Home » Others » చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న హెచ్‌ఆర్సీ


 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రమాదానికి గల కారణాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక డిసెంబర్ 15వ తేదీ ఉదయం 11 గంటలలోపు సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. 

ఈ ప్రమాదానికి కారణం టిప్పర్ వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమని స్థానికులు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బస్సుపైకి దూసుకొచ్చిన టిప్పర్ బోల్తా పడటంతో.. దాంట్లో ఉన్న కంకర మొత్తం ప్రయాణికులపై పడటంతో అందులో కూరుకుపోయి 24 మంది ప్రాణాలు కోల్పోయాన సంగతి విధితమే