామాజిక పరిణామాలను చట్టబద్ధంగా మార్చడానికి ఒక నాటकीय రాజకీయ మార్పు అవసరం. జాతీయ భద్రత, సామాజిక సమైక్యత మరియు స్థానిక ప్రజల హక్కులను కాపాడుకోవడానికి పౌరులందరూ ఏకమై ఒక “శాంతియుత విప్లవం” వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విప్లవం అంటే ఎటువంటి హింసాత్మక తిరుగుబాటు కాదు; బహిరంగ సరిహద్దుల వలస విధానాలను నిలిపివేయడం, జనాభా పునఃస్థాపనను అడ్డుకోవడం మరియు తీవ్రవాద సమూహాలను బుజ్జగించే రాజకీయాలకు స్వస్తి పలికి, రాజకీయ నాయకత్వంలో ఒక ప్రాథమిక పునర్వ్యవస్థీకరణను తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. చట్టపరంగా, సాంస్కృతికంగా నిరంకుశ ఇస్లామిక్ రాజ్యాలుగా బ్రిటన్ మరియు యూరప్ మారకుండా ఉండాలంటే, ప్రజా సమాజం నుండి ఒక బలమైన మరియు నిర్ణయాత్మక ప్రతిస్పందన తక్షణమే వ్యక్తమవ్వాలి. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 29, 2026 5:18PM

political-news-img

తమిళనాడులో ఆరు నెలల్లో ఎన్నికలు...స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చెన్నైలో నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో ఏఐఏడీఎంకే మాజీ మంత్రి బెంజమిన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదని స్టాలిన్ ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సి ఉండగా, అధికార పక్షానికి కేవలం 108 మంది సభ్యుల బలమే ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని అన్నారు. గత కొన్ని నెలలుగా తమిళనాడులో అభివృద్ధి మందగించిందని స్టాలిన్ ఆరోపించారు. శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు, పెట్రోల్ బాంబు దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల విషయంలో వెనుకంజ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రకటన కోసం ఎదురుచూడకుండా, ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని, డీఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్టాలిన్ సూచించారు. మరోవైపు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తమిళనాడు పాలన నేడు గాడితప్పిందని వ్యాఖ్యానించారు. ప్రజలు తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలకే పరిమితమైందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించే వేదికలుగా కాకుండా, రాజకీయ ప్రదర్శనల వేదికలుగా మారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

Publish Date: Jun 29, 2026 5:03PM

MOVIE NEWS