|
|

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సోమవారం (నవంబర్ 3) తిరుమలకు వచ్చిన ఓ మహిళ అందరి దృష్టినీ ఆకర్షించుకుంది. ఆమెను తిరుమల ప్రాంగణంలో అందరూ ఆసక్తిగా చూశారు. ఇంతకీ ఆమె అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణం ఆమె పొడుగు. ఏడడుగుల పొడుగున్న ఆమె తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఇంతకీ ఆమె ఎవరంటే శ్రీలంక జాతీయ నెట్ బాల్ జట్టులో మాజీ క్రీడాకారిణి. పేరు తర్జని శివలింగం. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి నేతృత్వంలోని భక్త బృందంతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు అడుగుల ఎత్తుతో ఉన్న ఆమె ఉన్నంత సేపు ఆలయ పరిసరాలలో సందడి వాతావరణం నెలకొంది. చాలా మంది భక్తులు ఆమెను పరిచయం చేసుకుని వివరాలడిగి తెలుసుకోవడం కనిపించింది.