Home » Others » హిందూజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత


 

హిందూజా గ్రూప్ ఛైర్మన్  గోపీచంద్ పి.హిందూజా (85) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న హిందూజా లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశారు. హిందుజా ఫ్యామిలీలో రెండో తరానికి చెందిన గోపీచంద్‌ 2023లో గ్రూప్‌ సంస్థలకు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సోదరుడు శ్రీచంద్‌ మరణానంతరం ఆ బాధ్యతలు స్వీకరించారు. 

గోపీచంద్‌ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజయ్‌, ధీరజ్‌, కుమార్తె రీతా ఉన్నారు.ఇండో- మిడిల్‌ ఈస్ట్‌ ట్రేడింగ్‌ ఆపరేషన్స్‌ నిర్వహించే సంస్థను అంతర్జాతీయ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలపడంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఎనర్జీ, ఆటోమోటివ్‌, మీడియా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యాపారాలను ప్రస్తుతం హిందూజా గ్రూప్‌ నిర్వహిస్తోంది