Home » Others » జైలు నుంచి ఆస్పత్రికి చెవిరెడ్డి


ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో చెవిరెడ్డి భాస్కరరెడ్డిని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. తన ఆరోగ్యం బాగా లేదంటూ చెవిరెడ్డి చెప్పడంతో వైద్య పరీక్షల కోసం ఆయనను మంగళవారం (నవంబర్ 4) మంగళగిరిలోని ఎయిమ్స్ కు తరలించారు. 3 వేల 200 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో  చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి,  వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ లపై రెండో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  మద్యం కుంభకోణం ద్వారా వైసీపీ నాయకులు నెలనెలా 60 నుంచి 70 కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారని పేర్కొంది.

 అలాగే 250 నుంచి 350 కోట్ల రూపాయల వరకూ గత ఎన్నికలలో  చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో పార్టీ అభ్యర్థుల ప్రచారానికి వినియోగించారనీ సీట్ తన చార్జిషీట్ లో పేర్కొంది.   ఈ మొత్తం వ్యవహారం అంతా చెవిరెడ్డి భాస్కరరెడ్డి కనుసన్నలలో జరిగిందని సిట్ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా మద్యంముడుపుల సొమ్ములు చెవిరెడ్డికి చేరినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. అలాగే సిట్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ చెవిరెడ్డి గన్ మెట్లు మదన్ రెడ్డి, గిరి చేసిన ఆరోపణలను సిట్ రాజకీయప్రేరిపితమైనవిగా కొట్టి పారేశారు.