|
|
.webp)
ఛత్తీస్ గఢ్ లో రైలు ప్రమాదం జరిగింది. బిలాస్పూర్ స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ ట్రెయిన్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయకార్యక్రమాలను చేపట్టారు.
పలుబోగీలు పట్టాలు తప్పాయి. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యంత బిజీగా ఉండే బిలాస్ పూర్ -హౌరా మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.