Home » Others » రేపు మహిళ ప్రపంచ కప్ విజేతలకు ప్రధాని ఆతిథ్యం


 

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో విజయాన్ని సాధించిన భారత ఉమెన్ క్రికెట్ జట్టుకు ప్రధాని మోదీ అతిథ్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి బీసీసీఐకి ఆహ్వానం అందింది. రేపు ఢిల్లీలో ప్రధాని మోదీతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సమావేశం కానున్నారు.ఆదివారం జరిగిన  ప్రపంచకప్‌-2025 ఫైనల్లో భారత్‌ జట్టు దక్షిణాప్రికాపై విజేతగా  నిలిచిందన సంగతి తెలిసిందే. 

ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. తొలి వరల్డ్‌కప్‌ టైటిల్‌ను ముద్దాడింది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని బీసీసీఐ జట్టుకు రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది.